Begin typing your search above and press return to search.

లోకేష్‌ను అన‌లేదు.. ప‌శ్చాత్తాపం వ్య‌క్తం చేస్తున్నా: నారాయ‌ణ స్వామి

By:  Tupaki Desk   |   23 March 2022 9:35 AM GMT
లోకేష్‌ను అన‌లేదు.. ప‌శ్చాత్తాపం వ్య‌క్తం చేస్తున్నా: నారాయ‌ణ స్వామి
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స‌మావేశాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. క‌ల్తీసారా, మ‌ద్యం విష‌యాల‌పై టీడీపీ నేత‌లు ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తుంటే.. పెగాస‌స్ వ్య‌వ‌హారంతో టీడీపీకు చెక్ పెట్టాల‌ని వైసీపీ చూస్తోంది. ఈ సంద‌ర్భంగా ఇరు పార్టీల నేత‌లు ఒక‌రిపై ఒక‌రు తీవ్ర స్థాయిలో కామెంట్లు చేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో స‌భ‌లో టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌పై డిప్యూటీ సీఎం నారాయ‌ణ స్వామి చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. స‌భ‌లో లోకేష్‌ను దూషించారంటూ టీడీపీ ఎమ్మెల్సీలు డిప్యూటీ సీఎంపై మండ‌లి ఛైర్మ‌న్‌కు ప్రివిలేజ్ నోటీసిచ్చారు. మండ‌లి నియామ‌వ‌ళి ప్ర‌కారం రూల్ 173 ప్ర‌కారం ఛైర్మ‌న్‌కు ప్ర‌విలేజ్ నోటీసిచ్చారు.

తాజాగా డిప్యూటీ సీఎం నారాయ‌ణ స్వామి మాత్రం లోకేష్‌ను ఉద్దేశించి ఎలాంటి అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌లేద‌ని పేర్కొన్నారు. మంత్రివ‌ర్గ పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌తో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఇబ్బందులు వ‌స్తాయంటూ ఓ వ్య‌క్తి ఫోన్ చేసి త‌న‌తో మ‌ట్లాడార‌ని నారాయ‌ణ స్వామి చెప్పారు. ఆ వ్యక్తిని ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్య‌ల‌ను లోకేష్ ఆపాదించుకుంటున్నార‌ని అన్నారు. స‌భ‌లో అలాంటి కామెంట్లు చేయ‌కూడ‌ద‌ని అందుక ప‌శ్చాత్తాపం వ్య‌క్తం చేస్తున్నాన‌ని ఆయ‌న తెలిపారు.

త‌మ నాయ‌కుడు జ‌గ‌న్ను ఉద్దేశించి నారా లోకేష్ అమ‌ర్యాద‌గా మాట్లాడార‌ని మండిప‌డ్డ నారాయణ స్వామి ఇష్ట‌మొచ్చిన వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఒరేయ్‌.. అని సంబోధిస్తూ నారాయ‌ణ బూతులు మాట్లాడార‌ని టీడీపీ ఆరోపిస్తోంది. దీంతో ప్రివిలేజ్ నోటీసిచ్చారు. అయితే తాను లోకేష్‌ను ఆ వ్యాఖ్య‌లు అన‌లేద‌ని నారాయణ ఇప్పుడు చెప్పారు.

"న‌న్ను ఏ స్థాయిలో రెచ్చ‌గొడితే అలా మాట్లాడానో గ‌మ‌నించాలి. బ‌డుగులకు న్యాయం చేస్తున్న ప్రభుత్వాన్ని కూల‌గొడ‌తామంటే కోపం రాదా? సీఎం జ‌గ‌న్‌ను వాడూ వీడూ అంటు ఇష్టం వ‌చ్చిన‌ట్లు లోకేష్ మాట్లాడుతున్నారు. మ‌ద్య నిషేదం, నియంత్ర‌ణ గురించి మాట్లాడే హ‌క్కు చంద్ర‌బాబుకు లేదు. య‌న‌మ‌ల వియ్యంకుడికి, అయ్య‌న్న‌పాత్రుడు వంటి నేత‌లు మ‌ద్యం డిస్ట‌ల‌రీలు న‌డుపుతున్నారు. ఇటీవ‌ల అయ్య‌న్న‌పాత్రుడు వాటిని అమ్ముకున్నారంటా. ప‌దవుల కోసం టీడీపీ వాళ్ల‌లా మేము అర్రులు చాచం. ఎస్సీల‌ను బాబు చుల‌క‌న‌గా చూస్తారు. లోకేష్ వంటి వారు అబ‌ద్ధాల్లో పెరిగి ఇప్పుడు వాటితోనే రాజ‌కీయాలు చేస్తున్నారు. బాబు ఏనాడైనా ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్నారా? ఆయ‌న‌లో ఇంకా మార్పు రాలేదు. జ‌గ‌న్ పాల‌న రామ‌రాజ్యాన్ని త‌ల‌పిస్తోంది. ఖ‌రీదైన మ‌ద్యాన్ని 10 నుంచి 15 ఏళ్ల పాటు తాగితే శ‌రీరంలో ఆల్య‌హాల్ ఉంటుంది. తాగుడుకు అల‌వాటు ప‌డిన వాళ్ల ఆరోగ్యం స‌రిగా ఉండ‌దు" అని నారాయ‌ణ స్వామి తెలిపారు.