Begin typing your search above and press return to search.
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు మీడియాకు నో ఎంట్రీ?
By: Tupaki Desk | 16 Jun 2020 6:30 AM GMTరాష్ట్రం ఏదైనా కావొచ్చు.. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయంటే అదో సందడిగా మారుతుంది. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. మంత్రులు.. ముఖ్యమంత్రితో పాటు.. విపక్ష నేతలతో పాటు ప్రభుత్వంలోని కీలక అధికారులంతా ఒకే చోటుకు చేరే అవకాశం ఒక్క అసెంబ్లీ సమావేశాల సమయంలోనే చోటు చేసుకుంటుంది. దీంతో..పలు రాజకీయ పరిణామాలకు.. హాట్ హాట్ సన్నివేశాలకు అవకాశం ఉంటుంది.
ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ కత్తి మీద సాము లాంటిదే. సాంకేతికంగా చూసినప్పుడు తప్పనిసరిగా అసెంబ్లీ సమావేశాల్ని నిర్వహించాల్సి రావటంతో ఏపీ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్ని రెండు రోజుల్లో పూర్తి చేసేందుకు వీలుగా కార్యాచరణను రూపొందించింది.
మహమ్మారి వణికిస్తున్న వేళ.. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే సభ్యులందరికి కరోనా పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. అంతేకాదు.. అసెంబ్లీకి ఎమ్మెల్యేలు వచ్చే దారిలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్ని బాగానే ఉన్నా.. ఈ బడ్జెట్ సమావేశాల్లో మీడియాకు ఎంట్రీ లేకుండా చేయటంపై విస్మయం వ్యక్తమవుతోంది. అసెంబ్లీ సమావేశాల సమయంలో మీడియా పాత్ర కీలకంగా ఉంటుంది. ఆ మాటకు వస్తే.. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందే మీడియాలో అధికార.. విపక్ష నేతలు మాట్లాడుతుంటారు.
మహమ్మారి విరుచుకుపడుతున్న వేళ.. మీడియా ఎంట్రీకి నో చెబుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై విస్మయం వ్యక్తమవుతోంది. ఒకవేళ వైరస్ భయం ఉంటే.. కచ్ఛితమైన భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకొని ఉంటే బాగుండేది. అందుకు భిన్నంగా మీడియాకు ప్రవేశం లేదని చెప్పటం సరికాదన్న వాదన వినిపిస్తోంది. లాబీల్లోకి.. మీడియా పాయింట్ల వద్దకు జర్నలిస్టులను అనుమతించకుండా.. కొద్దిమందిని మాత్రం గ్యాలరీలో కూర్చునేందుకు అనుమతించనున్నారు. ఇక.. టీవీ ఛానళ్లకు విజయవాడ ఆర్ అండ్ బీ కార్యాలయం వద్ద లైవ్ ఫీడ్ అందజేస్తామని.. అక్కడి నుంచి రిపోర్టింగ్ చేసుకోవాలన్న సూచనలు వచ్చాయి. మొత్తంగా మీడియా లేని అసెంబ్లీ సమావేశాలుగా నిలిచిపోతాయని చెప్పొచ్చు.