Begin typing your search above and press return to search.

కులాల‌తో రెండుగా చీలిన ఏపీ భ‌వ‌న్‌

By:  Tupaki Desk   |   21 Dec 2017 2:24 PM GMT
కులాల‌తో రెండుగా చీలిన ఏపీ భ‌వ‌న్‌
X
ఢిల్లీలోని ఏపీ భ‌వ‌న్ మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చింది. త‌ర‌చూ ఏదో ఒక అంశంపై వార్త‌ల్లోకి వ‌చ్చే ఏపీ భ‌వ‌న్ తాజాగా అధికారుల మ‌ధ్య మాట‌ల యుద్ధం.. కులాల లొల్లి పెను వివాదంగా మారింది. తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాల‌తో ఏపీ భ‌వ‌న్ రెండు ముక్క‌లైన‌ట్లుగా చెబుతున్నారు.

అగ్ర‌వ‌ర్ణాలు.. ద‌ళితులు రెండువ‌ర్గాలుగా మొద‌లైన గొడ‌వ అంత‌కంత‌కూ పెర‌గ‌ట‌మే కాదు.. వాట్సాప్ మాథ్య‌మంగా మాటల యుద్ధంగా మారింది. అస‌లీ వివాదం ఎక్క‌డ మొద‌లైందంటే.. త‌న‌కు ప్ర‌మోష‌న్ రాకుండా అగ్ర‌వ‌ర్ణ అధికారులు అడ్డుకున్నారంటూ ఆనంద‌రావు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఏపీ భ‌వ‌న్‌ కు రెసిడెంట్ క‌మిష‌న‌ర్ గా ఉన్న స‌మ‌యంలో ముగ్గురు స‌హాయ క‌మిష‌న‌ర్లు.. ఒక జాయింట్ క‌మిష‌న‌ర్ పోస్టు మంజూరు చేయాల‌న్న సిఫార్సు చేస్తే.. పోస్టులు రెండుకు కుదించేలా అగ్ర‌కుల అధికారులు ఒత్తిడి చేశార‌ని ఆరోపిస్తున్నారు. ఇలా చేయ‌టం ద్వారా త‌న‌కు ద‌క్కాల్సిన ప‌దోన్న‌తిని అడ్డుకుంటున్న‌ట్లుగా ఆనంద‌రావు వాట్సాప్ లో మెసేజ్ పెట్టిన‌ట్లుగా చెబుతున్నారు.

దీనికి బ‌దులుగా ప్రాప్తం లేన‌ప్పుడు ఏం చేసినా ఫ‌లితం ఉండ‌ద‌ని.. క్షీర‌సాగ‌ర మ‌ధ‌నంలో రాక్ష‌సులు ఎంత క‌ష్ట‌ప‌డ్డా.. ప్ర‌యోజ‌నం లేక‌పోయిందంటూ డిప్యూటీ క‌మిష‌న‌ర్ సూర్య‌నారాయ‌ణ రివ‌ర్స్ లో ఇచ్చిన మెసేజ్ ఈ వ్య‌వ‌హారాన్ని మ‌రింత పెంచేలా చేసింది. దీంతో.. ఈ వివాదం వాట్సాప్ మెసేజ్ ల స్థాయి నుంచి పోలీసు స్టేష‌న్ల వ‌ర‌కూ వెళ్లింది. ద‌ళిత ఉద్యోగినైన త‌న‌ను కించ‌ప‌రిచేలా చేస్తున్నారంటూ ఆనంద‌రావు తిల‌క్ మార్గ్ పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేస్తూ.. సూర్య‌నారాయ‌ణ మీద ఎస్సీ..ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలంటూ ఫిర్యాదు చేశారు. ఇలా ఇద్ద‌రు ఉద్యోగుల మ‌ధ్య మొద‌లైన మెసేజ్ ల యుద్ధం చివ‌ర‌కు పోలీస్ స్టేష‌న్ల వ‌ర‌కూ వెళ్ల‌టం హాట్ టాపిక్ గా మారింది.