Begin typing your search above and press return to search.

క‌మ్మ‌ల‌పై బీజేపీ క‌న్ను.. ఏం చేస్తున్నారంటే!

By:  Tupaki Desk   |   18 Nov 2021 1:30 AM GMT
క‌మ్మ‌ల‌పై బీజేపీ క‌న్ను.. ఏం చేస్తున్నారంటే!
X
ఏపీ బీజేపీ త‌న పంథా మార్చుకుంది. ఇప్ప‌టి వ‌రకు బీజేపీ సిద్ధాంతాలు.. హిందూత్వ అజెండాను ప‌ట్టుకు ని ముందుకు సాగిన బీజేపీ నాయ‌కులు.. ఇప్పుడు.. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఉన్న సెంటిమెంటును, సామాజిక వ‌ర్గాల బ‌లాన్ని.. అంచ‌నా వేసుకుని ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప‌రిస్థితుల‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించేలా ప‌క్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.

ఇలా.. ఇప్పుడు ఏపీపై కూడా ప్ర‌త్యేక కార్యా చ‌ర‌ణ‌తో ముందుకు సాగాల‌ని బీజేపీ నేత‌లు నిర్ణ‌యించారు. ఇటీవ‌ల తిరుప‌తిలో ప‌ర్య‌టించిన‌.. బీజేపీ అగ్ర‌నేత‌.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. చివ‌రిరోజు ప‌ర్య‌ట‌న‌లో ఏపీ బీజేపీపై దృష్టిపెట్టారు.

ఈ క్ర‌మంలో ప్ర‌ధానంగా.. ఆయ‌న క‌మ్మ సామాజిక వ‌ర్గం ఓట్ల వివ‌రాల‌ను.. ఏయే జిల్లాల్లో వారి వ‌ర్గం బ‌లంగా ఉందో తెలుసుకున్నారు. అదేస‌మ‌యంలో గ‌త ఎన్నిక‌ల్లో వ‌చ్చిన ఫ‌లితాల‌ను కూడా అంచ‌నా వేసుకున్నారు. క‌మ్మ సామాజిక‌వ ర్గం అంటే.. టీడీపీకి అనుకూలంగా ఉండే వ‌ర్గంగా పేరుంది.

అయితే.. ఇదే విష‌యాన్ని క్రాస్ చెక్ చేసిన అమిత్ షా.. పూర్తిగా క‌మ్మ వ‌ర్గం.. టీడీపీకి అనుకూలంగా లేద‌ని.. క‌మ్మ వ‌ర్గం బ‌లంగా ఉన్న చోట కూడా.. వైసీపీ నాయ‌కులు విజ‌యం సాధించార‌ని.. సో.. క‌మ్మ వ‌ర్గంలోనూ చీలిక వ‌చ్చింద‌ని.. అలాంటి గ్యాప్‌ను మ‌నం స‌ద్వినియోగం చేసుకుందామ‌ని.. ఆయ‌న ప్ర‌తిపాదించారు.

ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు దూర‌మైన‌.. అవుతున్న క‌మ్మ సామాజిక‌వ‌ర్గాన్ని బీజేపీకి చేరువ చేసేందుకు.. ఏకంగా.. పార్టీ కీల‌క నాయ‌కురాలు.. కేంద్ర మాజీ మంత్రి.. పురందేశ్వ‌రికి అప్ప‌గించార‌ని తెలిసింది. అదేవిధంగా.. క‌మ్మవ‌ర్గం.. నేత‌ల‌కు బీజేపీ ఇస్తున్న ప్రాధాన్యాన్ని కూడా ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్లాల ని.. ఆయ‌న సూచించారు.

రెండుసార్లు రాష్ట్ర బీజేపీ అధ్య‌క్ష ప‌గ్గాల‌ను ఈ సామాజిక వ‌ర్గానికే ఇచ్చిన విష‌యాన్ని, ఎంపీగా టికెట్లు ఇచ్చిన విష‌యాన్ని కూడా బ‌లంగా ఆ వ‌ర్గంలోకి తీసుకువెళ్ల‌డంతోపాటు.. ఇప్పుడు వారు ఎదుర్కొంటున్న ప్ర‌ధాన స‌మ‌స్య అయిన అమ‌రావ‌తి రాజ‌ధానికి పూర్తిగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాల‌ని కూడా రాష్ట్ర నేత‌ల‌కు సూచించారు.

“చంద్ర‌బాబుకు క‌మ్మ సామాజిక వ‌ర్గం అండ ఉంద‌ని అంటున్నారు. అయితే.. ఆ వ‌ర్గ‌మే అండ ఉంటే.. ఆయ‌న ఎందుకు ఓడిపోయారు? అంటే.. ఆ వ‌ర్గంలోనూ చంద్ర‌బాబును వ్య‌తిరేకించే నాయ‌కులు ఉన్నారు. అదేవిధంగా ప్ర‌జ‌ల్లోనూ ఉన్నారు. సో.. ఇప్పుడు వారిని మ‌నం చేర‌దీద్దాం.

వారికి ఏం కావాలో ఏం కోరుకుంటున్నారో.. చూడండి. నాకు త్వ‌ర‌లోనే నివేదిక ఇవ్వండి. అంతా నేను చూసుకుంటాను” అని షా తేల్చి చెప్పిన‌ట్టు బీజేపీ వ‌ర్గాల మ‌ధ్య చ‌ర్చ న‌డుస్తోంది. దీంతో ఇప్పుడు.. రాష్ట్ర బీజేపీ నాయ‌కులు క‌మ్మ వ‌ర్గాన్ని చేర‌దీసే ప‌నిలో ప‌డ్డార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏమేర‌కు వారికి గుర్తింపు ఇస్తారో చూడాలి.