Begin typing your search above and press return to search.

హైకోర్టును స్వాగ‌తిస్తున్నామంటే.. మూడుకు జైకొట్టిన‌ట్టేగా.. క‌మ‌ల నాథా?

By:  Tupaki Desk   |   10 Oct 2022 12:30 AM GMT
హైకోర్టును స్వాగ‌తిస్తున్నామంటే.. మూడుకు జైకొట్టిన‌ట్టేగా.. క‌మ‌ల నాథా?
X
ఔను! బీజేపీ ఏపీ నేత‌లు.. డ‌బుల్ గేమ్ ఆడుతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. మూడు రాజ‌ధాను ల కు వ్య‌తిరేకంగా .. రాజ‌ధాని అమ‌రావ‌తి రైతుల‌కు మ‌ద్ద‌తిస్తున్నామ‌ని.. చెబుతున్న క‌మ‌ల నాథులు అదేస మయంలో వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు.. చేస్తున్న డిమాండ్లు వింత‌గా ఉన్నాయ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఎలాగంటే.. వైసీపీ స‌ర్కారు ప్ర‌తిపాదించిన మూడు రాజ‌ధానుల్లో క‌ర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయ‌డం కూడా ఉంది. త‌ద్వారా.. సీమ‌లోని క‌ర్నూలు జిల్లాను న్యాయ‌రాజ‌ధానిని చేస్తామ‌ని చెబుతున్నారు.

దీనిపై కూడా.. అమ‌రావ‌తి రైతులు ఉద్య‌మిస్తున్నారు. అమ‌రావ‌తిని ఏకైక‌రాజ‌ధాని చేయాల‌ని.. అక్క‌డే ఉన్న హైకోర్టును అక్క‌డే కొన‌సాగించాల‌ని.. మార్చ‌డానికి వీల్లేద‌ని కూడా.. చెబుతున్నారు. అయితే.. మూడు రాజ‌ధానుల‌కు వ్య‌తిరేక‌త‌మ‌ని చెబుతున్న బీజేపీ నాయ‌కులు.. మాత్రం క‌ర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాల‌ని మాత్రం డిమాండ్ చేస్తున్నారు. మ‌రి ఇదేం చిత్ర‌మైన ప్ర‌తిపాద‌నో వారికే తెలియాలి.

హైకోర్టు క‌ర్నూలుకు త‌ర‌లిపోతే.. ఇక రాజ‌ధానిలో న్యాయ‌స్థానం ఉండ‌దు క‌దా! అంటే వైసీపీ చెబుతున్న న్యాయ రాజ‌ధాని క‌ర్నూలుకు వెళ్లిపోవ‌డాన్నే.. బీజేపీ నేత‌లు కోరుతున్నార‌నేది స్ప‌ష్టంగా తెలుస్తోంది. మ రి దీనిని బ‌ట్టి.. బీజేపీ నేత‌ల అమ‌రావ‌తి డిమాండ్ కానీ, ఇక్క‌డి రైతుల‌కు ఇస్తున్న మ‌ద్ద‌తు విష‌యంపై కానీ.. అనేక సందేహాలు వ‌స్తున్నాయి. లోపాయికారీగా.. వైసీపీ చేస్తున్న డిమాండ్‌ను వారు కూడా భుజాల కు ఎత్తుకున్న‌ట్టే క‌దా.. ?మ‌రి.. రాజ‌ధాని రైతుల ప‌క్షాన ఏం నిల‌బ‌డిన‌ట్టు? ఇదీ.. సాధార‌ణ పౌరుడు సైతం సంధిస్తున్న ప్ర‌శ్న‌.

ఎందుకంటే.. అమ‌రావతి రైతులు రెండో రాజ‌ధాని వ‌ద్ద‌ని చేయ‌డం లేదు. అస‌లు మూడు రాజ‌ధానుల మాటే వ‌ద్ద‌ని చెబుతున్నారు. ఏకైక రాజ‌ధానిగా(శాస‌న‌, న్యాయ‌, పాల‌న‌) అమ‌రావ‌తినే ఉంచాల‌ని.. ఉండా ల‌ని .. వారు ప‌ట్టుబ‌డుతున్నారు. దీనికి బీజేపీ కూడా.. మ‌ద్ద‌తిస్తున్న‌ట్టు నాయ‌కులు చెబుతున్నారు. వారి పాద‌యాత్ర‌లోనూ.. పాల్గొంటున్నారు. కానీ, ఇప్పుడు బీజేపీ నాయ‌కులు మాత్రం క‌ర్నూలులో న్యాయ రాజ‌ధాని ఏర్పాటు చేయాల‌ని.. దీనికి మ‌ద్ద‌తివ్వాల‌ని.. టీడీపీని డిమాండ్ చేయ‌డం వంటి ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. వీరు రాజ‌ధాని రైతుల విష‌యంలో డ‌బుల్ గేమ్ ఆడుతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.