Begin typing your search above and press return to search.
పాదయాత్ర ఆలోచనలో ఏపీ బీజేపీ.. సక్సెస్ అయ్యేనా?
By: Tupaki Desk | 30 Aug 2021 9:30 AM GMTపులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు అన్నారు పెద్దలు. కొందరి ఆలోచనలు.. చూస్తే.. ఎందుకో..ఈ మాటే గుర్తుకు వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అధికారంలోకి రావడమే ధ్యేయంగా బీజేపీ పనిచేస్తు న్న విషయం తెలిసిందే. అయితే.. తెలంగాణ పరిస్థితిని తీసుకుంటే.. ఇక్కడ కొంత మేరకు కేడర్ బాగానే ఉంది. దుబ్బాక ఉప ఎన్నికలోనూ, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలోనూ బీజేపీ పుంజుకుంది. ఈ క్రమం లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నా రు. ఒకవైపు ప్రభుత్వంపై రాజీలేని పోరు చేస్తున్నారు. మరోవైపు పార్టీని బలోపేతం చేస్తున్నారు.
ప్రస్తుతం బండి సంజయ్.. తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నారు. ఇంతవరకుబాగానే ఉంది. అయితే..ఇ ప్పుడు ఇదే ఐడియాను.. ఏపీలోనూ అమలు చేయాలని ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు అనుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే.. ఇది సాధ్యమేనా? ఏపీకి.. తెలంగాణ బీజేపీకి మధ్య వ్యత్యాసం లేదా? అనేది విశ్లేషకుల ప్రశ్న. ఎందుకంటే.. ఏపీ కంటే తెలంగాణలో పార్టీ కేడర్ బాగుంది. పైగా మాస్ నాయకుడిగా.. ఫైర్ బ్రాండ్ నేతగా.. బండి సంజయ్ గుర్తింపు పొందారు. అంతేకాదు.. ఆయన వయసులోనూ సోము కన్నా తక్కువే.
ఈ నేపథ్యంలో బండి సంజయ్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారంటే.. అర్ధం ఉందని అంటున్నా రు. కానీ, ఏపీలో ఇప్పటికీ.. బీజేపీ పుంజుకునే పరిస్థితి లేకుండా పోయింది. పైగా అంతర్గత వివాదాలతో బీజేపీ తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతోంది. ఈ నేపథ్యంలో సోము వీర్రాజు.. వ్యూహం బెడిసికొట్టడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. మరోవైపు.. సోము మాత్రం.. మరో ఆరు మాసాల్లో పాదయాత్ర చేస్తానని తన అనుచరులోచెప్పుకొస్తున్నారట. దీనికి సంబంధించి.. వ్యూహం ప్రతిపాదించే పనిలో కూడా ఉన్నట్టు చెబుతున్నారు.
అయితే.. సోము వ్యూహం అంత ఈజీగా సఫలమయ్యే పరిస్థితి లేదని అంటున్నారు పరిశీలకులు. అంతేకాదు.. ముందు అంతర్గత కలహాలు తగ్గించడం.. ప్రజల్లో పార్టీపై భరోసా కల్పించేలా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడం వంటివి చేసినప్పుడు తప్ప.. సోము ఆశిస్తున్న ఫలితం.. దక్కేలా లేదని పరిశీలకులు చెబుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి. అంతేతప్ప.. పొరుగు రాష్ట్రంలో బలంగా ఉన్న బీజేపీని చూసి, ఇక్కడ కూడా అలానే చేస్తామంటే.. ఎలా? అంటున్నారు పరిశీలకులు.