Begin typing your search above and press return to search.
ఎల్లో మీడియాపై గుర్రుమంటున్న ఏపీ బీజేపీ
By: Tupaki Desk | 13 Nov 2022 4:15 PM GMTఏపీలో ఎల్లో మీడియా వర్సెస్ వైసీపీ అన్నది కామన్ వ్యవహారం. వారు రాస్తారు. వీరు విమర్శిస్తారు. ఇలా ఎపుడూ సాగే వ్యవహారమే. కానీ ఇపుడు మరో పార్టీ కూడా ఎల్లో మీడియాకు టార్గెట్ అయిందా అన్న చర్చ సాగుతోంది. నిజానికి టార్గెట్ అయింది ఏపీ బీజేపీనా లేక అందులోని కొందరు నాయకులా అన్న చర్చ కూడా వస్తోంది.
ఏపీ బీజేపీలో సోము వీర్రాజు అంటే గిట్టని వర్గం ఉందని ప్రచారం అయితే చాన్నాళ్ళుగా ఉంది. ఇదిలా ఉంటే ఇటీవల విశాఖ వచ్చిన ప్రధాని బీజేపీ కోర్ కమిటీ మీటింగ్ ని నిర్వహించారు. ఈ మీటింగులో సోము వీర్రాజు ఎవరో తెలియదన్నట్లుగా ఆప్ కా నామ్ క్యా హై అని ఆయన్ని అడిగినట్లుగా ఎల్లో మీడియాలో ప్రచారం జరిగింది.
అంతే కాదు ఏపీలో జిల్లాలు మండలాల గురించి కూడా సోము వీర్రాజు ని అడిగితే ఆయన సరైన సంఖ్యని చెప్పలేకపోయారు అని కూడా వార్తా కధనాలు వచ్చాయి. దీని మీద సోము వీర్రాజు అయితే ఎల్లో బ్యాచ్ ని ఉద్దేశిస్తూ ఇండైరెక్ట్ గా ట్వీట్లు చేశారు. మహా కవి కాళోజీ కొటేషన్స్ పట్టుకుని అక్షరాలు అమ్ముకుంటూ వ్యవస్థలను నాశనం చేస్తున్నారు కొందరు అన్నట్లుగా ఆయన ట్వీట్ల ద్వారా మండిపడ్డారు.
అయితే ఇపుడు బీజేపీ నేరుగా సీన్ లోకి దిగింది. తమ నాయకుడు సోము ని మోడీ ఏమీ అనకపోయినా అక్కడ జరిగిన చర్చను వక్రీకరించే తీరున రాతలు రాయడం ఎల్లో బ్యాచ్ కే చెల్లిందని ఏపీ బీజేపీ అంటోంది. అంతే కాదు లేని దాన్ని ఉన్నట్లుగా చూపించే ప్రయత్నం చేశారని, ఇలా ఏపీ బీజేపీ కోర్ కమిటీ మీటింగ్ లోని అవాస్తవాలు బయటకు ప్రచారంలోకి రావడానికి టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళిన కొంతమంది మాజీ తమ్ముళ్ళే కారణం అని కూడా బీజేపీలోని ఒక వర్గం గుస్సా మీద ఉందిట.
నిజానికి అక్కడ జరిగింది వేరు అని బీజేపీ వర్గాలు అంటున్నాయి. సోము వీర్రాజుని ఎన్నాళ్ళుగా మీరు పార్టీలో ఉన్నారు అని ప్రధాని ప్రశ్నించారని, ఆయన నలభయేళ్ళుగా తాను పార్టీలో ఉన్నాను అని చెప్పగా తాను కూడా అన్నాళ్ల నుంచే బీజేపీకి సేవ చేస్తున్నాను అని ప్రధాని చెప్పారని ఇది మాత్రమే జరిగిందని, దీన్ని మార్చేసి సోము పేరు ఏమిటో తెలియదు అన్నట్లుగా వార్తలు రాయించడానికి కొంతమంది బాబు కోవర్టులు పూనుకున్నారని, వారి సమాచారంతో ఎల్లో బ్యాచ్ వార్తా కధనాలు అచ్చేసిందని బీజేపీ వర్గాలు మండుతున్నాయి.
ఈ విషయాన్ని పార్టీ అధినాయకత్వం దృష్టిలో పెట్టడంతో పాటు ఆ విధంగా అసత్యాలు ప్రచారం చేసి ఎల్లో మీడియాకు వక్ర సమాచారం ఇచ్చిన వారి మీద ప్రచురించిన ఎల్లో మీడియా మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా బీజేపీ రెడీ అవుతోంది అని అంటున్నారు. మొత్తానికి ఏపీ బీజేపీలో కొన్ని వర్గాలు ఉన్నాయన్నది వాస్తవం.
మొదటి నుంచి పార్టీలో ఉన్న వారు కొందరైతే వైసీపీ అనుకూల వైఖరి ప్రదర్శించే వారు కొందరు ఉన్నారని ప్రచారంలో ఉంది. అలాగే టీడీపీకి మద్దతుగా నిలిచే వారు కొందరు ఉన్నారని చెబుతారు. మొత్తానికి ఇపుడు ఏపీ బీజేపీలో సోము వీర్రాజు మీద మండిపడుతున్న ఆయన వ్యతిరేక వర్గం చేసిన పనే ఇది అని అంటునారుట. ఏది ఏమైనా అసలే అంతంతమాత్రంగా ఉన్న ఏపీ బీజేపీలో ఇపుడు ఈ ప్రచారం సోము ఎవరో ప్రధానికే తెలియదు అని వార్తలు రావడం మాత్రం ఇబ్బందికరంగానే ఉన్నాయని అంటున్నారు. మరి దీని మీద ఏపీ బీజేపీ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది అన్నది చూడాలి.