Begin typing your search above and press return to search.

బీజేపీ `బీఫ్ పాలిటిక్స్` వ‌ర్క‌వుట్ అయ్యేనా..?

By:  Tupaki Desk   |   22 Jan 2023 4:08 AM GMT
బీజేపీ `బీఫ్ పాలిటిక్స్` వ‌ర్క‌వుట్ అయ్యేనా..?
X
ఇటీవ‌ల బీజేపీ విస్తృత స్థాయి స‌మావేశాలు ఢిల్లీలో జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా ఏపీకి సంబంధించిన రాజ‌కీయ అంశాల‌పై దీనిలో చ‌ర్చించిన‌ట్టు తెలిసింది. ఈ క్ర‌మంలో సోము వీర్రాజు నేతృత్వంలో జ‌రుగుతున్న‌పోరాటాలు.. ప్ర‌భుత్వంపై యుద్ధాల‌ను ప్ర‌శంసించినట్టు కూడా వార్త‌లు వ‌చ్చాయి. అదేస‌మ‌యంలో కీల‌క‌మైన రెండు అంశాల‌ను బీజేపీ నేత‌లు నూరిపోశార‌ని అంటున్నారు.

ప్ర‌స్తుతం ఏపీలో బీజేపీ నిల‌దొక్క‌కునే విష‌యంలో త‌ర్జన భ‌ర్జ‌న ఉంది. ఏవ‌ర్గం ఎటు వైపు..? అనే విష యంలో ఏపీలో నేత‌లు క్లారిటీ ఇవ్వ‌లేక పోతున్నారు. ఈ క్ర‌మంలోనే ఉత్త‌రాదిన అనుస‌రిస్తున్న విధా నాల‌ను ఏపీలోనూ అనుస‌రించాల‌ని..బీజేపీకి చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ఎందుకంటే .. ఢిల్లీ నుంచిరాగానే సోము వీర్రాజు కీల‌కమైన అత్యంత వివాదాస్ప‌ద‌మైన అంశాన్ని లేవ‌నెత్తారు.

రాష్ట్రంలో గోవ‌ధ‌పై నిషేధం విధించాల‌ని అన్నారు. అదేస‌మ‌యంలో గోమాంసం(బీఫ్‌) విక్ర‌యాల‌పైనా నిషేధం విధించాల‌ని డిమాండ్ చేశారు. ఇది.. చాలా పెద్ద వ్యూహం. గ‌తంలో యూపీలోనూ అధికారంలోకి వ‌చ్చేందుకు బీజేపీ ఇదే అజెండా ఎంచుకుంది. అక్క‌డ స‌క్సెస్ కూడా అయింది. ఇప్పుడు ఇదే ఫార్ములా ను ఏపీలో అమలు చేయాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

అంటే.. ఈ వ్యూహంతో ఏపీలో హిందువులు, ముస్లింల‌కు మ‌ధ్య విభ‌జ‌న‌ను తీసుకురావ‌డం అనేది బీజేపీ వ్యూహంగా క‌నిపిస్తోంది. అదేస‌మ‌యంలో ఎస్సీలు, ఎస్టీల‌ను కూడా విభ‌జించి.. హిందూ వ‌ర్గాన్ని త‌మ‌వైపు తిప్పుకొనే ప్లాన్ చేసిన‌ట్టు తెలుస్తోంది. నిజానికి ఇప్పుడు గోమాంసంపై ఏపీలో ఎలాంటి నిషేధం లేదు. ఆ మాట‌కు వ‌స్తే.. దేశంలోని యూపీలో త‌ప్ప‌.. ఎక్క‌డా నిషేధం లేదు.

అలాంటిది సోము ఈ పాటఅందుకున్నారంటే.. ఏదో వ్యూహం ఉంద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఇది ఏమేరకు స‌క్సెస్ అవుతుందో చూడాలి. దీనిక‌న్నా ముందు.. ఏదైనా జ‌రిగితే.. వైసీపీ ప్ర‌భుత్వం ఇర‌కాటంలో ప‌డ‌డం ఖాయం.