Begin typing your search above and press return to search.
ఈ `రచ్చ` ఏపీ బీజేపీకి ప్రయోజనమేనా..!
By: Tupaki Desk | 22 Jan 2023 6:26 AM GMTగతంలో చంద్రబాబును.. ఇప్పుడు సీఎంగా ఉన్న జగన్‌ను కూడా బీజేపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. గతంలో చంద్రబాబు ను ఇలా చేసే.. పుట్టిముంచారనే వాదన ఉంది. నిజానికి టీడీపీ వల్ల బీజేపీకి ప్రయోజనం ఉంది. ఎప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకున్నా.. బీజేపీ విజయం దక్కించుకుని నలుగురో.. ముగ్గురో నేతలను సంపాయించుకుంది. తద్వారా అధికారంలోనూ పాలు పంచుకుని మంత్రి పదవులు తీసుకుంది.
అయినప్పటికీ..గత పాలనలో చంద్రబాబు కేంద్ర పథకాలను వాడేస్తున్నారని.. కేంద్రం ఇచ్చిన సొమ్ము తీసుకుని గ్రామాల్లో రోడ్లు వేయించి.. బాత్‌రూమ్‌లు కట్టించి.. ఇంటింటికీ నీటి కుళాయి ఇచ్చి.. తన ముద్ర వేసుకుందని..పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే.. దీనివల్ల బీజేపీకి ఒనగూరిన ప్రత్యేక లబ్ధి లేకపోగా..చ ంద్రబాబుకు మాత్రం అంతో ఇంతో ఇబ్బంది వచ్చింది. ఇక, ఇప్పుడు కూడా బీజేపీ నేతలు ఇదే పనిచేస్తున్నారు.
జగన్ చేస్తున్న కార్యక్రమాలు అన్నీ కూడా కేంద్రమే చేస్తోందని అంటున్నారు. దీనివల్ల బీజేపీకి వచ్చే ప్రత్యేక లబ్ధి అంటూ ఏమీ కనిపించడం లేదనేదే ఇప్పుడు వాదన. ఏదైనా చేస్తే.. దానివల్ల పార్టీకి మేలు కలగాలి. కానీ.. పక్క పార్టీలను నాశనం చేయడం ద్వారా.. తాము పొందే ప్రయోజనం కనిపించడం లేదు. పోనీ.. ఇది తమకు అనుకూలంగా ఉంటుందని భావిస్తే.. వెంటనే ప్రజల్లోకి కూడా వెళ్లాలి.
కానీ, ఆ పనికూడా బీజేపీ నాయకులు చేయడం లేదు. కేవలం విమర్శలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. పోనీ..కేంద్రమే ఇస్తోందని అనుకున్నా.. ఊరికేనే అయితే.. ఇవ్వడం లేదు. జనాభా లెక్కల దామాషా ప్రకారమే.. నిధులు ఇస్తుంది. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే ఏపీకి ఇస్తుంది. సమాఖ్య ప్రభుత్వంలో ఇది మోడీ ఉన్నా.. మరొకరు ఉన్నప్పటికీ..చేయాల్సిన పనే. దీనికి ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారనేది ప్రశ్న.