Begin typing your search above and press return to search.

ఏపీ బీపీ : ప‌థ‌కాల‌కు సై.. ప‌న్నుల త‌గ్గింపున‌కు నై...

By:  Tupaki Desk   |   6 May 2022 6:30 AM GMT
ఏపీ బీపీ : ప‌థ‌కాల‌కు సై.. ప‌న్నుల త‌గ్గింపున‌కు నై...
X
మ‌న రాష్ట్ర ముఖ్య‌మంత్రి తీవ్ర బాధ‌లో ఉన్నారు. ఆయ‌న‌కు ప‌న్నుల వ‌డ్డ‌న ఇష్టం లేదు. అయినా పెట్రో ఉత్ప‌త్తుల‌పై ప‌న్నులు వ‌సూలు చేయ‌క త‌ప్ప‌డం లేదు అని మాజీ మంత్రి పేర్ని నాని కానీ కొత్త మంత్రి పినిపే విశ్వ‌రూప్ కానీ చెప్ప‌వ‌చ్చు. కానీ ర‌వాణా రంగంలో సంక్షోభాన్ని నివారించేది ఎవ‌రు? ప‌రిశ్ర‌మ‌ల రంగంలో సంక్షోభానికి కార‌కులు ఎవ్వ‌రు ? ఇప్పుడున్న విధంగా ఉంటే క‌రెంటు యూనిట్ కు ప‌ది రూపాయ‌లు వ‌సూలు చేసినా త‌ప్పు లేదు అన్న భావ‌న‌కు వైసీపీ వ‌చ్చేసింద‌ని తెలుస్తోంది. ఇది కేవ‌లం గృహావ‌సరాల‌కు సంబంధించిన మాట. అలానే ప‌రిశ్ర‌మ‌ల‌కూ భారీ ఎత్తున ఛార్జీలు పెంచేందుకు స‌మాయ‌త్తం అవుతోంది. ఇదే సమ‌యంలో తాము ప‌న్నులు పెంచి వ‌సూలు చేసిన డ‌బ్బులు తిరిగి పేదల‌కే పంచుతున్నామ‌ని, సంక్షేమం కోసమే ఇన్ని పాట్లు ప‌డుతున్నామ‌ని సీఎం జ‌గ‌న్ చెబుతుండ‌డం విడ్డూరం.

కేంద్రం త‌గ్గినా రాష్ట్రం త‌గ్గ‌దు. క‌నీసం ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని అయినా కేంద్రం త‌గ్గింది. గ‌త ఏడాది న‌వంబ‌ర్ లో ! దీంతో పెట్రోలు పై ప‌ది రూపాయ‌ల‌ను, డీజిల్ పై ఐదు రూపాయ‌ల‌ను త‌గ్గించింది. ఇది ఏ మాత్రం ప‌ట్టించుకోకుండా ఆంధ్ర ప్ర‌దేశ్ స‌ర్కారు ఉంద‌ని ప్ర‌ధాన మీడియా వెల్ల‌డిచేస్తోంది. కేంద్రం త‌గ్గినా, మ‌న రాష్ట్రం మాత్రం ఒక్క అడుగు కూడా వెనుక‌కు వేయ‌లేదు. ప‌న్నుల త‌గ్గింపుపై క‌నిక‌రం చూపించ‌డం లేదు. ఫ‌లితంగా పెట్రో ఉత్ప‌త్తుల కొనుగోలు ఆ రోజు నుంచి ఈ రోజు వ‌ర‌కూ వినియోగ‌దారులు మోస్తూనే ఉన్నారు.

రోజురోజుకీ అనియంత్రిత రీతిలో పెరిగిపోతున్న పెట్రో ధ‌ర‌లపై చిన్నా చిత‌కా వ‌ర్గాల నుంచి అత్యున్న‌త స్థాయి వ‌ర‌కూ వివాదాలే రేగుతున్నాయి. విమ‌ర్శ‌లే రేగుతున్నాయి. ప్ర‌తిప‌క్షంలో ఉన్నప్పుడు తాము ప్ర‌జా ప‌క్ష‌మే అని భావించి మాట్లాడిన జ‌గ‌న్ ఇప్పుడు మాత్రం అస్సలు ఆ దిశ‌గా ఆలోచించ‌డం లేదు. రాష్ట్రాల ప‌న్నుల వాటా త‌గ్గించుకుంటే ఎలా లేదన్నా వినియోగ‌దారు డికి కాస్త లో కాస్త ఉప‌శ‌మ‌నం అయిన ల‌భిస్తుంది. డ‌బ్బులు పంచేందుకు ఇష్ట‌ప‌డుతున్నారే త‌ప్ప ధ‌ర‌లు దించేందుకు ఎక్క‌డా ఇష్ట‌ప‌డ‌డం లేదు.

ప్ర‌ధాన మీడియా అందిస్తున్న వివ‌రం ప్ర‌కారం... తాడేప‌ల్లిలో 2019 మే నెల‌లో పెట్రో ధ‌ర 76 రూపాయ‌ల 89 పైస‌లు. ఇప్పుడు 120 రూపాయ‌ల 95 పైస‌లు. అంటే ఈ మూడేళ్ల లో పెరుగుద‌ల 44 రూపాయ‌ల ఎనిమిది పైస‌లు. ఇదే విధంగా డీజిలు ధ‌ర‌లూ ఉన్నాయి. ఇవ‌న్నీ ర‌వాణా రంగంపై పూర్తి ప్ర‌భావం చూపుతున్నాయి. మ‌న‌తో పోలిస్తే త‌మిళ‌నాడు, పొరుగున ఉన్న ఒడిశాల‌లో ధ‌ర‌లు కాస్త బెట‌ర్.

కానీ ఇక్క‌డ జ‌గ‌న్ ప‌ట్టుద‌ల కార‌ణంగా రాష్ట్రం వాటా కింద వ‌సూలు చేసే ప‌న్ను త‌గ్గించ‌డం లేదు. వీటితో పాటు అమ‌రావ‌తి సెస్సు పేరిట కూడా కొంత వ‌సూలు చేస్తున్నారు. ఇప్పుడు రాజ‌ధాని ప‌నులు లేవు. ఆగిపోయాయి కానీ సెస్సు వ‌సూలు మాత్రం ఆగ‌డం లేదు. అదే విడ్డూరం. ఇక డీజిల్, పెట్రోల‌పై వ్యాట్ ధ‌ర రెండు రూపాయ‌లు కాస్త నాలుగు రూపాయ‌లు చేశార‌ని ప్ర‌ధాన మీడియా వెల్ల‌డి చేస్తోంది.

మ‌రి! రాజ‌ధాని అమ‌రావ‌తి కానప్పుడు సెస్సులు ఎలా వ‌సూలు చేస్తారు. గ్రామాల‌లో వివిధ ప‌ట్టణాల్లో ప్ర‌ధాన దారులు అధ్వానంగా ఉన్నా రోడ్ ట్యాక్సులు కూడా ఎలా వ‌సూలు చేస్తారు. టోల్ బాదుడు ఎలా ప్రోత్స‌హిస్తారు. ఏం చేసినా ఏం చేయ‌కున్నా ఎవ్వ‌రూ ప్ర‌శ్నించ‌డం లేదు. ప‌న్నుల‌కు అద‌న‌పు ప‌న్నులు జ‌త అవుతున్నాయే త‌ప్ప ఆగ‌డం లేదు. అయినా కూడా వైసీపీ కి సంతృప్తి రావ‌డం లేదు అని టీడీపీ విమ‌ర్శిస్తోంది.