Begin typing your search above and press return to search.

రూ. 2.30 లక్షల కోట్లతో ఏపీ 2021-22 బడ్జెట్ .. హైలైట్స్ ఇవే !

By:  Tupaki Desk   |   20 May 2021 6:52 AM GMT
రూ. 2.30 లక్షల కోట్లతో ఏపీ 2021-22 బడ్జెట్ ..  హైలైట్స్ ఇవే !
X
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం ప్రారంభమైంది. మొదటగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించారు. ఆ తర్వాత బీఏసీ సమావేశం జరిగింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన బడ్జెట్ ప్రసంగాన్ని చదివి వినిపిస్తున్నారు. వరుసగా మూడోసారి బడ్జెట్‌ను ఆయన ప్రవేశపెడుతున్నారు. దాదాపు రూ. 2.30 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2021–22 రాష్ట్ర బడెట్‌ అంచనా రూ. 2,29,779.27 కోట్లు కాగా.. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ అంచనా రూ. 2,24,789.18 కోట్లు. బడ్జెట్‌ కు సంబంధించిన హైలైట్స్ లోకి వెళ్తే ..

రాష్ట్ర అసెంబ్లీ లో మంత్రి కురసాల కన్నబాబు అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ఒక చరిత్ర అన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు రైతులకు కార్యాలయాలు వంటివన్నారు. 1,778 రైతు భరోసా కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. నాణ్యమైన యంత్రాల కొనుగోలుకు 40 శాతం రాయితీ ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

వ్యవసాయ బడ్జెట్‌ రూ.31,256.36 కోట్లు,

ఉపాధి హామీ పథకం కోసం రూ.8,116.16 కోట్లు

వైఎస్‌ఆర్‌ జలకళ పథకం కోసం రూ.200 కోట్లు

వ్యవసాయ పథకాల కోసం రూ.11,210.80 కోట్లు

వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కోసం రూ.3,845.30 కోట్లు

వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమాకు రూ.1802.82 కోట్లు

వ్యవసాయరంగంలో యాంత్రీకరణకు రూ.739.46 కోట్లు

రాష్ట్రీయ కృషి వికాస యోజన(RKVY) రూ.583.44 కోట్లు

ధరల స్థిరీకరణ ఫండ్‌ రూ.500 కోట్లు

రైతులకు సున్నా వడ్డీ చెల్లింపుల కోసం రూ.500 కోట్లు

ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన(PMKSY) రూ.300 కోట్లు

రైతులకు విత్తనాల సరఫరా కోసం రూ.100 కోట్లు

వ్యవసాయ మార్కెట్‌ మౌలిక వసతుల కోసం రూ.100 కోట్లు

వైఎస్‌ఆర్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్స్‌ కోసం రూ.88.57 కోట్లు

రైతులకు ఎక్స్‌గ్రేషియా కోసం రూ.20 కోట్లు

పశువుల నష్టపరిహార పథకం కోసం రూ.50 కోట్లు


హైలైట్స్ :

2021-22 బడ్జెట్ అంచనా రూ.2,29,779 కోట్లు,

గత బడ్జెట్ అంచనా రూ.2,24,789 కోట్లు,

వెనుకబడిన కులాలకు బడ్జెట్‌ లో 32శాతం అధిక కేటాయింపులు,

బీసీ కులాలకు రూ. 28,237 కోట్లు

ఈబీసీ సంక్షేమానికి రూ. 5,478 కోట్లు

కాపు సంక్షేమం కోసం రూ. 3,306 కోట్లు

బ్రాహ్మణుల సంక్షేమానికి రూ. 359 కోట్లు

ఎస్సీ సబ్ ప్లాన్ కోసం రూ. 17,403 కోట్లు

ఎస్టీ సబ్ ప్లాన్ కోసం రూ. 6,131 కోట్లు

మైనారిటీ యాక్షన్ ప్లాన్ కింద రూ. 3840 కోట్లు

మైనార్టీ సబ్ ప్లాన్ కోసం రూ. 1756 కోట్లు

మహిళా సంక్షేమానికి రూ. 47,283 కోట్లు

వ్యవసాయానికి రూ. 11,210 కోట్లు

విద్యారంగానికి రూ. 24,624 కోట్లు

వైద్యం, ఆరోగ్యానికి రూ. 13,830 కోట్లు

చిన్నారుల కోసం రూ.16,748 కోట్లు

వైఎస్సార్ పెన్షన్ కానుక రూ. 17 వేల కోట్లు

వైఎస్సార్ రైతు భరోసా రూ. 3,845 కోట్లు

జగనన్న విద్యాదీవెనకు రూ. 2500 కోట్లు

జగనన్న వసతి దీవెనకు రూ. 2,223 కోట్లు

వైఎస్‌ఆర్‌-పీఎం ఫసల్‌ బీమా యోజనకు రూ.1802 కోట్లు

డ్వాక్రా సంఘాల సున్నా వడ్డీ చెల్లింపులకు రూ.865 కోట్లు

పట్టణ ప్రాంత డ్వాక్రా మహిళలకు రూ.247 కోట్లు

రైతులకు సున్నా వడ్డీ చెల్లింపులకు రూ.500 కోట్లు

వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం కోసం రూ.500 కోట్లు

వైఎస్‌ఆర్‌ జగనన్న చేదోడు పథకానికి రూ.300 కోట్లు

వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర కోసం రూ.285 కోట్లు

వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం కోసం రూ.190 కోట్లు

వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా కోసం రూ.120 కోట్లు

మత్స్యకారులకు డీజిల్‌ సబ్సిడీ కోసం రూ.50 కోట్లు

అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లింపుల కోసం రూ.200 కోట్లు

రైతులకు ఎక్స్‌గ్రేషియా కోసం రూ.20 కోట్లు

లా నేస్తం కోసం రూ.16.64 కోట్లు

ఈబీసీ నేస్తం కోసం రూ.500 కోట్లు

వైఎస్‌ఆర్‌ ఆసరా కోసం రూ.6,337 కోట్లు

అమ్మఒడి పథకం కోసం రూ.6,107 కోట్లు

వైఎస్‌ఆర్‌ చేయూత కోసం రూ.4,455 కోట్లు

రైతు పథకాల కోసం రూ.11,210.80 కోట్లు

వైఎస్‌ఆర్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లకు రూ.85.57 కోట్లు

వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమాకు రూ.1802.82 కోట్లు

వ్యవసాయరంగంలో యాంత్రీకరణకు రూ.739.46 కోట్లు

వైఎస్‌ఆర్‌ పశువుల నష్టపరిహారానికి రూ.50 కోట్లు

విద్యా రంగానికి రూ.24,624.22 కోట్లు

స్కూళ్లలో నాడు-నేడుకు రూ.3,500 కోట్లు

జగనన్న గోరుముద్ద కోసం రూ.1200 కోట్లు

జగనన్న విద్యాకానుకు కోసం రూ.750 కోట్లు

ఉన్నత విద్య కోసం రూ.1973 కోట్లు

ఆరోగ్య రంగానికి రూ.13,840.44 కోట్లు

ఆరోగ్యశ్రీ, మందుల కొనుగోలుకు రూ.2,248.94 కోట్లు

ఆస్పత్రుల్లో నాడు-నేడు కార్యక్రమానికి రూ.1535 కోట్లు

కోవిడ్‌పై పోరాటానికి రూ.1000 కోట్లు

ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో శానిటేషన్‌కు రూ.100 కోట్లు

శ్రీకాకుళం జిల్లా పలాస ఆస్పత్రికి రూ.50 కోట్లు

పరిశ్రమలకు ఇన్సెంటివ్‌లకోసం రూ.1000 కోట్లు

వైయస్సార్‌ ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ కోసం రూ. 200 కోట్లు

కడప స్టీల్‌ప్లాంట్‌ కోసం రూ. 250 కోట్లు

ఏపీఐఐసీకి రూ. 200 కోట్లు

ఎంఎస్‌ఎంఈల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 60.93 కోట్లు

పారిశ్రామిక మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 3,673.34 కోట్లు

రోడ్లు భవనాల శాఖకు 2021–22 సంవత్సరంలో రూ. 7,594.6 కోట్లు

ఎనర్జీ రంగానికి రూ. 6,637 కోట్లు

వైయస్సార్‌ సంపూర్ణ పోషణకు రూ.1,556.39 కోట్లు

వైయస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌కు రూ. 243.61 కోట్లు

దిశకు రూ. 33.75 కోట్లు

అంగన్‌వాడీల్లో నాడు – నేడు కార్యక్రమాలకోసం రూ. 278 కోట్లు

వైయస్సార్‌ బీమాకు రూ. 372.12 కోట్లు

అర్చకులకు అన్సెంటివ్‌లకు రూ.120 కోట్లు

ఇమామ్స్, మౌజంలకు ఇన్సెంటివ్‌లకు రూ.80 కోట్లు

పాస్టర్లకు ఇన్సింటివ్‌లకు రూ. 40 కోట్లు

ల్యాండ్‌ రీ సర్వేకోసం రూ. 206.97 కోట్లు

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ. 8,727 కోట్లు.

గత ఏడాదితో పోలిస్తే 7.2శాతం అధికం.

2021–22లో నీటిపారుదల శాఖకు రూ. 13,237.78 కోట్లు

గత ఏడాదితో పోలిస్తే రూ. 12.13 శాతం ఎక్కువ