Begin typing your search above and press return to search.

రూ. 2.38 లక్షల కోట్ల తో ఏపీ బడ్జెట్ .. గతేడాది ఆదాయం ఎంతంటే..!

By:  Tupaki Desk   |   18 May 2021 10:32 AM GMT
రూ. 2.38 లక్షల కోట్ల తో ఏపీ బడ్జెట్ .. గతేడాది  ఆదాయం ఎంతంటే..!
X
ఓ వైపు రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి జోరు కొనసాగుతున్న సమయంలోనే కరోనా కట్టడి కోసం అన్ని ప్రణాళికలు తీసుకుంటూ , మరోవైపు ఈ నెల 20న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కరోనా కష్ట కాలంలో బడ్జెట్ రూపకల్పన కొంచెం కష్టంగా మారింది. అసెంబ్లీలో బడ్జెట్ ఆమోదం పొందిన వెంటనే కరోనా దృష్ట్యా ఈ అసెంబ్లీ సమావేశాలు ముగించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే అసెంబ్లీ సమావేశమై 6 నెలలు కావడంతో జూన్ 3 వ తేది లోపల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సి ఉంది.

గతేడాది అనుభవాలతో ఆదాయ, వ్యయాల అంచనాలను రూపొందిస్తున్న ఆర్ధిక శాఖ. రూ. 2.28 లక్షల కోట్ల నుంచి రూ. 2.38 లక్షల కోట్ల మధ్యలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. గతేడాది ఆదాయ అంచనాలను చేరుకోలేకపోయిన ఏపీ సర్కార్ గ‌త ఏడాది సుమారు 1.82 ల‌క్షల కోట్ల వ్య‌యం కాగా,ఆదాయం కేవ‌లం 77, 560 కోట్లు మాత్ర‌మే అని చూపించింది. గతేడాది రూ. 1 లక్ష కోట్లకు పైగా బడ్జెట్ లోటు ఉందంటున్నారు ఆర్ధిక శాఖ అధికారులు. ఈ ఆర్ధిక సంవత్సరంలోనూ ఆదాయ ,వ్యయాలు గతేడాది రీతినే ఉండొచ్చని ఆర్ధిక శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే మూడు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్టును ఆర్డినెన్స్ ద్వారా అమలు చేస్తోన్న ప్రభుత్వం. మిగిలిన 9 నెలల కాలనికి బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. గతేడాది రూ. లక్ష కోట్లకు పైగా బడ్జెట్ లోటు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో ఈ ఏడాది బడ్జెట్ ఎలా ఉంటుందన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.