Begin typing your search above and press return to search.

ఆ పోటీకి షార్ట్ లిస్ట్ ఆయినా ఏపీకి చెందిన మూడు సీతాకోకచిలుకలు

By:  Tupaki Desk   |   23 Sep 2020 2:30 AM GMT
ఆ పోటీకి షార్ట్ లిస్ట్ ఆయినా ఏపీకి చెందిన మూడు సీతాకోకచిలుకలు
X
'నాకేగానీ రెక్కలు వస్తే కానీ… రంగురంగుల సీతాకోకచిలుకలా స్వేచ్ఛగా ఎగురుతూ పువ్వు పువ్వునీ పలకరిస్తూ తియ్యని మకరందాన్ని ఆస్వాదించేయనూ…అంటూ అనుకోనివాళ్లు ఉండరేమో. అందమైన ఆ రూపంతోపాటు క్షణం నిలకడ లేని ఆ చంచలత్వం వల్లేనేమో పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ ఆ చిట్టి కీటకం అంటే ఎంతో ఇష్టం. వాటిని చూడాలనీ పట్టుకోవాలనీ ఒకటే సరదా. కానీ వన సంపదకి సాయం చేసే ఆ వన్నెల సీతాకోకచిలుకల సంఖ్య క్రమేణా తగ్గిపోతోంది. అయితే , అక్కడక్కడా ప్రభుత్వాలు వాటి రక్షణ కోసం కొన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా సీతాకోకచిలుకలు తగ్గిపోతూనే ఉన్నాయి. వాతావరణ మార్పులు, కాలుష్యం, అడవుల నరికివేత, కీటకనాశన మందులు, వాటిని పట్టి బంధించడం… ఇలా కారణాలెన్నో. అదీగాక, అవి మందారం, నూరువరహాలు, అక్షింతలు, బంతి, ఇలా కొన్ని పూలల్లోని మకరందాన్నే తాగుతాయి. ఆ మొక్కల పెంపకం తగ్గిపోవడంతో తేనె దొరకక చనిపోతున్నాయట.

ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం సీతాకోకచిలుకలు పరిరక్షణ కోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సీతాకోకచిలుకల పెరుగుదలకు తగిన చర్యలు తీసుకుంటూ , వాటి రక్షణ కోసం ఏడాదికి ఒకసారి దేశంలోనే అగ్రగామిగా ఉన్న కొన్ని రకాల సీతాకోకచిలుకల జాబితాను విడుదల చేస్తుంది. ఇందులో భాగంగానే భారత ప్రభుత్వం త్వరలో జాతీయ సీతాకోకచిలుక 2021 ను ఎంపిక చేయనుంది. దీనికోసం ఎంపిక చేసిన తుది జాబితాలో ... ఏపీకి చెందిన మూడు సీతాకోక చిలుకలు స్థానం దక్కించుకున్నాయి. మొత్తంగా దేశ వ్యాప్తంగా ఏడు సీతాకోకచిలుకలు షార్ట్ లిస్ట్ అయ్యాయి. ఏపీ నుండి ఎంపికైన వాటిలో పాపికొండలు అటవీ ప్రాంతంలో ఉండే కామన్ జెజెబెల్.. ఆరెంజ్ జొకలీఫ్.. కామన్ నవాబ్ లు ఉన్నాయి. త్వరలో 2021 జాతీయ సీతాకోకచిలుకను ప్రకటించనున్నారు.