Begin typing your search above and press return to search.
జగన్ సర్కారు మరో సంచలన పథకం..నేతన్నల ఇక్కట్లకు చెక్
By: Tupaki Desk | 16 Oct 2019 1:37 PM GMTఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పడిన నాలుగు మాసాల్లోనే అనేక సంచలన నిర్ణయాలు - పథకాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అటు నిరుద్యోగులపై ఉద్యోగ వరాలు కురిపిస్తూ.. లక్షల సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్న జగన్.. ఎన్నికలకు ముందు తాను నిర్వహించిన ప్రజా సంకల్ప పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకు అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తున్నారు. వృద్ధులకు పింఛన్ల పెంపు - గ్రామ సచివాలయాల ఏర్పాటు - మద్య నిషేధం - రైతు భరోసా - వైఎస్సార్ వాహన మిత్ర - నాణ్యమైన బియ్యం పంపిణీ ఇలా అనేక సంచలన నిర్ణయాలు - పథకాలను ప్రవేశ పెట్టారు.
నిన్నటికి నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ రైతు భరోసా ను ప్రారంభించారు. దాదాపు 54 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చే ఈ పథకం ద్వారా ఒక్కొక్క రైతు కుటుంబానికీ ఏడాదికి 13500 చొప్పున ఐదేళ్లలో 67500 అందించే ఈ పథకాన్ని గ్రాండ్‌గా ప్రారంభించారు. ఒకపక్క ఆర్థిక పరిస్థితి బాగోక పోయినా.. రైతు ఆనందంగా ఉండాలనే కృత నిశ్చయంతో జగన్ దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. పగటి పూటే 9 గంటల విద్యుత్‌ను కూడా ఇస్తున్న విషయం తెలిసిందే. ఇలా దూసుకుపోతున్న జగన్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలో తాను నిర్వహించిన ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా తనను కలసి తమ సమస్యలు చెప్పుకొన్న చేనేతలను ఆదుకునేందుకు అప్పట్లోనే ఆయన హామీ ఇచ్చారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థికంగా ఆదుకుంటానని చెప్పారు. దీనిని సాకారం చేస్తూ.. తాజాగా బుదవారం సీఎం జగన్ మరో కీలక పథకాన్ని తెరమీదికి తెచ్చారు. ఏడాదికి రూ. 24 వేల మేర ఆర్ధిక సాయాన్ని "వైఎస్సార్ చేనేత నేస్తం" పేరుతో అమలు చేసేందుకు కేబినెట్ ఆమోదించింది. "చేనేత నేస్తం" పథకానికి రూ. 216 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు.
ప్రతీ ఏడాది డిసెండర్ 21వ తేదీన చేనేత కుటుంబాలకు బ్యాంక్ ద్వారా ఆర్ధిక సాయం చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఒకే విడతగా రూ. 24 వేలు ఆర్థిక సాయం చేయాలని కేబినెట్ నిర్ణయించింది.. ఇక, చేనేత నేస్తం పథకం ద్వారా రాష్ట్రంలోని 90 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. మొత్తంగా జగన్ తాను ప్రజలు ఏం చెప్పారో .. అది చేస్తూ.. మంచి సీఎం అని అనిపించుకునేలా వ్యవహరిస్తున్నారు.