Begin typing your search above and press return to search.
సుదీర్ఘంగా సాగిన ఏపీ కేబినెట్ సమావేశం.. 39 అంశాలపై చర్చ
By: Tupaki Desk | 17 Sep 2021 4:30 AM GMTఏపీ ప్రభుత్వ కేబినెట్ భేటీ గురువారం ముగిసింది. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో దాదాపు 39 అంశాలకు పైనే చర్చ సాగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాల్ని చూస్తే..
వన్ టైం సెటిల్ మెంట్ పథకం
ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లో రుణాలు తీసుకున్న వారికి వన్ టైం సెటిల్ మెంట్ పథకాన్నిరాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. వన్ టైం సెటిల్ మెంట్ లో చెల్లింపులు చేసిన పూర్తి హక్కులను దాఖలు పర్చనుంది ప్రభుత్వం. వడ్డీరేట్లు.. ప్రిన్సిపల్ అమౌంట్ల భారం తదితర అంశాల కారణంగా దీర్ఘకాలంలో పెండింగ్ బకాయిలు పెరిగిపోయిన నేపథ్యంలో.. అలాంటి వారికి ఊరటనిచ్చేలా వన్ టైం సెటిల్ మెంట్ ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.
రుణాలు తీసుకున్న వారిలో గ్రామీణ ప్రాంతాలకుచెందిన వారు రూ.10వేలు.. మున్సిపాల్టీకి చెందినోళ్లు రూ.15వేలు.. అర్బన్ ప్రాంతాలకు చెందినోళ్లు రూ.20వేలు చెల్లింపునకు వన్ టైం సెటిల్ మెంట్ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. ఒకవేళ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రుణం తీసుకుని.. దాన్ని ఎవరికైనా అమ్మిన పక్షంలో.. ప్రస్తుతం ఆ ఇంటిని కొనుగోలు చేసిన వారికి వన్ టైం సెటిల్ మెంట్ కింద కడితే సరిపోతుంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.20వేలు.. మున్సిపాల్టీల్లో రూ.30వేలు.. కార్పొరేషన్ లో రూ.40వేలు వన్ టైం సెటిల్ మెంట్ కింద కడితే సరిపోతుంది. ఈ వన్ టైం సెటిల్ మెంట్ ద్వారా దాదాపు 46 లక్షల మందికి పైనే లబ్థి పొందుతారని చెబుతున్నారు.
పావలా వడ్డీ కింద రూ.35వేల చొప్పున రుణాలు
పేదలు.. ఇళ్ల లబ్థిదారులైన అక్కచెల్లెమ్మలకు పావలా వడ్డీ కింద రూ.35వేల చొప్పున రుణాల్నిఇవ్వనున్నారు. తొలిదశలో 15,60,227 ఇళ్లను నిర్మించనున్నారు. ఇళ్లపట్టాలు, ఇళ్ల నిర్మాణం రూపేణా అక్కచెల్లెమ్మల ఒక్కొక్కరి చేతిలో దాదాపు రూ.4–5 లక్షల ఆస్తి సమకూరనుంది. దీనిపై మూడు శాతం స్వల్ప వడ్డీకి అప్పులు ఇస్తారు. మిగిలిన వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది.
నవరత్నాల అమలులో మరో ప్రోగ్రాం
రెండో విడత ఆసరాకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. 2021–22 గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని డ్వాక్రా సంఘాలకు ఆసరా వర్తింపచేస్తారు. నేదరుగా మహిళల చేతిలో పెట్టనున్న ప్రభుత్వం. 2019 ఏప్రిల్ 11 నాటికి బ్యాంకుల్లో ఉన్న డ్వాక్రా రుణాల మొత్తాన్ని నాలుగు విడతల్లో అందిస్తామంటూ హామీ. మొత్తం రూ.27,168 కోట్లను నాలుగు దఫాల్లో అక్కచెల్లెమ్మల చేతిలో పెడతనున్న సర్కారు. ఈ డబ్బును మహిళల సుస్థిర ఆర్థిక ప్రగతికి వినియోగించేలా పలు బహుళజాతి, పెద్ద కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని ఉపాధి మార్గాలు చూపుతున్న ప్రభుత్వం
దాదాపు 8 లక్షలకు పైగా గ్రూపులకు రూ.6,318 కోట్లను నేరుగా అక్కచెల్లెమ్మల చేతిలో పెట్టిన ప్రభుత్వం. రెండో విడతలో రూ.6,470 .76 కోట్లను చెల్లించనున్న ప్రభుత్వం. వీటిని అన్‌ఇంకబర్డ్ ఖాతాల్లో వేయనున్న ప్రభుత్వం. రెండేళ్లలో ఒక్క ఆసరా ద్వారానే రూ.12,788 కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చుచేసింది. మొదటి విడతలో సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయిన గ్రూపులకు రెండు విడతలూ కలిపి ఒకేసారి ప్రభుత్వం ఇవ్వనుంది.
ఆసుపత్రులు.. స్కూళ్లకు పేర్లు
ఆస్పత్రులు.. స్కూళ్లలో చేపడుతున్న నాడు – నేడు కార్యక్రమాలకు సహాయం అందించిన దాతల పేర్లు పెట్టేందుకు ఓకే. దీనికి సంబంధించిన విధివిధానాలకు కేబినెట్ ఆమోదం. కనెక్ట్ టు ఆంధ్రా కార్యక్రమం కింద నాడు – నేడు కోసం ముందుకు వస్తున్న దాతలు రూ.50 లక్షలు ఇస్తే శాటిలైట్ ఫౌండేషన్ స్కూలుకు పేరు. రూ.కోటి దానం చేస్తే ఫౌండేషన్ స్కూలుకు.. రూ.3కోట్ల దానం ఇస్తే హైస్కూల్ కు దాతల పేర్లు పెట్టనున్నారు.
అదే విధంగా ఆసుపత్రుల విషయానికి వస్తే రూ.కోటి ఇస్తే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి.. రూ. 5 కోట్లు ఇస్తే సీహెచ్‌సీకి, రూ.10 కోట్లు ఇస్తే ప్రాంతీయ ఆస్పత్రికి దాతల పేర్లు పెడతారు. ఒక కాలేజీలో కాని, స్కూల్లో ఒక తరగతి గది.. అదనపు తరగతి గది.. హాస్టల్, లైబ్రరీ, గ్రామంలో డిజిటల్ లైబ్రరీల నిర్మాణానికి అయ్యే ఖర్చును నూటికి నూరుశాతం దానం చేస్తే సంబంధిత నిర్మాణాలకు 20 ఏళ్ల పాటు దాతల పేర్లు పెడతారు.
శ్రీశైలంలో ఆ ట్రస్టుకు 10 ఎకరాలు
శ్రీశైలంలో శ్రీశైల జగద్గురు పండితారాధ్య సేవాసమితి ట్రస్ట్‌కు 10 ఎకరాల భూమిని 33 ఏళ్ల లీజుకు ఇచ్చేందుకు ఆమోదం. ఇందుకు గజం రూ.10 చొప్పున కేటాయింపు. ప్రతి మూడేళ్లకు 30 శాతం పెరగనున్న లీజు. స్కూల్, అన్నదాన సత్రం, ఆస్పత్రిల నిర్మాణానికి భూమి కేటాయింపు.
సరికొత్త మార్గదర్శకాలు
జువనైల్ జస్టిస్ చట్టం 2015కు మార్గదర్శకాలు. తల్లిదండ్రులు శారీరక, మానసిక అనారోగ్యంతో ఉండి, పిల్లల సంరక్షణ చేపట్టలేని స్ధితిలో ఉన్న వారి పిల్లలను సంరక్షకులకు అప్పగించే విషయంలో సూచనలు. సంరక్షకుల సమర్థత, ఉద్దేశం, సామర్థ్యం, పిల్లల సంరక్షణ లో వారి అనుభవాన్ని పరిగణలోకి తీసుకోవాలంటూ మార్గదర్శకాలు.
మైక్రోసాఫ్ట్ ప్రోగ్రాంకు ఓకే
-నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు మైక్రోసాఫ్ట్ కార్యక్రమానికి ఆమోదం. సుమారు రూ.30.79 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 300 కాలేజీలు, స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాల్లో 40 సర్టిఫికేషన్ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. ఈ ప్రాజెక్ట్ అమలుకు ప్రభుత్వం మానిటరింగ్, ఎవల్యూషన్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తుంది.
మైనార్టీ వర్గాలకూ సబ్ ప్లాన్
మైనార్టీ వర్గాలకు సబ్ ప్లాన్ అమలు చేయనున్నారు. చారిత్రక నిర్ణయంగా కేబినెట్ ప్రశంస. ఎస్సీ, ఎస్టీ, బీసీలతోపాటు మైనార్టీలకు సబ్‌ప్లాన్. కేబినెట్ ఆమోదం.
- కల్తీలు, నకిలీలను అడ్డుకునేందుకు చట్ట సవరణ. తప్పిదాలకు పాల్పడితే లైసెన్స్‌ల రద్దు, భారీ జరిమానాలు విధిస్తారు.
- విశాఖ జిల్లా అరుకు మండలం మజ్జివలస గ్రామంలో ఏకలవ్య మోడల్‌స్కూల్ నిర్మాణం కోసం 15ఎకరాల ప్రభుత్వ భూమిని గిరిజన సంక్షేమ శాఖకు బదలాయింపు.
- చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం, యాదమర్రి గ్రామంలో 2.56 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఐఓసీఎల్, టెర్మినల్ నిర్మాణం కోసం ఎకరా రూ.30లక్షల చొప్పున కేటాయింపు.
- కడప జిల్లా రాయచోటి మండలం మాసాపేట గ్రామంలో యోగివేమన యూనివర్సిటీ పీజీ సెంటర్ ఏర్పాటు కోసం 53.45 ఎకరాల భూమిని కేటాయిపు.
- గుంటూరు వెస్ట్ మండలం అడవి తక్కెళ్లపాడులో షటిల్ బ్యాడ్మింటన్ అకాడమీ, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కోసం 2 ఎకరాల కేటాయింపు. ఎకరా రూ.1.2కోట్లకు ఇచ్చేందుకు ఓకే.
- గుంటూరు జిల్లా చిలకలూరి పేట మండలం ఎడవల్లిలో 223 ఎకరాల భూమి ఏపీఎండీసీకి కేటాయింపు.
- తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్ మున్సిపాల్టీ పరిధిలో 31 సెంట్లను కమ్యూనిటీ హాలు, విద్యాసంస్థ నిర్మాణానికి మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌కు కేటాయిస్తూ నిర్మాణం.
- రాయలసీమ కరవు నివారణ లో భాగంగా హంద్రీనీవా సుజలస్రవంతి ఫేజ్–2లో భాగంగా పుంగనూరు బ్రాంచ్ కెనాల్‌ను 79.6 కి.మీ. నుంచి 220.35 కి.మీ వరకూ రూ.1929 కోట్లతో విస్తరించనున్న పనులకు ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధనల నుంచి మినహాయింపు.
- వైయస్సార్ జిల్లా కాశినాయన మండలంలో పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేసేందుకు ఓకే.
- సీఐడీలో అడిషనల్ హోంగార్డు పోస్టుల మంజూరు.
- శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం తొగరాం గ్రామంలో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీ మంజూరు.
- ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ ఏర్పాటుకు ఓకే. ఏడాదికి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.1.5 కోట్లు.
- రాష్ట్రంలో ఖరీఫ్ సాగుపై కేబినెట్‌కు వివరాలు . ఇప్పటి వరకూ 84 శాతం విస్తీర్ణంలో సాగు. సాధారణం కంటే 9.1 శాతం అధికంగా వర్షపాతం నమోదు.