Begin typing your search above and press return to search.

ముగిసిన ఏపీ కేబినెట్ భేటి.. కీలక నిర్ణయాలు

By:  Tupaki Desk   |   21 Jan 2022 10:54 AM GMT
ముగిసిన ఏపీ కేబినెట్ భేటి.. కీలక నిర్ణయాలు
X
ఏపీ కేబినెట్ భేటి ముగిసింది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. కరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యలపై ఈ భేటిలో చర్చించారు. ఒమిక్రాన్ కట్టడికి మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది.

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ జీవోలను యథాతథంగా అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. దీంతోపాటు ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక కరోనా కారణంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో కారుణ్య నియామకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ కారణ్య నియామకాలు జరపాలని నిర్ణయించింది.

ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల పథకానికి మంత్రివర్గ ఆమోదం తెలిపింది. జగనన్న సర్మార్ట్ టౌన్ షిప్ లలో ప్రభుత్వ ఉద్యోగులకు 10శాతం కేటాయింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉద్యోగులకు 20శాతం రిబేట్.. పెన్షనర్లకు 5శాతం ప్లాట్లు కేటాయింపునకు పచ్చజెండా ఊపింది.

ఈబీసీ నేస్తం చెల్లింపులతో పాటు వారానికి నాలుగు సర్వీసులు నడిచేలా ఇండిగో సంస్థతో ఒప్పందానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏడాది పాటు ఈ ఒప్పందం అమలుకు రూ.20 కోట్లు చెల్లించేలా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

మహిళా శిశు సంక్షేమ శాఖలో అమలు చేస్తున్న ఐసీడీఎస్ ప్రాజెక్టుకు పౌష్టికాహారం బాలామృతం, పాలుసరఫరాను గుజరాత్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ కు అప్పగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.