Begin typing your search above and press return to search.

మండలి రద్దే.. ఏపీ కేబినెట్ లో తీవ్రచర్చ ?

By:  Tupaki Desk   |   27 Jan 2020 4:36 AM GMT
మండలి రద్దే.. ఏపీ కేబినెట్ లో తీవ్రచర్చ ?
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిని రద్దు చేసేందుకే ఏపీ ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. అసెంబ్లీలో ఇవాళ ఉదయం 11 గంటలకు శాసనమండలి రద్దుపై తీర్మానం ప్రవేశపెట్టనున్నారు.

శాసనసభలో పిల్లి సుభాష్ చంద్రబోస్ శాసనమండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. ఆ తర్వాత శాసనమండలిలోనూ ఆయన చేత చేయించనున్నారు.

తాజాగా ఉదయం 10 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశమైంది. అందులో వాడివేడిగా చర్చ జరుగుతోంది. రాబోయే ఐదేళ్లు జగన్ పాలనకు కీలకం. ఈ ఐదేళ్లలో మండలిలో బలం దక్కించుకోవడం జగన్ సర్కారుకు ఆసాధ్యమే. టీడీపీకి 28మంది ఎమ్మెల్సీలుండగా, వైసీపీకి కేవలం 9మంది మాత్రమే ఉన్నారు. టీడీపీ అందుకోవడం ఐదేళ్లలో కష్టమే. అందుకే ఎమ్మెల్సీలను లాగేసి రాజకీయంగా అపఖ్యాతి మూటగట్టుకోవడం కంటే శాసనమండలిని రద్దు చేసి దర్జాగా కీలక బిల్లులు పాస్ చేయించుకోవాలని జగన్ ఆలోచనగా ఉన్నట్టు తెలిసింది.

అయితే కొంత మంది మంత్రులు మాత్రం శాసనమండలి రద్దుపై ఆలోచించాలని జగన్ ను కోరినట్టు తెలిసింది. రాజకీయ పునరావాసానికి యోగ్యంగా ఉండే మండలిని రద్దు చేస్తే మనకూ నష్టమని.. నేతలను అకాంమిడేషన్ చేయడం కష్టమని సూచిస్తున్నారట.. మండలి రద్దు అయితే ఎమ్మెల్సీలుగా ఉండి మంత్రులుగా కొనసాగుతున్న మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్ ల పదవులు కూడా కోల్పోతారని జగన్ కు సూచించారట..

అయితే శాసనమండలి రద్దు దిశగానే జగన్ ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు కేబినెట్ భేటిలో జగన్ గట్టిగా నిర్ణయించినట్టు సమాచారం. టీడీపీ అడ్డుకట్టకు మండలి రద్దుతో బ్రేక్ వేయాలని... ప్రజాసంక్షేమ పాలనకు మండలి అడ్డు అని జగన్ ఈ నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం.