Begin typing your search above and press return to search.
ఏపీ ప్రజలకు సీఎం జగన్ వరాలు
By: Tupaki Desk | 27 Nov 2020 4:00 PM GMTఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. ప్రజలకు సీఎం జగన్ వరాలు కురిపించారు. సీఎం జగన్ నేతృత్వంలో శుక్రవారం మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఈ కేబినెట్ భేటిలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
27 అంశాలతో ఈ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ వివరాలను మంత్రి కన్నబాబు మీడియాకు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గింపు వార్తలన్నీ అవాస్తవాలన్నారు. ఒక్క సెంటిమీటర్ కూడా తగ్గించడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ బకాయిలు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. 2018 జులై 1 నుంచి ఇవ్వాల్సిన బకాయిలు కూడా చెల్లించాలని నిర్ణయించారు.
నివర్ తుఫాను కారణంగా రాష్ట్రంలో 30వేల హెక్టార్లలో వ్యవసాయ పంటలు..1300 హెక్టార్లలో ఉద్యానవన పంటలు నష్టపోయినట్టుగా సమాచారం ఉందని మంత్రి కన్నబాబు తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన తుఫాన్ సహాయ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్టు తెలిపారు.
తుఫాను బాధితులు, నిరాశ్రయులకు తక్షణ సాయంగా రూ.500 చొప్పున సాయం అందజేయాలని సీఎం జగన్ ఆదేశించారు. శిబిరాల్లో తలదాచుకున్న వారందరినీ ఆదుకోవాలన్నారు. పంట నష్టపోయిన రైతులకు డిసెంబర్ నెలాఖరుల్లా పరిహారం ఇవ్వాలని సూచించారు.