Begin typing your search above and press return to search.

ఏపీ రాజ‌ధాని ఏదో చెప్పండి.. ఆఫీస్ పెడ‌తాం: ఆర్బీఐ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   2 Feb 2022 9:30 AM GMT
ఏపీ రాజ‌ధాని ఏదో చెప్పండి.. ఆఫీస్ పెడ‌తాం:  ఆర్బీఐ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
``ఏపీ రాజ‌ధాని ఏదో చెప్పండి... అక్క‌డ మీరు కోరిన‌ట్టుగా ఆఫీస్ పెడ‌తాం!`` ఇదీ.. రాజ్యాంగం ప్ర‌కారం ఏర్పాటైన రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) చేసిన ప్ర‌క‌ట‌న‌. దీంతో ఈ వ్యాఖ్య‌ల‌పై ఏపీ ప్ర‌బుత్వంపై విమ‌ర్శ‌లు పెరిగిపోయాయి. విష‌యంలోకి వెళ్తే.. ఆర్బీఐకి స్థానికంగా.. అన్ని రాష్ట్రాల్లోనూ ప్ర‌ధాన కార్యాల యాలు ఉంటాయి. అటు త‌మిళ‌నాడులో చెన్నైలోను,ఇటు క‌ర్న‌ట‌క‌లో బెంగ‌ళూరులోను, తెలంగాణ‌లో హైద‌రాబాద్‌లోనూ ప్రాంతీయ హెడ్‌కార్వ‌ర్ట‌ర్స్ ఉన్నాయి. అయితే. రాష్ట్రం విభ‌జ‌న జ‌రిగి ఎనిమిది సంవ‌త్స‌రాలు పూర్త‌యినా.. ఆర్బీఐకి ఏపీలో ఎక్క‌డా కార్యాల‌యం లేదు.

దీంతో ఏపీలో ఆర్బీఐ కార్యాల‌యం విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ.. ఒక‌రు ఆర్బీఐకి లేఖ సంధించారు. దీనికి స‌మాధానంగా ఆర్బీఐ నుంచి పైవిధంగా స‌మాధానం వ‌చ్చింది. ``ముందు ఏపీ క్యాపిట‌ల్ ఏదో చెప్పండి.. అప్పుడు.. మేం కార్యాల‌యంఏర్పాటు చేస్తాం`` అంటూ.. స‌ద‌రు లేఖ రాసిన వారికి.. ఆర్బీఐ నుంచి స‌మాధానం వ‌చ్చింది. ప్ర‌స్తుతం రాష్ట్ర ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానులు అంటోంద‌ని.. దీనిలో ఏదో తేల్చుకోవాల‌ని.. అప్పుడు తాము శాఖ‌ను ప్రారంభిస్తామ‌ని.. ఆర్బీఐ పేర్కొంది.

ఈ గందరగోళం వల్ల భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్‌లో తన శాఖను స్థాపించడంలో జాప్యం చేసింది. అమరావతి డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ జాస్తి వీరాంజనేయులు ఆర్‌బీఐకి లేఖ రాస్తూ, ఏపీలో సెంట్రల్ బ్యాంక్ తన శాఖను తెరవాలని అభ్యర్థించారు. లేఖపై ఆర్‌బిఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎంకె సుభశ్రీ స్పందిస్తూ, క్యాప్షన్ రీజియన్‌పై స్పష్టత వచ్చిన తర్వాత బ్యాంక్ బ్రాంచ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. "కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్‌బిఐ కార్యాలయాన్ని ప్రారంభించే విషయం రాష్ట్ర ప్రభుత్వం దాని రాజధాని నగరానికి స్థలాన్ని ఖరారు చేసిన తర్వాత మాత్రమే కొనసాగుతుంది" అని ఆర్‌బిఐ మేనేజర్ లేఖలో పేర్కొన్నారు.

అంటే రాజధానిపై ఉన్న గందరగోళాన్ని రాష్ట్ర‌ ప్రభుత్వం పరిష్కరించే వరకు ఆర్బీఐ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం లేద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఈ విషయంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ జోక్యం చేసుకోగలిగితే, ఆర్‌బీఐ కచ్చితంగా ఆలోచన చేస్తుంది. కానీ ఈ సమస్యను పరిష్కరించేందుకు సీఎం జగన్‌ సిద్ధంగా ఉన్నారా? అనేది ప్ర‌శ్న‌.. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.