Begin typing your search above and press return to search.
క్లారిటీ: ప్రపంచ బ్యాంకు రిజెక్ట్ పాపం బాబుదే!
By: Tupaki Desk | 19 July 2019 6:28 AM GMTఇవాల్టి ఏపీకి చెందిన పత్రికలతో పాటు తెలంగాణకు చెందిన దిన పత్రికల్ని చూస్తే.. ఒక వార్త అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకును బాబు సర్కారు అప్పట్లో రుణం అడిగితే ఓకే అన్న ప్రపంచ బ్యాంకు.. తాజాగా తాము రుణం ఇవ్వమన్న విషయాన్ని తమ వెబ్ సైట్ లో పేర్కొన్న వైనం సంచలనంగా మారింది.
ప్రభుత్వం పైన ఫిర్యాదుల కారణంగానే తాము ఇవ్వాలనుకున్న రుణాన్ని ఇవ్వకూడదని స్పస్టం చేసింది. దీంతో.. ఈ వ్యవభారం పెనుసంచలనంగా మారింది. కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జగన్ కు ప్రపంచ బ్యాంకు నిర్ణయం పెద్ద దెబ్బగా అభిప్రాయం వ్యక్తమైంది. అయితే.. ఇప్పటివరకూ జరిగిన ప్రచారానికి భిన్నమైన వాదనను వినిపించారు ఏపీ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.
ప్రపంచ బ్యాంకు రుణాన్ని రిజెక్ట్ చేయటం వెనుక చంద్రబాబు సర్కారు కారణమే తప్పించి మరేమీ కాదని ఆయన స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణానికి రుణం ఇవ్వాలని ప్రపంచ బ్యాంకును అడిగింది చంద్రబాబేనని.. టీడీపీ ప్రజా వ్యతిరేక విధానాలతో రాజధాని రైతులు భయాందోళనలకు గురయ్యారన్నారు. అందువల్లే నాడు బాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ప్రపంచ బ్యాంకుకు నివేదికలు పంపారన్నారు.
దానికి అనుగుణంగా తాము రుణం ఇవ్వమని ప్రపంచ బ్యాంకు పేర్కొందన్నారు. అయితే.. ఆ విషయాన్ని దాచి పెట్టి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేస్తేనే ప్రపంచ బ్యాంకు రుణం ఇవ్వటం లేదని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నట్లు చెప్పారు. నిన్నటి ప్రపంచ బ్యాంకు నిర్ణయాన్ని ఈ రోజు ఖండించే కన్నా.. మరింత వేగంగా జగన్ పార్టీ నేతలు రియాక్ట్ అయి ఉంటే మంచిగా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.