Begin typing your search above and press return to search.
బట్టలు విప్పి అంతలా కొట్టారు.. జడ్జి ఎదుట ఏపీ సీఐడీ టార్చర్ పై ఓపెనయ్యాడు!
By: Tupaki Desk | 27 Aug 2022 3:50 AM GMT34 ఏళ్ల ఒక యూట్యూబ్ చానల్ అధినేత బొబ్బూరి వెంగళరావు, అతడ్ని వర్గ వైషమ్యాల్ని ప్రేరేపిస్తున్నాడని.. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడని పేర్కొంటూ ఐపీసీ సెక్షన్ 153ఏ.. 505(2).. 506.. 386. 120బీ.. ఐటీ చట్టంలోని 67ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేసిన ఏపీ సీబీఐ పోలీసులు జడ్జి ఎదుట హాజరుపర్చారు.
ఈ సందర్భంగా తనకు ఎదురైన టార్చర్ పై ఓపెన్ అయ్యాడు. తనను విజయవాడ నుంచి హైదరాబాద్ కు బస్సులో వెళుతుంటే తెలంగాణలోకి కోదాడ వద్ద గురువారం అర్థరాత్రి అదుపులోకి తీసుకొని గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సీఐడీ అదుపులో ఉన్న అతడ్ని బట్టలు విప్పదీసి మరీ కొట్టిన వైనాన్ని వెల్లడించారు. శుక్రవారం రాత్రి అతడ్నిగుంటూరు ఆరో అదనపు మెజిస్ట్రేట్ శ్రతి ఎదుట హాజరుపర్చారు. ఈ సందర్భంగా వెంగళరావు వెల్లడించిన వివరాలు షాకింగ్ గా మారాయి.
"నా బట్టలు విప్పించిన పోలీసులు నన్ను తీవ్రంగా కొట్టారు. ఈ విషయాన్ని మీతో చెబితే నా రెండేళ్ల కొడుకును చంపేస్తామని బెదిరించారు. నా రెండు చేతులు పైకి కట్టేసి.. వాటి మధ్యలో కర్ర పెట్టి అరికాళ్లపై కొట్టారు. బల్లపై పడుకోబెట్టి.. నా నడుం మీద కూర్చొని కాళ్లు పైకి ఎత్తి కొట్టారు. ఒక కర్రతో నా వృషణాలను పొడిచే ప్రయత్నం చేసి నన్ను భయపెట్టారు. ఎంపీ రఘురామను కొడితేనే దిక్కు లేదు.. నిన్ను కొడితే కోర్టులు ఏం చేయగలవు? నిన్ను కొట్టిన విషయాన్ని న్యాయమూర్తితో చెబితే నువ్వు బయటకు వచ్చాక నిన్ను చంపేసినా కోర్టులు ఏమీ చేయలేవు. మేం చెప్పినట్టు వింటే బతుకుతావు. లేదంటే నువ్వు.. నీ కుటుంబం మిగలదు. యూట్యూబ్ వీడియోల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నువ్వు ఇంకోసారి మాట్లాడితే చంపేస్తాం. కావాలంటే వైసీపీ అనుకూలంగా వీడియోలు చేసుకో. లేదంటే నువ్వు ఎక్కడున్నా చంపేస్తాం. మేం కొట్టామని నువ్వు బయట చెప్పినా ఎవరూ నమ్మరు. నీ ఒంటిపై గాయాల్లేవు. అదే మా టాలెంట్. మేం కొట్టామని జడ్జితో చెబితే బెయిల్ రాదు. కొట్టలేదని చెబితేనే బెయిల్ వస్తుంది. నెల క్రితం వెంకటేశ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుంటే.. జడ్జి ముందు కొట్టాడని చెప్పాడు. రెండునెలలు అయినా అతడికి బెయిల్ రాలేదు" అంటూ తనకు ఎదురైన టార్చర్ ను కళ్లకు కట్టినట్లుగా చెప్పి వాపోయాడు.
తనకు భార్య.. రెండేళ్ల కొడుకు.. అరవై ఏళ్లకు పైబడిన తల్లిదండ్రులు ఉన్నారని.. తనను చంపేస్తే తన కుటుంబం రోడ్డున పడుతుందని వాపోయాడు. ఈ సందర్భంగా తనకు తగిలిన గాయాల్ని జడ్జికి చూపించారు. దీంతో స్పందించిన ఆమె మరోసారి వైద్యపరీక్షలు చేయాలని పేర్కొంటూ ఆదేశాలు జారీ చేశారు.
వైద్యులు పరీక్షలు జరిపి.. సీల్డ్ కవర్ లో ఉన్న సారాంశాన్ని తనకు శనివారం ఉదయం అందజేయాలని ఆమె ఆదేశించారు. కుప్పంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో డీజీపీని కలవటానికి వెళ్లిన టీంలో వెంగళరావు ఉండటాన్ని చూసిన పోలీసులు.. అతని కదలికలు.. సెల్ ఫోన్ మీద నిఘాతో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ వీడియోలు పోస్టు చేసినా.. అభిప్రాయాల్ని వెల్లడించినా ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చెప్పేందుకు తాజా ఉదంతంఒక చక్కటి ఉదాహరణగా చెబుతున్నారు.