Begin typing your search above and press return to search.

జ‌నాలిలా ఉంటే అలా ఎలా జ‌గ‌న్‌?

By:  Tupaki Desk   |   22 Nov 2021 10:52 AM GMT
జ‌నాలిలా ఉంటే అలా ఎలా జ‌గ‌న్‌?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్న‌డూ చూడ‌ని విల‌యం చూస్తోందిప్పుడు. ముఖ్యంగా అకాల వ‌ర్షాల‌తో రాయ‌ల‌సీమ అత‌లాకుత‌లం అవుతోంది. క‌డ‌ప‌, చిత్తూరు జిల్లాల ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింది. చెరువు పొంగిపొర్లుతున్నాయి. క‌ట్టలు తిగిపోయాయి. న‌దులు ఊర్ల‌మీదికి వ‌చ్చేశాయి.

ద‌శాబ్దాల వ్య‌వ‌ధిలో చూడ‌ని దారుణమైన ప‌రిస్థితి ఇప్పుడు చూస్తున్నారు. అన‌ధికారిక లెక్క‌ల ప్ర‌కారం వంద‌ల మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడి దృశ్యాలు చూస్తుంటే ఒళ్లు గ‌గుర్పొడుస్తోంది. ఇలాంటి టైంలో ప్ర‌భుత్వ యంత్రాంగం జ‌నాల‌కు వీలైనంత మేర సాయ‌ప‌డాలి. ఆ యంత్రాంగాన్ని న‌డిపించే ముఖ్య‌మంత్రిలో ఆందోళ‌న‌, ఆవేద‌న‌, చిత్త‌శుద్ధి క‌నిపించాలి. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాత్రం ఒక పూట నామ‌మాత్రంగా ఏరియ‌ల్ స‌ర్వే చేసి ఊరుకున్నారు.

ఏపీలో ఇంత‌టి దారుణ‌మైన ప‌రిస్థితులు నెల‌కొన్న స‌మ‌యంలో మందీ మార్బ‌లంతో హైద‌రాబాద్‌లో ఓ పెళ్లికి హాజ‌ర‌య్యారు ఏపీ సీఎం. ఇదేమైనా ఆయ‌న కుటుంబంలో జ‌రుగుతున్న పెళ్లా అంటే అదీ కాదు. టీఆర్ఎస్ నేత పోచారం శ్రీనివాస‌రెడ్డి మ‌న‌వ‌రాలి పెళ్లి. ఈ వివాహానికి హాజ‌ర‌వుతాన‌ని జ‌గ‌న్ ఇంత‌కుముందే మాట ఇచ్చి ఉండొచ్చు. అందుకు ఏర్పాట్లు కూడా చేసుకుని ఉండొచ్చు.

ఐతే ప్ర‌స్తుత ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆయ‌న ఈ ప‌ర్య‌ట‌న‌ను విర‌మించుకుని ఉండాల్సింది. తమ జీవితాలు ఇలా కూలిపోతుంటే ముఖ్య‌మంత్రి వెళ్లి అలా పెళ్లి వేడుక‌లో చిరున‌వ్వులు చిందిస్తుంటే జ‌నాల‌కు ఎలా ఉంటుంది? అధికార యంత్రాంగం చూసుకుంటుందిలే అని ముఖ్య‌మంత్రి ఈ స‌మ‌యంలో స‌హాయ కార్య‌క్ర‌మాల‌ను ప‌ర్య‌వేక్షించ‌కుండా పెళ్లి ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌డం అన్న‌ది ఎంత‌మాత్రం ఆమోద‌యోగ్యం కాదు. ముఖ్యమంత్రి ప‌ర్య‌వేక్షిస్తుంటే అధికారుల్లో చురుకుద‌నం వేరుగా ఉంటుంది. కానీ జ‌గ‌న్ ఈ సంగ‌తి ప‌ట్టించుకోలేదు. ఈ నేప‌థ్యంలో హుద్ హుద్ తుపాను స‌మ‌యంలో చంద్ర‌బాబు ప‌నితీరును గుర్తు చేసుకుంటూ జ‌గ‌న్ మీద నెటిజ‌న్లు ఆగ్ర‌హం చూపిస్తున్నారంటే.. చూపించరా మ‌రి?