Begin typing your search above and press return to search.
వైఎస్ జగన్ కు బాబు జన్మదిన శుభాకాంక్షలు
By: Tupaki Desk | 21 Dec 2017 12:47 PM GMTవైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత - ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా అనూహ్య జన్మదిన శుభాకాంక్షలు వచ్చాయి. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రత్యేకంగా ట్వీట్ చేశారు.`జన్మదిన శుభాకాంక్షలు వైఎస్ జగన్. మీరు సంతోషంగా - ఆరోగ్యంగా జీవించాలి`అని ఆ ట్వీట్లో చంద్రబాబు ఆకాక్షించారు.
కాగా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అనంతపురం జిల్లాలో నిరాడంబరంగా నిర్వహించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పుట్టపర్తి నియోజకవర్గంలోని నల్లమడలో బస చేయగా గురువారం ఉదయం పార్టీ నేతలు - కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. భారీ కేక్ కట్ తెప్పించి వైఎస్ జగన్ చేత కట్ చేయించారు. ప్రజాసేవే పరమావధిగా పనిచేయాలని ఈ సందర్భంగా పార్టీ నేతలకు.... ఆయన సూచించారు. ప్రజాసంకల్పయాత్రలో ఉన్న వైఎస్ జగన్ ఈ సారి ప్రజలతో కలిసి - ప్రజల మధ్య నిరాడంబరంగా పుట్టినరోజు జరుపుకోవడం విశేషం.
ఇదిలాఉండగా.. వైఎస్ జగన్ జన్మదినాన్ని పురస్కరించుకొని విజయవాడలో పార్టీ నేతలు మెగా వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టిన రోజు కూడా వైఎస్ జగన్ ప్రజల మధ్యే ఉన్నారని జనమే జగన్ అని అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
ఇదిలాఉండగా...వైఎస్ ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం ఉదయం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి - పార్టీ సీనియర్ నేతలు కొలుసు పార్థసారధి - మల్లాది విష్ణు - వెల్లంపల్లి శ్రీనివాస్ - పైలా సోమినాయుడు - పుణ్యశీల - శేఖర్ రెడ్డితోపాటు పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.
మరోవైపు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని పార్టీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ ఆకాంక్షించారు. వైఉస్ జగన్ 45వ జన్మదిన వేడుకలు హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ ను బొత్స సత్యనారాయణ - ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు - సజ్జల రామకృష్ణారెడ్డి - గడికోట శ్రీకాంత్ రెడ్డి - పుత్తా ప్రతాప్ రెడ్డి - చెల్లా మధు - కొలగట్ల వీరభద్రస్వామి తదితరులు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.