Begin typing your search above and press return to search.
సీఎస్ వర్సెస్ చంద్రబాబు..వార్ కొనసాగుతుందా?
By: Tupaki Desk | 4 May 2019 1:30 AM GMTఎన్నికల పోలింగ్ కు కొన్ని గంటల ముందు సీఎస్ గా వచ్చిన ఎల్వీ సుబ్రమణ్యంతో - ఎన్నికల కోడ్ వేళ సీఎం హోదాలో ఉన్నా అధికారాలను చలాయించలేకపోతున్న చంద్రబాబుకు జరుగుతున్న వార్ గురించి కొత్తగా వివరించనక్కర్లేదు. ఎల్వీ సుబ్రమణ్యంకు సీఎస్ గా ఉండే అర్హతే లేదు అని పోలింగ్ రోజున చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడంతో మొదలుకుని.. రకరకాల మాటల యుద్దం కొనసాగుతూ ఉంది.
ఎల్వీ సుబ్రమణ్యంను కేసుల్లో ఉన్న వ్యక్తి అని చంద్రబాబు నాయుడు అనడం వివాదాస్పదం అయ్యింది. దానిపై ఎల్వీకి మాజీ ఐఏఎస్ లు కూడా అండగా నిలిచారు. బాబు మాటలను ఖండించారు వాళ్లంతా. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అలా మాట్లాడకపోయినా.. ఎల్వీపై ఒక రేంజ్లో ఆగ్రహంతో అయితే ఉన్నారు.
ఇక ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎల్వీ సుబ్రమణ్యం కూడా పక్కాగా నియమాలను అమల్లో పెడుతూ బాబును మరింత ఇరకాటంలో పెడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమీక్షకు హాజరైన అధికారులకు నోటీసులు ఇవ్వడంతో మొదలుకుని ఎల్వీ కూడా బాబు విషయంలో పక్కా రూల్స్ ప్రకారం వ్యవహరిస్తూ ఉన్నారు.
ఇది చంద్రబాబు నాయుడి ఇగోను దారుణంగా దెబ్బ తీస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. కోడ్ అమల్లో ఉన్న సమయంలో సీఎంకు పవర్స్ ఉండవన్నట్టుగా సీఎస్ చేసిన వ్యాఖ్యలు కూడా బాబును మరింత అసహనానికి గురి చేస్తూ ఉన్నాయి.
తనకు సమీక్షల అధికారం ఇవ్వాలంటూ చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్ కు లేఖ రాసినా అది బుట్టదాఖలే అయ్యింది. అయితే తుఫాన్ నేపథ్యంలో ఏపీలో పాక్షికంగా ఎన్నికల కోడ్ కు మినహాయింపును ఇచ్చారు. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.
ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు వేరే టార్గెట్ ఏమీ లేదని.. ఎల్వీ సుబ్రమణ్యమే టార్గెట్ అయ్యే అవకాశాలున్నాయని అంచనా వేస్తూ ఉన్నారు. అయితే మరో ఇరవై రోజుల్లో ఎన్నికల ఫలితాలు వచ్చేస్తాయి. అప్పుడు ఎవరేమిటనే అంశంపై పూర్తి స్పష్టత వస్తుంది. అంత వరకూ సీఎస్ వర్సెస్ చంద్రబాబు నాయుడు పోరు ఎలా సాగుతుంది.. వీరి తీరు ఎలా ఉండబోతోంది అనేది డైలీ సీరియల్ లా వార్తల్లోని అంశంగా నిలిచేలా ఉంది.