Begin typing your search above and press return to search.
ప్రధానమంత్రి మోడీకి ఏపీ సీఎం జగన్ లేఖ
By: Tupaki Desk | 8 Jun 2021 8:30 AM GMTప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఏపీ సీఎం జగన్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. గ్రీన్ ఫీల్డ్ కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రి తన లేఖలో కోరారు. ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను లేఖలో వివరించిన సీఎం జగన్.. ఏపీలో 30 లక్షల మందికి ఇళ్ల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధానికి వెల్లడించారు.
‘పేదలందరికీ ఇళ్లు-పీఎంఏవై’ పథకం సుస్థిరాభివృద్ధికి దోహదం చేస్తుందని జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న అందరికీ ఇళ్లు కార్యక్రమంపై ప్రధానికి లేఖలో వివరించారు. 2022 కల్లా ‘పేదలందిరికీ ఇళ్లు-పీఎంఏవై’ పథకం పూర్తి చేయాలన్న ప్రధాని మోడీ సంకల్పం చాలా గొప్పదని సీఎం జగన్ లేఖలో పేర్కొన్నారు.
ఏపీ ప్రభుత్వం 68381 ఎకరాల భూమిని పేదలకు పంచింది. 17005 గ్రీన్ ఫీల్డ్ కాలనీల్లో 30.76 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని జగన్ తెలిపారు. ఈ కాలనీల్లో 28.35 లక్షల పక్కా ఇళ్లను నిర్మించేందుకు సంకల్పించామన్నారు. ఈ ఇళ్ల నిర్మాణం కోసం రూ.50,944 కోట్ల నిధులను ఖర్చు చేస్తున్నామని.. పేదలందరికీ ఇళ్లు, పీఎంఏవైలో భాగంగా మౌళిక వసతులు కల్పించాలని తెలిపారు. ఇందుకోసం 34,104 కోట్ల నిధులు అవసరం అవుతాయని వెల్లడించారు.
ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణాల కోసం ఇప్పటికే 23535 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రానికి అండగా ఉండాలని సీఎం వైఎస్ జగన్.. ప్రధానికి విజ్ఞప్తి చేశారు.