Begin typing your search above and press return to search.
సుప్రీం చీఫ్ జస్టిస్ కు ఏపీ సీఎం జగన్ లేఖ సంచలనం
By: Tupaki Desk | 11 Oct 2020 5:50 AM GMTపెను సంచలనం ఒకటి చోటు చేసుకుంది. ఇప్పటివరకు దేశ చరిత్రలో లేని రీతిలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయటం.. అందులో సుప్రీంకోర్టు జడ్జి మీద తీవ్ర ఆరోపణలు చేయటం ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఇందులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. న్యాయ వ్యవస్థలో తీవ్ర ప్రకంపనలకు తెర తీసేలా మారింది.
-టీడీపీ హయాంలో అడ్వొకేట్ జనరల్ గా పని చేసిన దమ్మాలపాటి శ్రీనివాస్ తో కలిసి సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్ వి రమణ భారీగా ఆస్తులు పోగేశారు. జస్టిస్ రమణ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నప్పుడు సాధారణ న్యాయవాదిగా ఉన్న దమ్మాలపాటి శ్రీనివాస్ కు అనుకూలంగా అందులో ఎన్ని ఉత్తర్వులు ఇచ్చారో వివరంగా పేర్కొన్నారు. శనివారం రాత్రి తొమ్మిది గంటల ప్రాతంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సంచలన అంశాల్ని వెల్లడించారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్ వి రమణకు.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలిపే ఆధారాల్ని విడుదల చేయటం గమనార్హం. గతంలో ఐదుగురు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి చంద్రబాబు అభిప్రాయానికి.. ఎన్.వి. రమణ వ్యక్తం చేసిన అభిప్రాయం ఒకేలా ఉండటం.. దాన్ని అప్పటి కొలీజియంలో సభ్యుడిగా ఉన్న జస్టిస్ చలమేశ్వర్ స్వయంగా చెప్పటాన్ని ప్రస్తావించారు. సంచలనంగా మారిన ఈ ప్రెస్ మీట్ లో అజేయ్ కల్లం ఏం చెప్పారంటే..
- అమరావతి భూ కుంభకోణంగా ప్రభుత్వం చెబుతున్న వ్యవహారంలో కేబినెట్ సబ్‌కమిటీ విచారణను, సిట్ దర్యాప్తును నిలిపేస్తూ ఇటీవల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.వి.సోమయాజులు ఇచ్చిన ఉత్తర్వులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేయటం మీకు తెలుసు.
- రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి సైతం... ఈ కుంభకోణంలో మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, సుప్రీంకోర్టు సిటింగ్ జడ్జి కుటుంబ సభ్యులపై జరుగుతున్న దర్యాప్తును నిలిపేశారు. దీనికి సంబంధించిన వార్తల్ని మీడియాలో రాకుండా ఉత్తర్వులిచ్చారు.
- దీంతో మేం ఈ అంశాలపై సుప్రీంకోర్టులో సవాలు చేశాం. ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు వ్యవహారాల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ జోక్యం చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వివరాల్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తెలియజేశాం.
- సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు వివిధ పత్రాల్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందజేశారు. ఈ పత్రాల్లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమణకు మధ్యనున్న అనుబంధాన్ని తెలియజేసేవే.
- ఏపీ హైకోర్టు వ్యవహారాల్ని జస్టిస్ రమణ నేరుగా ఏ తీరులో ప్రభావితం చేశారో ప్రధాన న్యాయమూర్తికి తెలియజేశాం. అమరావతి భూ కుంభకోణానికి సంబంధించిన వ్యవహారాల్ని.. అందులో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని ప్రధాన న్యాయమూర్తి ముందుంచాం.
- సీఎంకు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు పైన కానీ సుప్రీంకోర్టు పైనా.. న్యాయ వ్యవస్థ మీదా అత్యంత గౌరవ ప్రపత్తులు ఉన్నాయి. కొద్ది మంది గౌరవ న్యాయమూర్తుల వ్యవహారశైలిని సుప్రీంకోర్టుకు వివరించే ప్రయత్నమే. ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ ఎప్పుడూ చట్టాలకు.. రాజ్యాంగాలకు లోబడే పని చేస్తాయి.
- ఏ వ్యవస్థతో అయినా గౌరవపూర్వక విభేదాలే ఉంటాయి. తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల్ని పరిరక్షించేందుకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో వాస్తవాలు ఏమిటన్న విషయాల్ని భారత ప్రధాన న్యాయమూర్తికి ముఖ్యమంత్రి జగన్ వివరాలు అందజేశారు.