Begin typing your search above and press return to search.
సుప్రీం సీజేఐను కలిసిన ఏపీ సీఎం జగన్.. ఎందుకంటే?
By: Tupaki Desk | 20 Aug 2022 5:36 AM GMTగడిచిన కొంతకాలంగా అత్యున్నత స్థానాలకు చెందిన వారు వచ్చినా.. వారిని మర్యాదపూర్వకంగా కలిసే సంప్రదాయాన్ని లైట్ తీసుకుంటున్న ధోరణి రెండు తెలుగు రాష్ట్రాల్లో అంతకంతకూ ఎక్కువ కావటం తెలిసిందే. గతంలో రాజకీయ కారణాలు ఉన్నప్పటకీ.. వ్యక్తిగత స్థాయిలో మాత్రం మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ పద్దతిని ఫాలో అయ్యారు.
ఇప్పుడు అలాంటివాటికి మంగళం పాడేసిన తీరు తెలిసిందే.ఈ విధానానికి తెలంగాణ రాస్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే కాదు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఫాలో కావటం తెలిసిందే.
తమ రాష్ట్రానికి వచ్చే ప్రముఖుల్ని కలవటం ఇష్టం లేకుంటే.. ముఖం చాటేస్తున్న వైనాలు పెరుగుతున్నాయి. ఒక తెలుగువాడు దేశంలోనే అత్యంత కీలక స్థానానికి చేరితే.. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. తెలుగువాడన్న భావన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ అవుతోంది. ఈ తీరుపై చర్చ నడుస్తోంది కూడా.
ఇదిలాఉంటే.. రోటీన్ కాస్త భిన్నంగా అప్పుడప్పుడు కొన్ని ఉదంతాలుచోటు చేసుకుంటూ ఉంటాయి.తాజాగా విజయవాడకు వచ్చిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎల్వీ రమణను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిశారు.
ఆయన్ను మర్యాదపూర్వకంగాకలిసిన ఆయన.. కాసేపు అక్కడే ఉన్నారు. తాజాగా విజయవాడలో 29 విశాలమైన ఏసీ కోర్టు హాళ్లు.. ఏడు లిఫ్టులు.. న్యాయవాదులకు.. కక్షిదారులకు వెయిటింగ్ హాళ్లు.. క్యాంటీన్ తో సహా అన్ని సదుపాయాల్ని కొత్త కోర్టు భవనాల్లోకి అందుబాటులోకి తీసుకురానున్నారు.
వీటిని ఓపెన్ చేసేందుకు వచ్చిన సుప్రీం చీఫ్ జస్టిన్ ఎల్వీ రమణను సీఎం జగన్ తో పాటు..విపక్ష నేత చంద్రబాబులు కూడా భేటీ అయ్యారు. వీరిద్దరూ సీజేఐతో భేటీ అయి.. కాసేపు ఆయనతో ఉండి వెళ్లిపోయారు. మొత్తంగా ఇంత కాలానికి తమ రాష్ట్రానికి వచ్చిన ఒక ప్రముఖుడ్ని అధికార.. విపక్ష అధినేతలు కలవటం ఆసక్తికరంగా మారిందని చెప్పకతప్పదు.