Begin typing your search above and press return to search.
కొత్త లుక్స్‌తో అదరగొడుతున్న ఏపీ సీఎం..?
By: Tupaki Desk | 8 Nov 2019 7:14 AM GMTసీఎం జగన్ మోహన్ రెడ్డి .. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుండి ఏపీ అభివృద్ధి కోసం పాటు పడుతున్నాడు. ప్రతి క్షణం కూడా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే ఆలోచిస్తూ రాజన్న కి తగిన తనయుడిగా పేరు తెచ్చుకుంటున్నారు. ఇక సీఎం గా ఉన్న జగన్ మోహన్ రెడ్డి .. ఎప్పుడు ఒకే లుక్ లో కనిపిస్తాడు. సాధారణంగా జగన్ అంటే వైట్ షర్ట్ లోనే కనిస్తాడనే భావన అందరిలోనూ ఏర్పడింది. గతంలో గీతల చొక్కాలు ధరించేవారు ..వాటికీ జగన్ షర్ట్స్ అనే పేరు పెట్టి మర్కెట్స్ లో మంచి లాభాలు కూడా సంపాదించారు. సీఎం అయిన తరువాత తెల్ల చొక్కాలకే పరిమితం అయ్యారు. ఇక ఏదైనా పని నిమిత్తం ఇతర దేశాలకి వెళ్ళినప్పుడు మాత్రం జగన్ ని చూస్తే .. ఈయన అసలు మన సీఎం జగనేనా అనిపించకమానదు.
ఇకపోతే తాజాగా సీఎం జగన్ కొత్త లుక్ ఫోటో ఒకటి సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. సీఎం జగన్ కొత్త కళ్ళజోడు పెట్టుకొని హీరోలా ఉన్నాడు. గుంటూరు పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరైన సీఎం.. వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన ఉచిత కళ్లజోళ్ల పంపిణీ స్టాల్స్‌ను పరిశీలించారు. ఈ క్రమంలో కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్ ఓ కళ్లజోడు తీసి జగన్‌కు ఇచ్చారు. ఆ కళ్ల జోడు పెట్టుకున్న జగన్ బావుంది అంటూ చిరునవ్వు చిందించారు. స్వయంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసారు. అలాగే గురువారం గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో అగ్రిగోల్డ్ డిపాజిటర్ల చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని బాధితులకు చెక్కులు అందించారు. రూ.10వేలులోపు డిపాజిటర్లకు చెక్కులు ఇచ్చారు.