Begin typing your search above and press return to search.
మంత్రివర్గాన్నే మారుస్తా... జగన్ మార్క్ క్లాస్
By: Tupaki Desk | 7 Sep 2022 1:58 PM GMTముఖ్యమంత్రి జగన్ కి కోపం వచ్చింది. అలా ఇలా కాదు. ఒక రేంజిలోనే. అది కూడా కొత్త మంత్రుల విషయంలో. దాంతో ఆయన ఒక డైలాగ్ అన్నట్లుగా భోగట్టా. అసలు ఏపీ క్యాబినేట్ లో మంత్రులు ఉన్నాట్లా లేనట్లా. ఇది సూటి ప్రశ్న. క్యాబినేట్ సమావేశం పూర్తి అయిన తరువాత అధికారులను బయటకు పంపించి ఒక గంట సేపు ముఖ్యమంత్రి కొత్త మంత్రులకు క్లాస్ తీసుకున్నారని ప్రచారం సాగుతోంది. ఆ వివరాలను బట్టి చూస్తే మంత్రులు పాతిక మంది దాకా ఉన్నారు కానీ ప్రభుత్వ వాదన ఏదీ బయటకు వినిపించడం లేదు అన్నదే ప్రభుత్వ అధినేత బాధగా ఉంది అంటున్నారు.
అందుకే అసలు మంత్రులు ఉన్నారా లేరా అన్న సందేహం సాక్షాత్తు ముఖ్యమంత్రే వ్యక్తం చేశారని అంటున్నారు. దాదాపుగా ప్రతీ రోజూ ప్రభుత్వ కార్యకలాపాల మీద విపక్షాలు పెద్ద గొంతు చేస్తూ విమర్శలు చేస్తున్నాయి. వాటిని ఖండించడమో లేక సరైన వివరణ ప్రభుత్వం తరఫున ఇవ్వడమో చేయాలి కదా అని ముఖ్యమంత్రి అన్నట్లుగా తెలుస్తోంది.
మంత్రులు ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆయన నిలదీసినట్లుగా తెలుస్తోంది. విపక్షాలు అన్ని హద్దులూ దాటి వ్యక్తిగతానికి వస్తున్నారని, కుటుంబాలను కూడా మధ్యలోకి లాగుతున్నారని ముఖ్యమంత్రి అన్నట్లుగా భోగట్టా. అలా అయినా కూడా మాట్లాడరా అని ఆయన మంత్రుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు.
జగన్ ఇలా ఫైర్ అవడానికి కారణం ఇటీవల ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కాం విషయంలో ముఖ్యమంత్రి జగన్ తో పాటు ఆయన సతీమణి భారతి రెడ్డి పాత్ర కూడా ఉందని టీడీపీ ఆరోపణలు చేసింది. దానికి మంత్రుల నుంచి సరైన కౌంటర్ అయితే ఒక్కటీ పడలేదు. పార్టీకి చెందిన మహిళా నేతలు, ఇద్దరు లేడీ ఎమ్మెల్సీలు మాత్రమే రియాక్ట్ అయి అటాక్ చేశారు. అంతే తప్ప మంత్రులుగా కీలకమైన పదవులలో ఉన్న వారు మాత్రం సైలెంట్ గానే ఉన్నారు.
దీంతోనే అధినాయకుడిని మండుకొచ్చింది అని అంటున్నారు. దాంతో జగన్ బాగా సీరియస్ అయ్యారనే అంటున్నారు. నేరుగా తన కుటుంబాన్ని లక్ష్యం చేసుకుని ఆరోపణలు చేసినా స్పందించరా అని ఆయన క్లాస్ తీసుకున్నారని అంటున్నారు. ఇలాగే ఉదాశీనంగా ఉంటే ఏకంగా పూర్తి స్థాయిలో మంత్రివర్గానే మార్చాల్సి ఉంటుందని జగన్ గట్టి వార్నింగ్ ఇచ్చారని చెబుతున్నారు.
ఇకనైనా తీరు మార్చుకోవాలని ప్రభుత్వం మీద వచ్చే విమర్శలకు ధీటైన కౌంటర్లు ఇవ్వాలని, అదే విధంగా ప్రభుత్వం చేపడుతున్న వాటిని కూడా వివరించాలని జగన్ సూచించారని టాక్. మొత్తానికి చూస్తే జగన్ మంత్రుల మీద ఈ రేంజిలో ఫైర్ అవడం మాత్రం గతంలో లేదు. అయితే టోటల్ మంత్రులలో ఒకరిద్దరు తప్ప అంతా సైలెంట్ అయ్యారని ప్రచారం చాలా కాలంగా ఉంది. దాంతోనే జగన్ ఈ విధంగా రియాక్ట్ అయ్యారని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.