Begin typing your search above and press return to search.

పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలిస్తున్న సీఎం జగన్

By:  Tupaki Desk   |   28 Feb 2020 7:15 AM GMT
పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలిస్తున్న సీఎం జగన్
X
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ..పోలవరం ప్రాజెక్ట్‌ పనులను పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన రెండోసారి పోలవరం ప్రాజెక్ట్‌ను ఏరియల్‌ సర్వే ద్వారా సందర్శించి పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష జరపనున్నారు. అంతకు ముందు పోలవరం ప్రాజెక్టుకు వద్దకు చేరుకున్న సీఎం జగన్‌ కు హెలిప్యాడ్‌ వద్ద మంత్రులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, పేర్ని నాని, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఆళ్ల నాని, తానేటి వనిత తదితరులు స్వాగతం పలికారు.

ఈ పర్యటనలో క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్న తీరును సీఎం జగన్‌ స్వయంగా తెలుసుకోనున్నారు. 2021 చివరి నాటికి ప్రాజెక్టు ను పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది దీనితో పనులను వేగవంతం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ సంబంధిత అధికారులకి దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయడానికి ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించి, గడువు లోగా పూర్తి చేయాడానికి తీసుకోవాల్సిన చర్యలపై జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులకు మార్గనిర్దేశం చేయడానికి సీఎం వైఎస్‌ జగన్‌ ప్రాజెక్టుల బాట పట్టారు.

ఇకపోతే , 2021 జూన్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని ఆయన ఇటీవలే అసెంబ్లీలో తెలిపారు. 2021లో రైతుల కరువు తీరుస్తామని, రైతులకు నీళ్లు ఇస్తామని సగర్వంగా ప్రకటిస్తున్నానని జగన్ తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణ పనులను ఇప్పటికే ప్రారంభించామని చెప్పిన జగన్ పనుల్లో స్పీడ్ పెంచి త్వరిత గతిన పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు. చంద్రబాబు ఐదేళ్ల లో పూర్తి చేయని ప్రాజెక్టు ను ఏడాది లోనే పూర్తి చేస్తామని చెప్పిన నేపద్యంలోనే సీఎం జగన్ పోలవరం పై ప్రత్యేక దృష్టి పెట్టి , పనులని వేగంగా జరిగేలా దిశా నిర్దేశం చేయనున్నారు.