Begin typing your search above and press return to search.
ఇలా మాట్లాడితే.. పోయేది మన పరువే కదా.. జగనన్నా.. వైసీపీలో గుసగుస!
By: Tupaki Desk | 24 April 2022 2:37 AM GMTవైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్.. వ్యాఖ్యలు ఇటీవల కాలంలో ట్రోల్ అవుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికలకు ముందు.. ఆయన నిర్వహించిన పాదయాత్రలో అనేక చోట్ల బహిరంగ సభలు నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన బాగానే మాట్లాడారు.
ఎక్కడా తడబడలేదు. కానీ, ముఖ్యమంత్రి అయిన తర్వా త.. ఎందుకో.. రాసిచ్చిన స్క్రిప్టులు చదువుతూ.. తడబడడం ఎక్కువైంది. ఆయన ఏం మాట్లాడుతున్నా.. అనుకోని విధంగా అందులో తప్పులు దొర్లుతున్నాయి. దీంతో ఈ పాయింట్లు.. ప్రతిపక్షానికి ఆయుధంగా మారుతున్నాయి.
దీంతో జగన్‌పై ట్రోల్స్ పెరిగిపోతున్నారు. తాజాగా సున్నా వడ్డీ పథకం కింద డ్వాక్రా మహిళలకు.. నిధులు విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని ఒంగోలులో నిర్వహించారు. ఈసందర్భంగా పెద్ద ఎత్తున సభ కూడా పెట్టారు. డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలు తీసుకునే రుణాలకు సంబంధించిన వడ్డీల సొమ్మును ప్రబుత్వమే ఏటా చెల్లిస్తోంది.
ఇప్పటి వరకు రెండు విడతలుగా ఈ వడ్డీ సొమ్మును ఇచ్చిన సర్కారు తాజాగా.. మూడో విడత సొమ్మును విడుదల చేసింది. ఈ సదర్భంగా..జగన్ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు.
అయితే.. ఆయన ఏం మాట్లాడుతున్నారో.. కనీసం సరిచూసుకోకుండా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడువిపక్షానికి చేతినిండా పనిచెప్పాయి. డ్వాక్రా గ్రూపు మహిళలకు ఇస్తున్న రుణాలకు సంబంధించి.. వడ్డీలను తగ్గించాలని తాము బ్యాంకులతో మాట్లాడినట్టు జగన్ చెప్పారు. అయితే.. వాస్తవానికి ఇది ఇప్పటి వరకు 9.5 శాతంగా ఉంది. నూటికి ఏడాదికి 9 రూపాయల 50 పైసలువడ్డీ తీసుకుంటున్నాయి.దీనిని తాజాగా ప్రబుత్వం.. 8 రూపాయల 50 పైసలకు తగ్గించేలా బ్యాంకుల యజమానులతో చర్చలు జరిపింది.
ఈ విషయాన్ని చెప్పబోయిన జగన్.. పూర్తిగా తడబడ్డారు. వడ్డీని 8.5 నుంచి 9.5కు తగ్గించామని.. ఇది గొప్ప మేలు మలుపని వ్యాఖ్యానించారు. నిజానికి ఇలాంటి వ్యాఖ్యలు చేసేప్పుడు.. చాలా జాగ్రత్తగా ఉండాలి. వడ్డీని ఎంత నుంచి ఎంత తగ్గిస్తున్నారనే విషయాన్ని ముఖ్యమంత్రిగా ఆయనకే అవగాహన లేకపోతే.. ఎలా? అనేది ప్రశ్న.
గతంలో గుంటూరును గుండూరు అని.. రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రి ఉన్నారని.. దిశ యాప్‌ను 8 కోట్ల(లక్షలకు బదులు)మంది డౌన్ లోడ్ చేసుకున్నారని.. ఇలా.. అనేక సందర్భాల్లో జగన్ తన ప్రసంగాన్ని కేమిడీ చేశారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ నాయకులు కూడా.. సరిచూసుకో జగనన్నా! అని సూచనలు చేస్తున్నారు.