Begin typing your search above and press return to search.

ఏపీ సీఎం జగన్ కు ఏమైంది? ఆసుపత్రికి ఎందుకు వెళ్లారు?

By:  Tupaki Desk   |   13 Nov 2021 5:39 AM GMT
ఏపీ సీఎం జగన్ కు ఏమైంది? ఆసుపత్రికి ఎందుకు వెళ్లారు?
X
యువకుడైన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ఆరోగ్య సమస్యలు ఎదురు కావటం ఇప్పటివరకు చూసింది లేదు. సుదీర్ఘ పాద యాత్ర సందర్భం లోనూ ఆయనకు ఆరోగ్య సమస్యలు పెద్దగా ఎదురైంది లేదు. అలాంటి ఆయనకు కుడి కాలికి దెబ్బ తగలటం.. ఆసుపత్రి కి వెళ్లాల్సి రావటం పై ఆందోళన వ్యక్త మవుతోంది. ఇంతకూ ఆయన ఆసుపత్రి కి ఎందుకు వెళ్లారు? అసలేం జరిగింది? అన్న విషయాల్లో కి వెళితే..

సమయ పాలన విషయం లో ఏపీ ముఖ్య మంత్రి ఎంత కచ్ఛితంగా ఉంటారో తెలిసిందే. తండ్రి వైఎస్ మాదిరే ఆయన సమయ పాలనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. అంతే కాదు.. ఫిట్ నెస్ విషయం లోనూ అంతే శ్రద్ధను చూపిస్తుంటారు. నిత్యం ఆయన షెడ్యూల్ లో భాగంగా వ్యాయామాన్ని క్రమం తప్పకుండా చేస్తుంటారు.అలాంటి ఆయన ఆ మధ్యన ఇంట్లో వ్యాయామం చేస్తున్న వేళ లో కుడి కాలికి గాయమైంది.

ఆ తర్వాత నుంచి వ్యాయామం చేసే వేళ లో నొప్పి పెడుతోంది. తాజాగా గాయం వద్ద వాపు వచ్చింది. దీంతో.. ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవటానికి ఆసుపత్రి కి రావాలని కోరటం తో ఆయన మణిపాల్ ఆసుపత్రి కి వచ్చారు.

ప్రముఖ ఆర్థో పెడిక్ వైద్య నిపుణులు.. డాక్టర్ అనిల్ కుమార్ పాటు మణిపాల్ ఆసుపత్రి కి చెందిన మరి కొందరు వైద్యులు సైతం సీఎం జగన్ కు పరీక్షలు చేశారు. స్కానింగ్ నిర్వహించారు.పరీక్షల అనంతరం కాలికి ఏమీ కాలేదని.. బాగానే ఉందని.. ఎలాంటి విశ్రాంతి అవసరం లేదని చెప్పారు. కొన్నిరోజులు సాధారణ వ్యాయామాలు చేసుకోవాలని సూచన చేశారు. అయితే.. ఆ సమయం లో కాలికి బ్యాండేజీ ధరించి చేయాలని.. షూ వేసుకోకూడదన్నారు.

ఆసుపత్రి లోని ఫిజియోథెరపిస్టు సమక్షం లో ఒక బ్యాండేజీని కాలికి తొడిగి చూపించారు. కొన్ని మందులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వైద్య పరీక్షలు పూర్తి అయ్యాక సీఎం జగన్ తాడేపల్లి లోని ఇంటికి చేరుకున్నారు. నడిచే టప్పుడు ఇబ్బంది లేక పోవటం కాస్త ఊరటనిచ్చే అంశంగా చెప్పాలి.