Begin typing your search above and press return to search.

అప్ప‌ట్లో జ‌గ‌న్ ప్ర‌తి స్పీచ్ వెనుక ఉంది ఆయ‌నేన‌ట‌!

By:  Tupaki Desk   |   2 July 2019 4:21 AM GMT
అప్ప‌ట్లో జ‌గ‌న్ ప్ర‌తి స్పీచ్ వెనుక ఉంది ఆయ‌నేన‌ట‌!
X
పొందిన మేలును మ‌ర్చిపోకుండా ఉండ‌టం సంస్కారం. ఆ విష‌యంలో త‌న‌ను ఎవ‌రూ వంక పెట్ట‌లేర‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. తాను పొందిన మేలు గురించి నిర్మోహ‌మాటంగా చెప్పే వ్య‌క్తిత్వం జ‌గ‌న్ లో కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తుంది. తాను అసెంబ్లీలోకి ప్ర‌వేశ పెట్టిన త‌ర్వాత‌.. త‌న ప్ర‌సంగాల వెనుకున్నది ఎవ‌ర‌న్న విష‌యాన్ని తాజాగా జ‌గ‌న్ వెల్ల‌డించారు.

దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన‌ప్పుడు రాష్ట్ర ప్ర‌భుత్వ ఆర్థిక స‌ల‌హాదారుగా ప‌ని చేశారు. ఆ త‌ర్వాతి కాలంలో జ‌గ‌న్ కు స‌న్నిహితంగా ఉండేవారు. ఆయ‌న‌కు స‌ల‌హాలు.. సూచ‌న‌లు ఇచ్చేవారు. ఇదే విష‌యాన్ని తాజాగా ఆయ‌న 67వ జ‌యంతిని పుర‌స్కరించుకొని ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మానికి హాజ‌రైన జ‌గ‌న్‌.. ఆయ‌న్ను మ‌న‌స్ఫూర్తిగా స్మ‌రించుకున్నారు.

అనారోగ్యంతో ఇబ్బంది ప‌డుతూ గ‌త ఏడాది ఆయ‌న క‌న్నుమూశారు. ఆయ‌న‌తో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు జ‌గ‌న్‌. సోమ‌యాజులు ఒక లివింగ్ ఎన్ సైక్లోపిడియా లాంటి వారు. ప్ర‌తి విష‌యం మీదా ఆయ‌న‌కు అవ‌గాహ‌న ఉండేది. మా అంద‌రికి క్లాసులు చెప్పేవారు. సొంతంగా పార్టీ పెట్టిన నాకు ప్ర‌తి విష‌యంలోనూ స‌ల‌హాలు.. సూచ‌న‌లు ఇచ్చేవార‌న్న జ‌గ‌న్‌.. 2014లో తాను తొలిసారి అసెంబ్లీలో ప్ర‌వేశించిన త‌ర్వాత త‌న‌ను న‌డిపించిన వ్య‌క్తి సోమ‌యాజుల‌ని చెప్పారు. త‌న ప్ర‌తి స్పీచ్ వెనుక ఆయ‌న ఉండేవార‌న్నారు. సోమ‌యాజుల కుటుంబానికి త‌న‌తో పాటు తామంతా తోడుగా ఉంటామ‌న్నారు.

సోమ‌యాజుల కుమారుడు కృష్ణ ప్ర‌స్తుతం సీఎం జ‌గ‌న్ కు ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తండ్రికి త‌గ్గ‌ట్లే కొడుకు కృష్ణ‌కు కూడా అన్ని విష‌యాల మీద అవ‌గాహ‌న ఉంద‌ని.. తండ్రిని మించిన త‌న‌యుడిగా కృష్ణ ఎదుగుతార‌న్న న‌మ్మ‌కం త‌న‌కుంద‌న్నారు జ‌గ‌న్‌. తాను పొందిన మేలును మ‌ర్చిపోకుండా చ‌క్ర‌వ‌డ్డీ తీర్చే రీతిలో తాను వ్య‌వ‌హ‌రిస్తాన‌న్న విష‌యాన‌ని జ‌గ‌న్ తాజా మాట‌ల‌తో చెప్పేశార‌ని చెప్పాలి.