Begin typing your search above and press return to search.
ఆ విషయంలో చంద్రబాబు దత్తపుత్రుడు మౌనం: జగన్ హాట్ కామెంట్స్
By: Tupaki Desk | 14 Jun 2022 11:30 AM GMTఏపీ సీఎం జగన్.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్‌లపై విరుచుకుపడ్డారు. వారిద్ద రూ.. రాష్ట్రానికి పీడలా దాపురించారని.. అన్నారు. చంద్రబాబు దత్తపుత్రుడు.. రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో సీఎం జగన్ పర్యటించారు. 2021 ఖరీఫ్ పంటల బీమా పరిహారం చెల్లిస్తున్నామని..అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి న్యాయం చేస్తున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
రైతుల ఆత్మహత్యలపై చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు..
పాసు బుక్ గల రైతు ఆత్మహత్య చేసుకుంటే.. సాయం అందని వారిని ఒక్కరినైనా చూపించగలరా? అని సవాల్ విసిరారు.
చంద్రబాబు హయాంలో 458 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారికి నష్ట పరిహా రం ఇవ్వకపోతే.. ప్రస్తుత ప్రభుత్వం వారికి సాయం అందించిందని వెల్లడించారు. ఆరోజు చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ కి ఇవన్నీ గుర్తుకు రాలేదా? అని నిలదీశారు.
గత పాలనకు ఈ పాలనకు తేడాను ఒకసారి గమనించండని ప్రజలకు జగన్ విజ్ఞప్తి చేశారు. ఒక్క రూపా యి అవినీతి లేకుండా నేరుగా లబ్ధిదారులకు సాయం అందుతుందని చెప్పారు. గతంలో ప్రజలకు కావాల్సిన సాయం నేరుగా పాలకుల జేబులోకి వెళ్ళిందని విమర్శలు గుప్పించారు. గతంలో చంద్రబాబు ఏ విధంగా మోసం చేశారో అందరూ చూశారని అన్నారు. ఆయనకు తానా తందానా అంటూ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు ఏ విధంగా మంచి చేయాలో దత్తపుత్రుడు ఆలోచిస్తున్నాడని వ్యాఖ్యానించారు. వీరు రాజకీ యాల్లో ఉండే అర్హులేనా.? అని జగన్ ప్రశ్నించారు. నేను ఏదైనా సాయం చేస్తే.. అది ప్రజల్లోకి వెళ్ళకూడ దని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అనుకూల మీడియా దుష్ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
గత ప్రభుత్వ మేనిఫెస్టోలో ఏవి అమలు చేశారో చెప్పే ధైర్యం ఉందా? అని చంద్రబాబును ప్రశ్నించారు. మ్యానిఫెస్టోను అమలు చేయకుండా మోసం చేసిన వారు మంచి వారా? మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అమలు చేస్తున్న వారు చెడ్డ వారా? అని వ్యాఖ్యానించారు.