Begin typing your search above and press return to search.
జగన్ భావోద్వేగం.. మీ బిడ్డగా రుణం తీర్చుకుంటా
By: Tupaki Desk | 25 Dec 2019 9:12 AM GMTఎంత ఎత్తుకు ఎదిగినా ఆ ఊరి బిడ్డే కదా.. అందుకే పుట్టిన ఊరి రుణం తీర్చుకుంటున్నారు ఏపీ సీఎం జగన్. తాజాగా బుధవారం సొంత ఇలాకా పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. తనను ఇంతవాళ్లని చేసిన పులివెందుల ప్రజలపై వరాలు కురిపించారు.
పులివెందులలో సీఎం జగన్ వైఎస్ ఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు. దాదాపు రూ.347కోట్లతో వైఎస్ ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు శంకుస్థాపన చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు పునాది రాయి వేశారు.
పులివెందుల నియోజకవర్గాన్ని రూ.1329 కోట్లతో తొలి దశ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు సీఎం జగన్ తెలిపారు. ఈ సందర్భంగా సభలో జగన్ భావోద్వేగానికి గురయ్యారు.
జగన్ మాట్లాడుతూ ‘నాన్నను అమితంగా ప్రేమించారు. ఇప్పుడు నా వెంట ఉంటున్నారు. మీ బిడ్డగా రుణం తీర్చుకుంటాను’ అంటూ జగన్ పేర్కొన్నారు.