Begin typing your search above and press return to search.
సీఎం జగన్ పాల్గొనే ప్రోగ్రాంలో సొంత ఎంపీలకు అనుమతి ఉండదా?
By: Tupaki Desk | 26 March 2021 6:04 AM GMTఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్న ప్రోగాంలో సొంత పార్టీ ఎంపీలకే షాక్ తగిలింది. సాధారణంగా అధికార పార్టీ కాకుండా విపక్ష పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఉంటే.. ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమంలోవారికి చోటు లభించకపోవటం.. ప్రోటోకాల్ రచ్చ చోటు చేసుకోవటం మామూలే. అందుకు భిన్నంగా.. సొంతపార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు.. సీఎం పాల్గొన్న కార్యక్రమానికి అనుమతి లేదంటూ భద్రతా సిబ్బంది ఒప్పుకోకపోవటం షాకింగ్ గా మారింది.
కర్నూలు పట్టణానికి కూతవేటు దూరంలో ఉండే ఓర్వకల్లులో నిర్మించిన ఎయిర్ పోర్టును తాజాగా జాతికి అంకితం చేసే ప్రోగ్రాం చేపట్టారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సీఎంజగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ముఖ్యమంత్రి పాల్గొంటున్న కార్యక్రమం అంటే.. జిల్లాకు చెందిన ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు హాజరు కావటం కామన్. ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవానికి జరిగిన కార్యక్రమానికి ఇదే రీతిలో వచ్చిన కర్నూలు.. హిందూపురం (అనంతపురం జిల్లా) ఎంపీలకు చేదు అనుభవం ఎదురైంది.
విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు వెళుతున్న ఆ ఇద్దరు ఎంపీలను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో వారు అవాక్కు అయ్యారు. కేవలం పది మంది జాబితా మాత్రమే ఇచ్చారని.. అందులోని వారిని మాత్రమే అనుమతించాలంటూ ఉన్నతాధికారులు చెప్పినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. దీంతో.. వారికి అక్కడి పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.
ఎంపీలుగా ఉన్న తమకు అనుమతి లభించకపోవటం.. జాబితాలో తమ పేర్లు లేకపోవటంపై ఆగ్రహంగా ఉన్నా.. బయటపడలేక వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. ఎంపీకి ఇలాంటి పరిస్థితి ఎదురుకావటమా? అన్న విస్మయం వ్యక్తమైంది. ఇలాంటివి నేతలకు అవమానంగా మారతాయని.. సీఎం జగన్ ఇలాంటి విషయాల్ని సీరియస్ గా తీసుకోవాలన్న సూచన వినిపిస్తోంది. అయినా.. కర్నూలు పట్టణానికి దగ్గర్లో ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు పార్టీ ఎంపీ రాకపోవటం ఏమిటన్న ఆరా సీఎం జగన్ ఎందుకు తీయనట్లు..?