Begin typing your search above and press return to search.

సీఎం మాస్టర్ ప్లాన్ ..తలలు పట్టుకుంటున్న తెలుగు తమ్ముళ్లు !

By:  Tupaki Desk   |   25 Dec 2019 10:37 AM GMT
సీఎం మాస్టర్ ప్లాన్ ..తలలు పట్టుకుంటున్న తెలుగు తమ్ముళ్లు !
X
ప్రస్తుతం ఆంధప్రదేశ్ లో రాజధాని వ్యవహారం రాజకీయాన్ని వేడెక్కిస్తుంది. సీఎం జగన్ అసెంబ్లీ లో చెప్పినట్టు గానే, రాజధాని పై ఏపీ ప్రభుత్వం వేసిన కమిటీ కూడా మూడు రాజధానుల నిర్మాణానికే మద్దతు తెలపడంతో ..విశాఖ , కర్నూల్ , అమరావతిలో రాజధానులు అంటూ ప్రచారం జరుగుతుంది. ఇక అమరావతి నుండి రాజధానిని తరలిస్తున్నారు అన్న నేపథ్యంలో రాజధాని ప్రాంత రైతులు ..ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. మూడు రాజధానుల పై అధికార వైసీపీ నేతలు ఒకే మాట పై ఉండగా ..విపక్ష పార్టీ నేతలు మాత్రం ఎవరికీ ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో జీఎన్ రావు కమిటీ నివేదిక పై డిసెంబర్ 27న కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనుందని మంత్రి బొత్స ప్రకటించారు.

మూడు రాజధానుల విషయంలో జగన్ తన మార్క్ నిర్ణయాల తో ఎటువంటి సమస్యలు రాకుండా చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ నెల 27న జరగనున్న మంత్రి మండలి భేటీ కాబోతున్న విషయం తెలిసిందే. దీనితో అందరూ కూడా ఈ భేటీ అమరావతిలో జరుగుతుంది అని అనుకున్నారు. కానీ , సీఎం జగన్ మాత్రం ఈ భేటీని విశాఖలో నిర్వహించాలని ఆయన ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. భేటీకి సంబంధించి ఇప్పటికే చీఫ్ సెక్రటరీ సహాని ఏర్పాట్లు చేస్తున్నట్టు వినికిడి. వైజాగ్‌లో కేబినెట్ భేటీని నిర్వహించడం ద్వారా జగన్ అటు టీడీపీ కి చెక్ పెట్టడం తో పాటు, ఇటు అమరావతి రైతుల సెగ కూడా తగలకుండా జాగ్రత్త పడనున్నారు.

27 న జరగబోయే మంత్రి వర్గ భేటీ సమయం లో అమరావతి ప్రాంత రైతులతో కలిసి టీడీపీ నేతలు కూడా పెద్ద ఎత్తున నిరసన తెలపాలి అని అనుకున్నారు. కానీ , ఈ విషయాన్ని ముందే పసిగట్టిన సీఎం జగన్ ..ఈ భేటీ ని విశాఖలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు ఇప్పటికే సీఎం జగన్ ప్రకటనకు మద్దతిస్తోన్న నేపథ్యం లో వారు ఆందోళనలు చేసే అవకాశం దాదాపుగా లేదు. మరోవైపు కేబినెట్ సమావేశం అనంతరం ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ విశాఖనే అని తుది ప్రకటన చేయనున్న నేపథ్యంలో వైజాగ్ ప్రజలకు.. వైజాగ్ నుండే శుభవార్త చెప్పినట్లు అవుతుంది. దీనితో ఎప్పుడు టీడీపీ నేతలు ఆలోచనలో పడేట్టు తెలుస్తుంది. పార్టీలో ఉండే వారందరు ఒకే మాట పై ఉంటే ..ప్రభుత్వం పై పోరాటం చేయడం పెద్ద కష్టం కాకపోవచ్చు ..కానీ , పార్టీలోని నేతలే కొంతమంది దానికి వ్యతిరేకం అయితే ఎలా అని ఆలోచిస్తున్నారు. ఏమైనా కూడా సీఎం జగన్ మాస్టర్ మైండ్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే...