Begin typing your search above and press return to search.

ఆంధ్రాకు కేసీఆర్..తెలంగాణకు జ‌గ‌న్ ?

By:  Tupaki Desk   |   9 March 2022 12:30 AM GMT
ఆంధ్రాకు కేసీఆర్..తెలంగాణకు జ‌గ‌న్  ?
X
ఆంధ్రాకు కేసీఆర్ వ‌స్తే బాగుంటుంది.అంతేకాదు అమ‌రావ‌తి అభివృద్ధికి కేసీఆర్ నిధులు ఇవ్వాల‌ని కూడా అనుకుంటున్నారు. వాస్త‌వానికి ఆ రోజు అంటే శంకుస్థాప‌న రోజే ఇవ్వాల‌ని కేసీఆర్ అనుకున్నా అది సాధ్యం కాలేదు అని ఆ మ‌ధ్య కేటీఆర్ కూడా ఒప్పుకున్నారు.

అందుకు ఆ రోజు మోడీ నే ప్ర‌ధాన కార‌ణం అని దేశ ప్ర‌ధాని త‌మ త‌ర‌ఫున నిధులు ఏవీ ఇవ్వ‌కుండా మేం ఇస్తే బాగుంటుందా అని ఆగామ‌ని,లేదంటే ఆంధ్రుల రాజ‌ధాని అమ‌రావ‌తి అభివృద్ధికి వంద కోట్లు ఇవ్వ‌డం పెద్ద విష‌యమేం కాద‌ని తేల్చేశారు కేటీఆర్. ఎలా చూసుకున్నా కూడా కేసీఆర్ అంటే ఆంధ్రాలో చాలా క్రేజ్ ఉంది.ఇవాళ మ‌హిళా దినోత్స‌వాన కూడా క‌విత‌క్క పోస్టులపై ఆంధ్రా ప్ర‌జ‌లు మంచి ప్రేమ‌నే కురిపించారు.సోష‌ల్ మీడియాలో క‌విత‌కు మ‌ద్ద‌తుగా నిలిచారు.

అంతేకాదు క‌వితక్క కూడా ఓ సంద‌ర్భంలో పార్ల‌మెంట్ లో జై ఆంధ్రా నినాదం వినిపించి, విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఆంధ్రుల‌కు న్యాయం చేయాల్సిందే అని అన్నారు.హ‌రీశ్ రావు కూడా ఇరు తెలుగు రాష్ట్రాలూ కూర్చొని మాట్లాడుకుంటే ప‌రిష్కారం అయిపోయే స‌మ‌స్య‌ల‌కు కేంద్రం ద‌గ్గ‌ర పంచాయితీ ఎందుకు అని ప‌లుమార్లు అన్నారు. ఏ విధంగా చూసుకున్నా కేసీఆర్ స్థాయిలో ఓ జాతీయ పార్టీ వ‌స్తే ఆంధ్రాలో మంచి మార్కులే కొట్టేయ‌డం ఖాయం.

ఇక తెలంగాణ‌కు జ‌గ‌న్ పోవ‌డం ఖాయం.ఎందుకంటే చౌద‌రి ప్రాబ‌ల్యం క‌న్నా రెడ్డి సామాజిక‌వ‌ర్గ ప్రాబ‌ల్యం ఎక్కువ‌గా ఉన్న తెలంగాణ‌లో కేసీఆర్ కు అంతో ఇంతో గ‌తంలో సాయం చేసింది జ‌గ‌న్ అన్న‌ది వాస్త‌వం.అదేవిధంగా మొన్న‌టి ఎన్నిక‌ల్లో కేసీఆర్ కూడా జ‌గ‌న్ కు మంచి మ‌ద్ద‌తే ఇచ్చారు. ఆ ర‌కంగా ఇరువురూ ప‌ర‌స్ప‌ర అవ‌గాహ‌న‌తో ముందుకు వెళ్లిన దాఖ‌లాలే ఉన్నాయి.

అందుకే వీళ్లిద్ద‌రూ ఒక ప్రాంతం నుంచి మ‌రో ప్రాంతంకు వెళ్లి రాజ‌కీయం న‌డిపితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో రెండు పార్టీల‌కూ మంచి రోజులే వ‌స్తాయి. మంచి ఫ‌లితాలే సిద్ధిస్తాయి.