Begin typing your search above and press return to search.
కేసీయార్ తో జగన్ : బంధం బహు గట్టిదేనా...?
By: Tupaki Desk | 25 May 2022 2:30 AM GMTరెండు తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు. వారిద్దరికీ చాలా విషయాల్లో పోలికలు ఉన్నాయి. అలాగే తేడాలు కూడా ఉన్నాయి. కామన్ ఫ్యాక్టర్ గురించి చెప్పుకోవాలి అంటే చంద్రబాబే అనుకోవాలి. చంద్రబాబు నాయుడు ఈ ఇద్దరికీ ఉమ్మడి శత్రువుగానే చూడాలి. కేసీయార్ అయితే 2015లో ఓటుకు నోటుకు కేసు తరువాత బాబుని తెలివిగా ఆంధ్రా తీరం వైపు పంపించేశారు కానీ బాబు రాజకీయం మీద ఈ రోజుకీ ఆయనకు చాలా డౌట్లు ఉన్నాయని అంటారు.
చంద్రబాబు లాంటి వారికి చిన్న గడ్డి పోచ ఆసరాగా దొరికినా కచ్చితంగా దాన్ని పట్టుకుని మళ్ళీ బలోపేతం అవుతారు. ఇక తెలంగాణా కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్నారు. ఆయన బాబుకు ఒకనాడు నమ్మిన బంటు. అయినా ఈనాడు కూడా ఆ అనుబంధం కొనసాగుతోంది అన్నది టీయారెస్ అనుమానం.
మొత్తానికి తెలంగాణాలో పట్టు జారితే మళ్ళీ ఎక్కడ తగ్గుతామో అన్న ఆందోళన టీయారెస్ లో ఉంది. అదే సమయంలో చంద్రబాబుకు ఏపీలో కూడా చాన్స్ దొరకకూడదు అన్నది టీయారెస్ దృఢమైన ఆలోచన అని అంటారు. ఇక జగన్ కి కూడా అదే కావాల్సింది. చంద్రబాబు విషయంలో టీయారెస్ కంటే ఎక్కువ వ్యతిరేకత జగన్ కి ఉంది, ఉంటుంది కూడా. ఆయనకు ఏపీలో గట్టి ప్రత్యర్ధి బాబు మాత్రమే కనుక అలా చేయకతప్పదు.
ఈ కామన్ ఫ్యాక్టరే కేసీయార్ ని జగన్ని కలుపుతోంది అని భావిందాలి. ఇదిలా ఉంటే ఏపీ సర్కార్ తీరు మీద, జగన్ పోకడల మీద చాలా అభ్యంతరాలు టీయారెస్ కి ఉన్నాయి. అదే విధంగా తాను అనుకుంటున్న జాతీయ కూటమిలోకి జగన్ రాకపోవడం పట్ల కేసీయార్ కి ఆగ్రహం ఉంది అని కూడా చెబుతారు.
అలాగే టీయారెస్ పదే పదే తనను టార్గెట్ చేసి విమర్శలు ఇండైరెక్ట్ గా చేయడం పట్ల జగన్ కి కూడా కోపం ఉంటుంది. ఇవన్నీ ఎలా ఉన్నా ఈ ఇద్దరిదీ బలమైన బంధం అని మరో మారు రుజువు అయింది. అది దుబాయి సాక్షిగా జరిగింది. కేటీయార్ జగన్ కలసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఇద్దరు కూడా మంచి దోస్తులు గా కనిపించారు. ఇద్దరి కళ్ళలో ఆనందం కూడా ఫోటోలలో కనిపించింది.
ఇలా ఎందుకు జరుగుతోంది. ఏపీలో ఉంటే కేటీయార్ ఏపీ సర్కార్ మీద సెటైర్లు వేస్తారు, అదే దావోస్ లో మాత్రం దోస్త్ మేరా దోస్త్ అని ఎందుకు దగ్గరకు వస్తారు అంటే అదే రాజకీయ తమాషా. ఈ ఇద్దరూ ఒకరి మీద ఒకరు ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారు అని కూడా చెప్పుకోవాలి. తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయినా జనాలు అటూ ఇటూ ఒకే రకంగా స్పందిస్తారు.
అందువల్ల ఒకరి గెలుపులో మరొకరి గెలుపు పిలుపు ఉంది. ఎన్ని ఎలా అనుకున్నా ఈ ఇద్దరూ గద్దె మీద ఉండాలని గట్టిగా కోరుకుంటున్నారు. అందుకే ఈ దోస్త్ అలా సాగుతూనే ఉంటుంది. ఇది అర్ధం కాని వారికి మాత్రం తెలుగు నేల మీద తిట్లు, పరాయి దేశాన చప్పట్లు అని అనిపిస్తే అనిపించవచ్చు.