Begin typing your search above and press return to search.

ద‌శ‌ల వారీ మ‌ద్య నిషేధం.. ప్లాన్ రెఢీ!

By:  Tupaki Desk   |   1 Jun 2019 12:13 PM GMT
ద‌శ‌ల వారీ మ‌ద్య నిషేధం.. ప్లాన్ రెఢీ!
X
అధికారం చేతికి వ‌చ్చిన త‌ర్వాత ఎన్నిక‌ల వేళ‌లో ఇచ్చిన హామీల అమ‌లు సంగ‌తి ప‌క్క‌న పెట్టేయ‌టం ఇప్ప‌టివ‌ర‌కూ చూశాం. అందుకు భిన్నంగా ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన రెండు రోజుల వ్య‌వ‌ధిలోనే తానిచ్చిన హామీల అమ‌లు మీద జ‌గ‌న్ ప్ర‌ద‌ర్శిస్తున్న దూకుడు అధికారుల‌కు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. గ‌త ముఖ్య‌మంత్రి మాదిరి కాకుండా గంట‌ల కొద్దీ స‌మీక్ష‌ల పేరుతో ఫ్రై చేసే దానికి భిన్నంగా.. సింఫుల్ గా.. సంక్షిప్తంగా స‌మావేశాల్ని క్లోజ్ చేస్తున్న వైనం ఇప్పుడు వారికి హాయిగా మారింది.

ఒక్కొ అంశం మీద దృష్టి పెడుతున్న జ‌గ‌న్‌.. తాజాగా తాను అమ‌లు చేస్తాన‌ని హామీ ఇచ్చిన ద‌శ‌ల వారీ మ‌ద్య‌నిషేధం మీద రివ్యూ పెట్ట‌నున్నారు. మిగిలిన హామీల‌కు.. ఈ హామీకి చాలా తేడా ఉంది. ఈ హామీని అమ‌లు చేస్తే.. ఏడాదికి ప్ర‌భుత్వానికి వ‌చ్చే రూ.14వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోవాల్సి వ‌స్తుంది. ఈ హామీని ఇచ్చినంత తేలిగ్గా.. అమ‌లు చేయ‌టం క‌ష్ట‌మ‌న్న భావ‌న‌లో అధికారులు ఉన్నారు.

అయితే.. మ‌న‌సు పెడితే ఎలాంటి స‌మ‌స్య‌ల‌కైనా ప‌రిష్కారం ల‌భిస్తుంద‌న్న నానుడికి త‌గ్గ‌ట్లు.. తాజాగా ద‌శ‌ల వారీ మ‌ద్య‌నిషేధాన్ని ఎలా అమ‌లు చేయొచ్చ‌న్న ప్లాన్ ను సిద్ధం చేసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. అన్నింటికి మించిన ఈ అంశాన్ని ప్ర‌స్తావించిన వెంట‌నే.. అధికారులు చెప్పే ఆదాయం లెక్క‌లకు చెక్ పెట్టే వ్యూహాన్ని జ‌గ‌న్ సిద్ధం చేసిన‌ట్లుగా స‌మాచారం.

ప్ర‌తి ఏటా 20 శాతం మ‌ద్యం షాపుల‌ను త‌గ్గిస్తూ.. ఐదేళ్ల వ్య‌వ‌ధిలో సంపూర్ణ మ‌ద్య‌నిషేధాన్ని అమ‌లు చేయాల‌న్న‌ది జ‌గ‌న్ ఆలోచ‌న‌. మ‌రి.. దీనిపై భారీగా వ‌చ్చే ఆదాయం పోతుంది క‌దా అంటే.. దానికి బ‌దులుగా మ‌ద్యం లైసెన్స్ ల ఫీజులు భారీగా పెంచేయాల‌న్న ఆలోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉంది.

అంతేకాదు.. మ‌ద్యం ధ‌ర‌ను కూడా భారీగా పెంచేయ‌టం ద్వారా మ‌ద్యం తాగాల‌న్న ఆలోచ‌న త‌గ్గే రీతిలో ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించాల‌న్న ఆలోచ‌న‌తో ఉన్నారు. లైసెన్సుల ఫీజులు భారీగా పెంచేయ‌టం ద్వారా.. షాపులు త‌గ్గినా.. ఆదాయం త‌గ్గ‌దు. అదే స‌మ‌యంలో.. మ‌ద్యం సేవించాల‌న్న ఆలోచ‌న ఉన్న వారు పెరిగిన ధ‌ర‌ల పుణ్య‌మా అని ఇప్పుడు తాగే దానిలో కోటా వేసుకుంటారు. లేదంటే.. తాగే మొత్తాన‌ని త‌గ్గిస్తారు.

ఇలా ప్ర‌భుత్వ ఆదాయానికి న‌ష్టం క‌లుగ‌కుండా ద‌శ‌ల వారీ మ‌ద్య‌నిషేధాన్ని అమ‌లు చేయాల‌న్న ఆలోచ‌న‌లో జ‌గ‌న్ ఉన్నారు. ఒక మంచి ప‌ని చేసేట‌ప్పుడు ప్ర‌కృతి కూడా స‌హ‌క‌రిస్తుంద‌ని చెబుతారు. మ‌రి.. జ‌గ‌న్ కు ఎలా స‌హ‌కారం అందిస్తుందో చూడాలి.