Begin typing your search above and press return to search.

రెడ్ల విష‌యంలో జ‌గ‌న్ ఫార్ములా ఇదే.. ఏం చేస్తున్నారంటే

By:  Tupaki Desk   |   7 March 2022 2:30 AM GMT
రెడ్ల విష‌యంలో జ‌గ‌న్ ఫార్ములా ఇదే.. ఏం చేస్తున్నారంటే
X
వైసీపీ ప్ర‌భుత్వంలో `రెడ్డి` ట్యాగ్ ఉన్న అధికారులు పెరుగుతున్నారు. ఇప్ప‌టికే రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన చాలా మంది అధికారులు కీల‌క స్థానాల్లో ఉన్నారు. అయితే.. వీరిని టార్గెట్ చేసుకుని.. విమ‌ర్శ‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా ప్ర‌తిప‌క్షాలు మ‌రింత ఎక్కువ‌గానే వీరిపై విమ‌ర్శ‌లు చేస్తున్నాయి.

ఈ క్ర‌మంలో రెడ్డి ముద్ర‌ను తుడిచేసేందుకు సీఎం జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నార‌నే సంకేతాలు.. వ‌స్తున్నాయి. నిజానికి మంత్రి వ‌ర్గంలో రెడ్డి వ‌ర్గానికి త‌క్కువ ప్రాధాన్యం ఇవ్వ‌డం ద్వారా.. రాష్ట్రంలో రెడ్డి రాజ్యం వ‌స్తుంద‌నే వాద‌న‌ను జ‌గ‌న్ ప‌క్క‌న పెట్టిన‌ట్టు అయింది.

2019 ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ఏపీలో ఏర్ప‌డిన జ‌గ‌న్ స‌ర్కారు రెడ్ల‌కు ప్రాధాన్యం ఇస్తార‌ని.. రాష్ట్రంలో రెడ్డి వ‌ర్గానిదే హ‌వా అని పెద్ద ఎత్తున అంచ‌నాలు వ‌చ్చాయి. అయితే.. ఈ అంచ‌నాల‌ను ప‌టాపంచ‌లు చేస్తూ.. రెడ్డి వ‌ర్గానికి మంత్రి ప‌ద‌వులు విష‌యంలో సీలింగ్ విధించుకుని జ‌గ‌న్ ముందుకు సాగారు.

దీంతో ఆయ‌న స‌ర్కారుపై రెడ్డి వ‌ర్గం అనే ముద్ర ప‌డ‌కుండా.. ఒకింత జాగ్ర‌త్త ప‌డిన‌ట్టు అయింది. అంటే.. మంత్రులుగా ఇత‌ర ప‌దవుల్లోనూ రెడ్డి వ‌ర్గానికి ఆశించిన మేర‌కు ప‌ద‌వులు ఇవ్వలేదు. ఇంత వ‌ర‌కు సీఎం జ‌గ‌న్ స‌క్సెస్ అయ్యారు.

అయితే.. కీల‌క‌మ‌న‌ అధికారుల విష‌యంలోను.. కీల‌క స్థానాల విష‌యంలోనూ.. రెడ్డి వ‌ర్గానికి చెందిన అధికారుల‌ను తీసుకువ‌చ్చి పెట్టుకుంటున్నారు. ఇదే ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీస్తోంది. దీనికి కార‌ణాలు తెలియ‌దు కానీ.. కొత్త‌గా జ‌రుగుతున్న అన్ని నియామ‌కాల్లోనూ రెడ్డి వ‌ర్గం అధికారుల‌దే హ‌వాగా మారిపోయింది. సీఎం జ‌గ‌న్ ఇలా వ్య‌వ‌హ‌రించ‌డమే ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

నిజానికి ఒక వ‌ర్గం ప్ర‌జ‌లు రెడ్డి వ‌ర్గం ప‌ట్ల వ్య‌తిరేక‌త‌తో ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌ రాజ‌కీయంగా త‌న సామాజిక వ‌ర్గానికి ప‌దువుల ఇవ్వ‌కుండా వ్య‌వ‌హ‌రించారు. కానీ, అధికారుల విష‌యంలో రెడ్డి వ‌ర్గాన్ని ప‌క్క‌న పెట్ట‌లేక పోతున్నారు. తాజాగా డీజీపీ ప‌ద‌విని రెడ్డి వ‌ర్గానికే సీఎం ఇచ్చారు.

అదేస‌మ‌యంలో త‌న సీఎంవోలో కీల‌క బాధ్య‌త‌ల‌ను కూడా కేఎస్ జ‌వ‌హ‌ర్‌రెడ్డికి అప్ప‌గించారు. అదేవిధంగా ధ‌నుంజ‌య‌రెడ్డికి మ‌రింత కీలక‌మైన బాధ్య‌త‌లు ఇచ్చారు. దీంతో అటురాజ‌కీయంగా రెడ్డి వ‌ర్గాన్ని ప‌క్క‌న పెడుతున్నా.. అధికారుల విష‌యంలో త‌న చుట్టూ.. త‌న సామాజిక వ‌ర్గాన్నే పెట్టుకోవ‌డం.. జ‌గ‌న్ వ్యూహంగా మారింద‌నే వాద‌న వినిపిస్తోంది. ఇత‌ర సామాజిక వ‌ర్గాల‌ను ఆయ‌న న‌మ్మ‌లేక పోతున్నార‌ని వైసీపీలోనూ గుస‌గుస వినిపిస్తోంది.

ఇక‌, రెడ్డి వ‌ర్గంగా ఉన్న‌ అధికారులకు ముఖ్యమంత్రి ద‌గ్గ‌ర‌ ప‌ని చేయ‌డం అంత సులువు కాద‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు. వారు ఏం చేసినా.. ఆచి తూచి అడుగులు వేయాల్సి ఉంటుంద‌ని అంటున్నారు. వారు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకున్నా.. అంతిమంగా పార్టీపై ప్ర‌భావం చూపించే ఛాన్స్ ఉంటుంద‌ని అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో రెడ్డి అధికారులు చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచిస్తున్నారు. వ‌చ్చేది ఎన్నిక‌ల నామ సంవ‌త్స‌రం కావ‌డంతో.. మ‌రింత అప్ర‌మత్తంగా వ్య‌వ‌హ‌రించాల‌ని చెబుతున్నారు. ఏరికోరి రెడ్ల‌ను తెచ్చుకునేంది కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు కోస‌మేన‌ని వైసీపీలోని జ‌గ‌న్ అనుకూల వ‌ర్గం చెబుతోంది.