Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ ప్లాన్ ఏ అండ్ ప్లాన్ బీ... ఇదేనా?

By:  Tupaki Desk   |   7 April 2022 2:30 PM GMT
జ‌గ‌న్ ప్లాన్ ఏ అండ్ ప్లాన్ బీ... ఇదేనా?
X
ఏపీలో మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న అంశం.. అనేక మ‌లుపులు తిరుగుతోంది. సీఎం జ‌గ‌న్ త‌న మంత్రి వ‌ర్గాన్ని పూర్తిగా మారుస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న ఎలాంటి న‌నిర్ణ‌యం తీసుకుంటారు. ఎలా ముందుకు సాగుతారు? అనేది ఆస‌క్తిగాను.. ఆశ్చర్యంగా ఉంది. విష‌యంలోకి వెళ్తే.. 2019 ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న జ‌గ‌న్ పార్టీ.. ఆవెంట‌నే ఏర్పాటు చేసిన ప్ర‌భుత్వంలో మంత్రివ‌ర్గాన్ని చిత్రంగా కూర్పు చేసింది. ఈ మంత్రి వ‌ర్గం ఏర్పాటులో ఆయ‌న సోష‌ల్ ఇంజ‌నీరింగ్‌కు ప్రాధాన్యం ఇచ్చారు.

అంతేకాదు.. ఏకంగా.. ఐదుగురు డిప్యూటీ ముఖ్య‌మంత్రుల‌ను కూడా నియ‌మించారు. ఇక‌, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ.. కాపు సామాజిక వ‌ర్గాల‌కు జ‌గ‌న్ ప్రాధాన్యం ఇచ్చారు. అయితే.. ఈ మంత్రి వ‌ర్గాన్ని రెండున్న‌రేళ్ల త‌ర్వాత మారుస్తాన‌ని చెప్పిన‌.. జ‌గ‌న్.. అనుకున్న విధంగా ఇప్పుడు.. (క‌రోనా నేప‌థ్యంలో కొంత ఆల‌స్యం అయింది) మంత్రి వ‌ర్గాన్ని మారుస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న అన్ని అడుగులు చాలా జాగ్ర‌త్త‌గా వేస్తున్నార‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. ఎన్నిక‌లకు రెండేళ్లే స‌మయం ఉంది.

దీంతో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను మ‌రోసారి మెప్పించాల్సిన అవ‌స‌రం ఉంది. అందుకే.. జ‌గ‌న్ వ్యూహాత్మకం గా.. ముందుకు సాగుతున్నారు. ఈ క్ర‌మ‌లో ప్లాన్‌-ఏ, ప్లాన్‌-బీల‌పై జ‌గ‌న్ దృష్టి పెట్టిన ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. ప్లాన్ ఏ ప్ర‌కారం.. మొత్తం 26 మంది కేబినెట్లో(సీఎంతో స‌హా)... ఇద్ద‌రు ఓసీల‌కు(రెడ్ల‌కు), క‌మ్మ‌ల‌కు 1, కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన 2 కేటాయించి.. సీఎంగా తాను ఉన్నారు కాబ‌ట్టి.. మొత్తం 26 స్థానాల్లో ఆరు తీసేయ‌గా.. 20 మంది మంత్రుల‌కు ఇత‌ర సామాజిక వ‌ర్గాల‌ను కేటాయిస్తే.. బెట‌ర్ అని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

అంటే.. ప్లాన్ ఏ ప్ర‌కారం.. మొత్తం 20 మంది మంత్రులు కూడా ఎస్సీ., ఎస్టీ, బీసీల నుంచే తీసుకునే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఇక‌, ప్లాన్ బీ విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఉన్న మంత్రి వ‌ర్గం మాదిరిగానే.. ఇప్పుడున్న సామాజిక వ‌ర్గాల వారీగా.. నాయ‌కుల‌కు 2019లో ఎలాంటి అవ‌కాశం ఇచ్చారో.. సేమ్ ఇచ్చి.. న‌లుగురిని ఉంచి.. మొత్తం అంద‌రినీ మార్చ‌డం. ఈ రెండు వ్యూహాల‌పైనా.. సీఎం జ‌గ‌న్ దృష్టి పెట్టిన‌ట్టు స‌మాచారం. మ‌రి ఏది అమ‌లు చేస్తో చూడాలి. ఏదేమైనా.. మంత్రి వ‌ర్గం మార్పుపై.. అధికార పార్టీలో న‌రాలు తెగే ఉత్కంఠ నెల‌కొన‌డం గ‌మ‌నార్హం.