Begin typing your search above and press return to search.

జై జ‌గ‌న్ : వీర విధేయులు వీళ్లు.. వెయ్యండి వీర‌తాళ్లు

By:  Tupaki Desk   |   7 April 2022 1:30 PM GMT
జై జ‌గ‌న్ : వీర విధేయులు వీళ్లు.. వెయ్యండి వీర‌తాళ్లు
X
ఇవాళ మంత్రుల‌తో ఆఖ‌రి భేటీ నిర్వ‌హించారు జ‌గ‌న్. వీళ్లంద‌రితో రాజీనామాలు చేయించి కొత్త వారిని తీసుకోనున్నారు. ఇందులో పాత వారు ఓ ముగ్గురు న‌లుగురు ఉంటే ఉండ‌వ‌చ్చు. కానీ ఆ క‌థ ఇంకా డిక్లైర్ కాలేదు. కానివి చెప్పి వైసీపీ అభిమానుల‌కు త‌ప్పుడు వార్తలు ఇవ్వ‌రాదు,ఆ విధంగా ఇప్పుడున్న ఊహాగానాలు రేపు మార‌వ‌చ్చు క‌దా ! ఏదేమ‌యిన‌ప్ప‌టికీ మంత్రులు వెళ్తూ వెళ్తూ భావోద్వేగానికి లోన‌వుతున్నారు.

కొంద‌రు అతి ఆవేశానికి కూడా లోన‌వుతున్నారు. వెళ్తూ వెళ్తూ మీడియాకు స్వీట్ బాక్స్లు పంచి పెట్టారు స‌మాచార శాఖ మంత్రి పేర్ని నాని. వెళ్తూ వెళ్తూ నా త‌ర‌ఫున త‌ప్పులుంటే మ‌న్నించండి అని చాలా హుందాగానే చెప్పారు ప్ర‌యివేటు బ‌స్ ఆప‌రేట‌ర్ల‌తో ! ఈ పాటి కూడా కొడాలి నాని అనే వివాదాస్ప‌ద మంత్రి చెప్ప‌లేదు క‌నుక ఆయ‌ను మ‌ళ్లీ టీడీపీ కార్న‌ర్ చేస్తోంది.

ఈ పాటి హుందాత‌నం కూడా అవంతి కానీ వెల్లంప‌ల్లి కానీ ప్ర‌ద‌ర్శించ‌లేదు క‌నుక మ‌ళ్లీ మ‌ళ్లీ ఆ ఇద్ద‌రినీ జ‌న‌సేన టార్గెట్ చేస్తోంది. ఈ క్ర‌మంలో కొంద‌రు అతిగా మాట్లాడుతూ వీర విధేయులుగా పేరు తెచ్చుకునేందుకు తాప‌త్ర‌య‌ప‌డుతున్నారు. ఇదే వీర‌విధేయ‌త‌తో దాస‌న్న ఉన్నారు కానీ ఆయ‌న‌ను మ‌ళ్లీ కొన‌సాగించ‌డంలేదు అని తెలుస్తోంది. అదేవిధంగా ఇదే వీర విధేయ‌త‌తో కొడాలి నాని కూడా ఉన్నారు అయినా ఆయ‌న‌ను కొన‌సాగించ‌డం లేదు అని తెలుస్తోంది.

కానీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలం సురేశ్ ను మాత్రం కొనసాగిస్తార‌న్న వార్త‌లు విన‌వ‌స్తున్నాయి. ఇవి కూడా నిర్థార‌ణ‌లో లేవు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ కోసం తాను త‌ల కోసుకుంటాన‌ని, ఆయ‌న గీసిన గీత దాట‌న‌ను అని అంటున్నారు. ఆయ‌న ఇచ్చిన ల‌క్ష్యాల మేర‌కు ప‌నిచేశాన‌ని కూడా అంటున్నారు. మంత్రి వ‌ర్గంలో ఉన్న‌త విద్యావంతుడిగా పేరున్న సురేశ్ గ‌తంలో కేంద్ర స‌ర్వీసుల్లో ఉన్న‌తాధికారిగా ప‌నిచేశారు.

కొన్ని అవినీతి ఆరోప‌ణ‌లు కూడా ఆయ‌న భార్యపై ఉన్నాయి, కొన్ని కేసులు కూడా న‌డుస్తున్నాయి. కానీ ఇవేవీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా జ‌గ‌న్ ఆయ‌న్ను కొన‌సాగిస్తున్నారు అని తెలుస్తోంది అందుకే ఆయ‌న వీర విధేయుడిగా మ‌రింత బాగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా మరో మంత్రి మరియు డిప్యూటీ సీఎం నారాయ‌ణ స్వామి కూడా తీవ్ర భావోద్వేగంతోనే మాట్లాడారు. త‌న ప్రాణం ఉన్నంత వ‌ర‌కూ జ‌గ‌న్నే సీఎంగా చూడాల‌ని అనుకుంటున్నానని వ్యాఖ్య‌లు చేసి సంచ‌ల‌నాత్మ‌కం అయ్యారు. ఉమ్మ‌డి చిత్తూరు రాజ‌కీయాల్లో తిరుగులేని నేత అయిన పెద్దిరెడ్డి అనుచ‌రుడిగా పేరున్న స్వామిని త‌ప్పిస్తార‌ని తెలుస్తోంది.