Begin typing your search above and press return to search.
బాబును ఓడించండి... టార్గెట్ వారికే... ?
By: Tupaki Desk | 7 April 2022 5:30 PM GMTఏపీలో వైసీపీకి అసలైన విపక్షం అంటే టీడీపీనే చెప్పుకోవాలి. ఢీ అంటే ఢీ అంటూ రెండు పార్టీల మధ్య పోరు భీకరంగా సాగుతుంది. దాంతో వైసీపీ టీడీపీల మధ్య ఉప్పు నిప్పులాగానే ఎపుడూ సీన్ ఉంటుంది. దాంతో చంద్రబాబు జగన్ని మాజీ ముఖ్యమంత్రిని చేయాలని చూస్తే జగన్ సైతం చంద్రబాబు రాజకీయాన్ని త్వరగా ముగించాలని ఆతృత పడుతూంటారు.
ఇవన్నీ పక్కన పెడితే మంత్రులుగా గత 34 నెలలుగా ఉంటూ మాజీలు అయిన వారికి జగన్ ఇచ్చిన పిలుపు ఏంటి అంటే చంద్రబాబుని ఓడించండి అని. నిజానికి ఇది పవర్ ఫుల్ నినాదంగానే చూడాలి. వచ్చే ఎన్నికలు చంద్రబాబుకు దాదాపుగా చివరి ఎన్నికలు అని జగన్ భావిస్తున్నారు. అందుకే ఈసారి కనుక బాబుని ఓడిస్తే ఇక వైసీపీకి ఏ కోశానా తిరుగులేదని అంటున్నారు.
మాజీలు అయ్యారని బాధ వద్దు, మీ మీద కీలక బాధ్యతలు ఉంటాయి. మంత్రివర్గంలో వేయి రోజుల పాటు పనిచేశారు. ఇక మిగిలిన ఏడు వందల రోజులూ జనాల్లో ఉండండి. మంత్రులుగా పనిచేసిన అనుభవంతో పాటు, ప్రజల వద్దకు ప్రభుత్వ కార్యక్రమాలను తీసుకెళ్ళండి. టీడీపీని ఓడించి మళ్లీ మన పార్టీని విజయపధంలో నడించేలా చూడండి.
ఆ మీదట పార్టీ కోసం పనిచేయాలని జగన్ వారికి సూచించారు. చంద్రబాబు ఈసారి కనుక ఓడితే ఇక ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు. అందువల్ల బాబు ఓటమే టార్గెట్ కావాలని జగన్ మంత్రులకు ఉద్భోదించినట్లుగా చెబుతున్నారు. మొత్తానికి జగన్ తన రాజకీయ ప్రత్యర్ధి చంద్రబాబుని ఓడించే బాధ్యత పదవి దిగిపోతున్న మంత్రుల మీద పూర్తిగా పెట్టేశారు. మరి వారు ఏం చేస్తారో, 2024లో వైసీపీని ఏ విధంగా అధికారంలోకి తెస్తారో చూడాలి.