Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌కు మూడేళ్ల త‌ర్వాత గుర్తుకు వ‌చ్చిన 'అవినీతి' ఏం చేశారంటే!

By:  Tupaki Desk   |   20 April 2022 3:30 PM GMT
జ‌గ‌న్‌కు మూడేళ్ల త‌ర్వాత గుర్తుకు వ‌చ్చిన అవినీతి ఏం చేశారంటే!
X
ఏపీలో అవినీతి ర‌హిత పాల‌న అందిస్తానంటూ.. 2019 ఎన్నిక‌ల‌కు ముందు హామీ ఇచ్చిన జ‌గ‌న్‌.. ఈ మూడేళ్ల కాలంలో దీనిని మ‌రిచిపోయారు. ఎక్క‌డిక‌క్క‌డ అక్ర‌మాలు.. అవినీతి తాండ‌విస్తున్నాయ‌ని.. ప్ర‌జ‌లు గ‌గ్గోలు పెట్టినా.. ఆయ‌న ప‌ట్టించుకోలేదు. గ‌నులు దోచేశారు.. ఇసుక‌ను కూడా అధికార పార్టీ నాయ‌కులు పిండేసి.. ప‌సిడి చేసుకున్నారనే ఆరోప‌ణ‌లు ఊరూవాడా వెల్లువెత్తాయి. `నేను రైతు పాసుపుస్త‌కంలో మార్పు కోసం జేసీ నుంచి ఎంఆర్వో వ‌ర‌కు 4 ల‌క్ష‌ల రూపాయ‌ల లంచం ఇచ్చాను ఇది గో సాక్ష్యాలు`` అని నేరుగా గుంటూరుకు చెందిన రైతు క‌న్నీరు పెట్టుకుని.. ప‌ని జ‌ర‌గ‌క ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.

ఇంత తీవ్ర‌మైన అవినీతి ఎక్క‌డా జ‌ర‌గ‌డం లేద‌ని.. ప్ర‌తిప‌క్షాలు కూడా ఆరోపించాయి. అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ మూడేళ్లు ఈ విష‌యాన్ని ప‌ట్టించుకోలేదు. అయితే.. తాజాగా మాత్రం.. ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో దీనిపై హ‌డావుడి చేశారు. అవినీతి జరుగుతున్న విభాగాలను ప్రక్షాళన చేయాల్సిందేనని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. "దిశ" తరహాలో అవినీతిపై ఫిర్యాదులకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు ప్రత్యేక యాప్‌ రూపొందించాలన్నారు. అనిశా, దిశ, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్ఈబీ) కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ), దిశ, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్ఈబీ) కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్ర జగన్‌ అధికారులను ఆదేశించారు. హోంశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. అవినీతి జరుగుతున్న విభాగాలను ప్రక్షాళన చేయాల్సిందేనని అన్నారు. దిశ తరహాలో అవినీతిపై ఫిర్యాదులకు అనిశాకు ప్రత్యేక యాప్‌ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నెల రోజుల్లో యాప్ రూపకల్పన చేయాలని అధికారులకు సూచించారు.

మండల స్థాయి వరకు ఏసీబీ స్టేషన్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. అంతేకాకుండా ఇతర విభాగాల్లో అవినీతి ఫిర్యాదులపైనా ఏసీబీ పర్యవేక్షణ ఉండాలని వెల్లడించారు. నేర నిర్ధరణకు ఫోరెన్సిక్‌ విభాగం బలోపేతం చేస్తామని సీఎం జగన్ వెల్లడించారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ వ్యవహారాలను చోటు ఉండకూడదని.. దాన్ని కూకటివేళ్లతో సహా పెకలించాలన్నారు. డ్రగ్స్‌ విషయంలో విద్యాసంస్థలపై ప్రత్యేక నిఘా పెట్టాలని.. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోకి ప్రత్యేక కాల్‌ సెంటర్‌ నంబరు ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో హోమంత్రి తానేటి వనిత, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

``ఏసీబీ, దిశ, ఎస్ఈబీ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత. దిశ తరహాలో అవినీతిపై ఫిర్యాదులకు అ.ని.శా.కు యాప్‌. నేర నిర్ధరణకు ఫోరెన్సిక్‌ విభాగం బలోపేతం చేస్తాం. మండల స్థాయి వరకు అ.ని.శా. స్టేషన్లు ఏర్పాటు చేయాలి. ఇతర విభాగాల్లో అవినీతి ఫిర్యాదులపైనా అ.ని.శా. పర్యవేక్షణ. రాష్ట్రంలో డగ్స్‌ వ్యవహారాలకు చోటు ఉండకూడదు. డ్రగ్స్‌ వ్యవహారాలను కూకటివేళ్లతో సహా తొలగించాలి. డ్రగ్స్ విషయంలో విద్యా సంస్థలపై ప్రత్యేక నిఘా. ఎస్ఈబీకి ప్రత్యేక కాల్‌ సెంటర్‌ నంబరు ఏర్పాటు చేయాలి`` అని జ‌గ‌న్ సూచించ‌డం విశేషం. ఇదే ప‌ని రెండేళ్ల కింద‌టే చేసి ఉంటే.. అవినీతి ప‌రుల చేతిలో చిక్కిన వారు బ‌తికి బ‌య‌ట ప‌డేవారు క‌దా! అంటున్నారు నెటిజ‌న్లు.