Begin typing your search above and press return to search.

జై జ‌గన్ : ముంద‌స్తు ఘ‌డియ‌లు ముందుకొచ్చాయా ? ముంచుకొచ్చాయా ?

By:  Tupaki Desk   |   27 April 2022 3:30 AM GMT
జై జ‌గన్ : ముంద‌స్తు ఘ‌డియ‌లు ముందుకొచ్చాయా ? ముంచుకొచ్చాయా ?
X
ఆంధ్ర ప్ర‌దేశ్ లో సంక్షేమ రాజ్య స్థాప‌నే ధ్యేయ‌మ‌ని యువ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప‌దే ప‌దే చెబుతున్నారు.ఆ విధంగా నిధుల‌ను కూడా కేవ‌లం ప‌థ‌కాల అమలు కోస‌మే వెచ్చిస్తూ విమ‌ర్శ‌ల పాల‌వుతున్నారు. ఈ క్ర‌మంలో రేపు ఆయ‌న మ‌రో కీల‌క నిర్ణ‌యం వెలువ‌రించేందుకు సిద్ధం అవుతున్నార‌ని తెలుస్తోంది. పార్టీ నేత‌ల‌తో రేప‌టి వేళ ఆయ‌న భేటీ అయి, ముంద‌స్తు సంకేతాలు ఇవ్వ‌నున్నార‌ని స‌మాచారం. దీంతో పాటు మే రెండు నుంచి గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైసీపీ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్న దృష్ట్యా ఇందుకు సంబంధించి కూడా ఓ దిశ‌ను నిర్దేశం చేయ‌నున్నారు అని స‌మాచారం.

ఇప్ప‌టికే పార్టీలో కొన్ని మార్పులు, ప్ర‌భుత్వంలో కొన్ని మార్పులు జ‌రిగినందున మాజీ మంత్రులు కొంద‌రు జిల్లా అధ్య‌క్షులు అయ్యారు. రీజ‌నల్ కోఆర్డినేట‌ర్లు అయ్యారు. వారితో కలిసి, వారిని క‌లుపుకుని కొత్త మంత్రులు ప‌నిచేయ‌నున్నారు. ఆ విధంగా గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైసీపీ ఎంత‌గా స‌హ‌క‌రించ‌నుందో వేచి చూడాలిక. అదేవిధంగా జిల్లాల‌కు ఇంఛార్జ్ మంత్రుల నియామ‌కం కూడా పూర్తైనందున ఇక‌పై వారి ప‌ర్య‌వేక్ష‌ణ కూడా క్షేత్ర స్థాయిలో జ‌రిగే పాల‌న‌పై ఉండ‌నుంది.

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కూడా జిల్లాల‌కు రానున్నారు. జూలైలో ప్లీనరీ త‌రువాత జ‌నంలోకి రానున్నారు. విరివిగా ప‌ర్య‌ట‌నలు చేయ‌నున్నారు.అయితే తాను వ‌చ్చే లోగానే మంత్రులు మాత్రం ఆక‌స్మిక త‌నిఖీలు చేప‌ట్ట‌డంలో పూర్తి దృష్టి సారించాల‌ని కూడా జ‌గ‌న్ సూచించారు. ప‌రిపాల‌న‌కు సంబంధించి ఇప్ప‌టికే ఈ మూడేళ్ల‌లో ల‌క్షా 35 వేల కోట్ల రూపాయ‌ల‌ను నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే వివిధ ప‌థ‌కాల పేరిట జ‌మ చేసినందున, ముందుగా వ‌లంటీర్ల సాయంతో అర్హులను క‌లుసుకుని, వారితో మాట్లాడేందుకు ప్రాధాన్యం ఇవ్వాల‌ని సీఎం జ‌గ‌న్ ఇప్ప‌టికే ఓ గైడ్ లైన్స్ ఇచ్చారు.

వీలున్నంత వ‌ర‌కూ మోస్ట్ బెనిఫీషియ‌ల్ ఫ్యామిలీస్ ను గుర్తించాల‌ని, అందుకు వలంటీర్ వ్య‌వ‌స్థ‌ను వాడుకోవాల‌ని కూడా ఇదివ‌ర‌కే జ‌గ‌న్ చెప్పారు. ఇవన్నీ దృష్టి లో ఉంచుకుని పార్టీ పెద్ద‌లూ, కార్య‌క‌ర్త‌లు స‌మ‌న్వ‌యం అయి వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ గెలుపున‌కు కృషి చేయాల్సి ఉంది.
ముంద‌స్తు సంకేతాలు వ‌స్తున్నందున కొత్త మంత్రుల్లో కూడా టెన్ష‌న్ మొద‌ల‌యింది. అధికారం పూర్తిగా అంద‌కుండానే ఎన్నిక‌లు త‌రుముకు వ‌స్తే తామేం చేసేది అన్న అంత‌ర్మ‌థ‌నం కూడా వారి దైనందిన జీవితంలో అంత‌ర్భాగం అయింది. కొన్ని చోట్ల కొత్త మంత్రుల నియామ‌కాల‌నే తట్టుకోలేని నాయ‌కులు గ‌డ‌ప‌గ‌డ‌పకూ వైసీపీని ఏ విధంగా విజ‌య‌వంతం చేస్తారో కూడా వేచి చూడాల్సి ఉంది.