Begin typing your search above and press return to search.
వైనాట్ 175 అంటూనే ముందస్తుకు ఎందుకు...?
By: Tupaki Desk | 1 Jan 2023 11:30 PM GMTఏపీలో ముందస్తు ఎన్నికల ప్రచారం అయితె గట్టిగా సాగుతోంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా దీని మీదనే ఒక్కటే చర్చగా ఉంది. ఏపీలో ముందస్తు ఎన్నికలకు చోటిచ్చే ఏడాదిగా 2023ని చెప్పుకుంటున్నారు. మామూలుగా అయితే 2024 లో హీట్ పుట్టాలి. ఎన్నికల ఏడాదిగా 2024 ఉండాలి. కానీ 2023 ఆ క్రెడిట్ ని తీసుకుంటుంది అని అంటున్నారు అంతా.
రాజకీయ చాణక్యుడు చంద్రబాబు ఈ విషయాన్ని చాలా ముందుగానే ఊహించి జిల్లాల టూర్లు పెట్టుకున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎన్నికలు తొందరలోనే అంటున్నారు. అయితే వేసవి. లేకపోతే డిసెంబర్ అని రెండు ముహూర్తాలు బాబే పెట్టేశారు. అంటే బాబు దగ్గర కచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉందనే అంటున్నారు.
ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లో కూడా ఇపుడు వేడి పుట్టింది అంటున్నారు. నిజానికి 2023 రెండవ సగంలో తన బస్సు యాత్రను ప్రారంభించాలనుకున్న పవన్ ఇపుడు టోటల్ ప్రోగ్రాం చేంజ్ చేశారు అని తెలుస్తోంది. వారాహి రధానికి ముక్కోటి ఏకాదశి వేళ పూజలు చేయించడంతోనే రధాన్ని రంగంలోకి దించనున్నారు అని అంటున్నారు. పవన్ వారాహి రధయాత్రకు సంబంధించి పూర్తి వివరాలు సంక్రాతి తరువాత వెల్లడి అవుతాయని అంటున్నారు. ఫిబ్రవరిలో పవన్ బస్సు యాత్ర స్టార్ట్ అవుతుంది అన్నది లేటెస్ట్ టాక్.
ఇవన్నీ ఎందుకు అంటే జగన్ ఈ మధ్య ఢిల్లీ వెళ్ళినపుడు ప్రధాని మోడీ చెవిలో ముందస్తు ఎన్నికల మాటను చెప్పారని అంటున్నారు. ఏపీలో ముందుగా ఎన్నికలకు వెళ్ళాలన్న తన మనసులోని ఆలోచనను ఆయన విడమరచి చెప్పారని తెలుస్తోంది. అయితే దాని మీద మోడీ ఏ రకమైన హామీ ఇచ్చారో తెలియదు అంటున్నారు. ఇదంతా ప్రచారంగా ఉన్నా జగన్ చేస్తున్న దూకుడు వైసీపీలో రేగుతున్న అలజడి పనిచేయని ఎమ్మెల్యే పెట్టిన డెడ్ లైన్లు మార్చితో ఎండ్ కావడం అన్నీ చూసిన వారు మాత్రం వేసవిలో ఏపీలో ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు.
బడ్జెట్ సమావేశాలు మార్చిలో స్టార్ట్ అవుతాయి. కొత్త బడ్జెట్ ని సంక్షేమం, అభివృద్ధితో పూర్తిగా నింపేసి జనాలకు వరాలు అన్నీ ఇచ్చేసి ఏప్రిల్ లో అసెంబ్లీ రద్దు చేస్తారు అని అంటున్నారు. అంటే మే నెలలో ఎన్నికలు పెట్టుకునేందుకు వీలుగా ఈ రకంగా చేస్తారు అని తెలుస్తోంది. అప్పటికి వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళు అవుతుంది. అంటే ఒక ఏడాది పదవీ కాలాన్ని త్యాగం చేస్తే మరో అయిదేళ్ళ పాటు అధికారాన్ని అందుకోవడానికి వీలు ఉంటుంది అని వైసీపీ ఆలొచిస్తోందిట.
ఇక తెలంగాణా ఎన్నికల కంటే ముందే ఏపీలో ఎన్నికలు జరపాలని జగన్ చూస్తున్నారు అని తెలుస్తోంది. తెలంగాణాలో తెలుగుదేశం బీజేపీ పొత్తు ఉంటే అది ఏపీలో కూడా కంటిన్యూ అయితే ఇబ్బంది అవుతుంది అన్నది ఒక్క లెక్క అలాగే బీయారెస్ ఏపీలో ఎంట్రీ ఇవ్వకుండా ఎన్నికలు జరపాలని మరో ఆలోచన ఉంది అంటున్నారు. ఇక ఏపీకి అప్పులు పుట్టని స్థాయిలో ఆర్ధిక సంక్షోభం పతాక స్థాయికి చేరుకున్న వేళ తాము 98 శాతం
హామీలు అమలు చేశామని చెప్పుకుంటూ ఎన్నికలకు వెళ్ళడం ద్వారా రాజకీయ లాభాన్ని పొందాలని జగన్ చూస్తున్నారు అంటున్నారు.
మరి కేంద్రం కనుక ఓకే అంటేనే జగన్ ముందస్తు ఆశలు తీరేది అంటున్నారు. కేంద్రం ఈ విషయంలో అడ్డం తిరిగితే మాత్రం కధ మొత్తం మారుతుంది అంటున్నారు. ఏప్రిల్ లో అసెంబ్లీ రద్దు చేసుకున్నా ఆరు నెలల పాటు రాష్ట్రపతిపాలన పెట్టించి ఆ మీదట డిసేంబర్ లో ఎన్నికలు అంటే మొత్తం ప్లాన్ తారు మారు అవుతుంది అన్న భయం బెంగా వైసీపీ పెద్దలకు ఉన్నాయట. అందువల్ల కేంద్ర పెద్దలు ఓకే అంటేనే అసెంబ్లీ రద్దు ఉంటుంది అంటున్నారు. కేసీయార్ కి ఒకసారి సాయం చేసిన మోడీ జగన్ కి అలా చేస్తారా అన్నది చూడాలి.
అయినా ఇక్కడ ఒక సందేహాన్ని అంతా వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో వై నాట్ 175 అంటూ ఎమ్మెల్యేలను ప్రతీ గడపా తిరగమని చెబుతున్న జగన్ తాను ముందస్తు అంటూ కేంద్ర పెద్దల గడపకు తిరగడం ఏంటి అన్నది కూడా పార్టీ లోపలా బయటా చర్చగా ఉంది. మరి వై నాట్ అంటున్నది అంతా అతి ధీమాతో కాదా మేకపోతు గాంభీర్యమా అన్న చర్చ వస్తుంది. అదే నిజమైతే ముందుగా వెళ్ళినా లేటుగా వెళ్ళినా ఫలితంలో తేడా ఉంటుందా అన్న వారూ ఉన్నారట.