Begin typing your search above and press return to search.
కుమ్ములాటలే జగన్ కొంప ముంచుతాయా...?
By: Tupaki Desk | 15 Jan 2023 9:30 AM GMTవైసీపీ అధిష్టానం అంతర్మథనంలో కూరుకుపోయింది. వచ్చే ఎన్నికల్లో భారీ టార్గెట్ పెట్టుకున్న పార్టీ అధినేత, సీఎం జగన్.. దానిని సాదించాలని ఇప్పటికే పార్టీ నాయకులకు, మంత్రులకు కూడా టార్గెట్ పెట్టారు. ఈ క్రమంలో ఆయన పై స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై నిత్యం సమీక్షిస్తున్నారు. ప్రత్యేకంగా అనేక చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఎన్నికలకు ముందు వలంటీర్ వ్యవస్థ ను పక్కన పెట్టేస్తారని తెలియడంతో.. ఆయన ఏకంగా గృహ సారథులు అనే కాన్సెప్టును కూడా తెచ్చారు.
ఇక, నాయకులను మరింతగా గడపగడపకు పంపిస్తున్నారు. తానుకూడా అప్పులు తెచ్చిన సొమ్మును ప్రజలకు పంచేస్తున్నారు. బటన్‌లు నొక్కేస్తున్నారు. అయితే.. ఇన్ని చేస్తున్నా ప్రతిపక్షాల దూకుడు.. ప్రతివిమర్శలకు చెక్ పెట్టేవిషయంలో మాత్రం వైసీపీ విఫలమవుతోందని పార్టీ అధినేత భావిస్తున్నారు. ఎక్కడికక్కడ నాయకులను ఆయన ముందుకు రావాలని చెబుతున్నా.. చాలా తక్కువ మంది మాత్రమే వస్తున్నారు.
ఈ పరిణామాలకు తోడు..అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్న నేతలు పెరిగిపోతున్నారు. దీంతో ఇప్పుడు ఏం చేయాలనేది పార్టీకి అంతుచిక్కడం లేదు. ఇదిలావుంటే..ఐప్యాక్ టీం.. మరింత లోతుగా పనిచేస్తోంది. ఇప్పటి వరకు నియోజకవర్గాల్లో పర్యటించి.. ఎమ్మెల్యేల తల రాతలపై అధిష్టానానికి నివేదికలు అందించారు. అయితే.. ఇప్పుడు మండలాల స్థాయిలో కూడా పర్యటననలు చేస్తున్నారు.
కీలకమైన వ్యక్తులను మండలాల స్థాయికి పంపించి.. పార్టీ నేతల మధ్య ఉన్న అసంతృప్తిని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఐప్యాక్ సభ్యుల ముందే.. నాయకులు తన్నుకుంటున్నారు. తాజాగా గుంటూరులోని రెండు మండలాల్లో నిర్వహించిన ఐప్యాక్ సర్వే, సమావేశంలో నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలను మార్చాలని మెజారిటీ సభ్యులు గళం వినిపించారు. దీంతో నాయకులకు ఇప్పుడు ఏం చేయాలనేది ప్రశ్నగా మారింది.