Begin typing your search above and press return to search.

ఆ విష‌యంలో జ‌గ‌న్ ఇబ్బంది పడుతున్నారా..?

By:  Tupaki Desk   |   22 Jan 2023 6:18 AM GMT
ఆ విష‌యంలో జ‌గ‌న్ ఇబ్బంది పడుతున్నారా..?
X
ఏపీలో ఈ ఏడాది ప్రారంభంలోతీసుకువ‌చ్చిన జీవో 1 తీవ్ర ర‌చ్చ‌కు దారితీసిన విష‌యం తెలిసిందే. గుం టూరు, కందుకూరుల్లో టీడీపీ అదినేత చంద్ర‌బాబు నిర్వ‌హించిన స‌మావేశాల్లో పలువురు మృత్యు వాత ప‌డ డంతో అలెర్ట‌యిన ప్ర‌భుత్వం వెంట‌నే కొన్ని రెమెడీలు పాటిస్తూ.. జీవో 1 తీసుకువ‌చ్చింది. దీని ద్వారా.. ప్ర‌జల ప్రాణాల‌ను ర‌క్షించాల‌నే వ్యూహం ఉంద‌ని ప్ర‌భుత్వం చెబుతోంది.

అయితే, అనూహ్యంగా ఈ జీవో రాజ‌కీయ ర‌చ్చ‌కు దారితీసింది. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌ల‌కు కూడాతావిచ్చింది. ఇక‌, ఇప్పుడు హైకోర్టుకు చేరింది. మొత్తంగా దీనిని ఈ నెల 23 వ‌ర‌కు స‌స్పెండ్ చేయ‌డం.. దీనిపై రాష్ట్ర స‌ర్కారు సుప్రీంకోర్టుకు వెళ్ల‌డం. అయితే..రెండురోజుల్లో ఎలానూ హైకోర్టు విచారిస్తుంది .. కాబ‌ట్టి. అక్క‌డ ఏం జ‌రుగుతుందో చూసి అప్పుడు చేద్దాం.. అని సుప్రీంకోర్టు మ‌ళ్లీ బంతిని హైకోర్టులోనే వేయ‌డం తెలిసిందే.

అయితే.. ఈ మొత్తం విష‌యంలో సీఎం జ‌గ‌న్ బాధ‌ప‌డుతున్నార‌నేది తాడేప‌ల్లి వ‌ర్గాల మాట‌. అదేంటంటే.. ఒక మంచి ఉద్దేశంతో తీసుకువ‌చ్చిన జీవో 1ని.. ఉద్దేశ పూర్వ‌కంగా రాజ‌కీయం చేస్తున్నార‌నేది ఆయ‌న ఆవే ద‌న‌ట‌. అదే స‌మ‌యంంలో త‌న పార్టీ నాయ‌కులు దీనిపై ఎందుకు పాజిటివ్‌గా ప్ర‌చారం చేయ‌డం లేద‌ని ఆయ‌న ఆందోళ‌న‌. మొత్తంగా.. రాజ‌కీయ వివాదాల జాబితాలో జీవో 1 చేర‌డంతోపాటు.. ఒక వ‌ర్గం మీడియా దీనిని భూతద్దంలో చూస్తోంద‌ని.. కూడా సీఎం వాపోతున్నార‌ట‌.

రోడ్డు ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి కాబ‌ట్టి.. ప్ర‌యాణాలు నిషేధించేలా జీవో ఇస్తే.. బాగుంటుంద‌నే వాద‌న ఒక‌టి తెర‌మీదికి వ‌చ్చింది. నిజానికి రోడ్డు ప్ర‌మాదాలు అనేవి.. ఉద్దేశ పూర్వ‌కం కాదు. కానీ,ఒక స‌భ నిర్వ హించేప్పుడు ఉద్దేశ పూర్వ‌కంగా ప్ర‌జ‌ల ప్రాణాలు తీయాల‌ని లేక‌పోయినా.. షూటింగుల కోసం.. సాహ‌సాలు చేసిన‌ట్టు.. ఇరుకిరుకు సందుల్లో స‌భ‌లు పెట్ట‌డం ఎవ‌రికీ మంచిది కాదు. పార్టీల‌కు అతీతంగా నాయ‌కులు ఈ విష‌యంలో ఆలోచ‌న చేయ‌గ‌లిగి ఉంటే.. అస‌లు ఈ జీవో అవ‌స‌ర‌మే ఉండేది కాదు! ఇదే ఇప్పుడు అధికార పార్టీలో అంత‌ర్మ‌థనంగా మారింది.