Begin typing your search above and press return to search.

ఆ రెండూ ఉంటే : జగన్ ధీమా అదన్న మాట ....?

By:  Tupaki Desk   |   16 Jun 2022 2:30 AM GMT
ఆ రెండూ ఉంటే : జగన్ ధీమా అదన్న మాట ....?
X
ఎన్నికల్లో వ్యూహాలు ఉండాలి. అసలు యుద్ధం అన్నది ఎన్నికల్లోనే ఉంటుంది. ఎవరు ఏమిటి అన్నది తెలియని పరిస్థితులలో కరెక్ట్ గా వ్యూహాలను రూపొందించుకోకపోతే ఎంతవారు అయినా బొక్క బోర్లా పడతారు. ఇక వ్యూహాలలో చంద్రబాబును అపర చాణక్యుడు అంటారు. ఆయన వందశాతం హిట్ కాకపోయినా ఎక్కువ సార్లు వ్యూహాలనే నమ్ముకుని గెలిచారు.

వచ్చే ఎన్నికలకు కూడా బాబు మార్క్ స్ట్రాటజీలు ఎన్నో లైన్ లో పెడుతున్నారు. ఈసారి చావో రేవో అన్నట్లుగానే ఎన్నికలు జరుగుతాయి. ఈ విషయంలో రెండవ మాటే లేదు. కానీ అధికారంలో ఉన్న జగన్ మాత్రం రెండుంటే చాలు అందలం మళ్ళీ తన వైపు అని ధీమాగా చెబుతున్నారు. ఆయన చెబుతున్న దాన్ని చూస్తే లాజిక్ లేదు, వ్యూహం లేదు కేవలం సెంటిమెంట్ మాత్రమే ఉంది అనిపిస్తుంది.

అదెలా అంటే జగన్ తాజాగా జరిగిన శ్రీ సత్యసాయి జిల్లా సభలో విపక్షాల గురించి మాట్లాడుతూ ఎవరెంతమంది వస్తారో రండి, అందరూ కలసి వచ్చినా తనను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా వెనక్కి తగ్గేది లేదు అని గట్టిగా చెప్పుకున్నారు. తనకు దేవుడి ఆశీస్సులు పుష్క‌లంగా ఉన్నాయని, ఇక జనాల నిండు దీవెనలు కూడా ఉన్నాయని జగన్ అంటున్నారు.

మరి జగన్ కి ఈ విషయంలో కొండంత నమ్మకం ఉంటే ఓకే కానీ అది ఎన్నికల రణరంగాన ప్రత్యర్ధులు వదిలే బాణాలను అస్త్రాలను తట్టుకుని గెలుపు తీరాలని చేరుస్తుందా అన్నదే ఇక్కడ ప్రశ్న. జగన్ చెబుతున్న దేవుడి ఆశీస్సులు ఎపుడు పక్షపాతంగా ఒక వైపే ఉండవు, నిజానికి దేవుడికి అందరూ సమానులే కాబట్టి ఆయన ఎల్లకాలం జగన్ పక్షమే ఉంటూ కురుక్షేత్రాన శ్రీక్రిష్ణుడు అర్జునుడి రధం తోలిన చందాన వైసీపీ రధ సారధిగా జగన్ వెంట నిలవడు.

ఆయనకు చంద్రబాబు పవన్ బాబూ కూడా సమానమే. కాబట్టి. దేవుడు నావాడు ఆయన వైసీపీ పార్టీ అని చెప్పుకోవడానికి ఏ కొశానా వీలులేదు. సో ఇది కేవలం దైవభావన తప్ప మరోటి కాదు అని భావినాలి. ఇక జనాల దీవెనలు అన్నది కూడా ఇదే రకంగా ఆలోచించాలి. ప్రజలు కూడా కదిలే నది లాంటి వారు. వారి భావాలు ఎల్ల కాలం ఒక వైపుగా ఒకరి మీదుగానే ఉంటూ ఆగిపోవు.

అలా కనుక జరిగితే అధికారంలో ఎపుడూ ఒకరే ఉంటారు. ఇంతకు వేయింతలు చంద్రబాబు కూడా జనాలు నా వైపే అని 2019 ఎన్నికల ఫలితాల దాకా నిబ్బరం కనబరచారు. తీరా ఫలితాలు వచ్చాకనే ఆయన అదే జనాలని తూలనాడారు. ప్రజలు తప్పు చేశారు అని కూడా ఒక దశలో మండారు. అంటే. జనాలు ఎపుడూ ఏ ఒక్క నాయకుడికి కట్టుబడి ఉండారు. మరి జగన్ మాత్రం తన రాజకీయ వ్యూహాలు ఇవే అంటూ చెప్పడం ద్వారా చేతులెత్తేసారా అన్న చర్చ అయితే సాగుతోంది.

ఆయన అంతకు ముందు తిరుపతిలో జరిగిన ఒక సభలో కూడా విపక్షాలు ఎల్లో మీడియా చేస్తున్న విష ప్రచారం నుంచి ఆ దేవుడే కాపాడాలి అంటూ తిరుపతి వెంకన్నకు దండం పెట్టారు. రణరంగాన ఉన్నపుడు భక్తి భావన చెల్లదు. ఎదురుగా పదునైన అస్త్రాలు వచ్చి శరీరాన్ని గుచ్చాలని చూస్తున్నపుడు జపం చేస్తూ కూర్చుంటే ఫలితం ఉండదు.

మరి జగన్ నిజంగా ఇలాగే నమ్మి అతి ధీమాతో ముందుకు వెళ్తున్నారా లేక జనాలను తిప్పుకోవడానికి ఏమైనా కొత్త వ్యూహాలను రచిస్తున్నారా అన్నదే ఇక్కడ చూడాల్సిన విషయం. నా జనం నాకున్నారు. నా దేవుడు నాకే పలుకుతారు అని అతి ధీమాతో జగన్ 2024 ఎన్నికలను ఫేస్ చేస్తే మాత్రం ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.